పండంటి బిడ్డకు జన్మనిచ్చిన బుల్లితెర నటి..వీడియో వైరల్! | TV Actress Lahari Revealed Her Baby Gender In Hospital; Video Viral - Sakshi
Sakshi News home page

బిడ్డకు జన్మనిచ్చిన బుల్లితెర నటి..వీడియో వైరల్!

Sep 1 2023 2:53 PM | Updated on Sep 1 2023 3:20 PM

TV Actress Lahari Reveled Her Baby Gender In Hospital - Sakshi

సీరియల్స్‌తో బాగా ఫేమస్‌ అయిన  నటి లహరి. మొగలి రేకులు నుంచి గృహలక్ష్మి వరకు పలు సీరియల్స్‌లో భిన్నరకాల పాత్రలు చేస్తూ మెప్పిస్తూ వస్తోంది. పెళ్లి తర్వాత నటనకు కాస్త గ్యాప్‌ ఇచ్చింది లహరి.  గతంలోనే గర్భం దాల్చినట్లు సోషల్ ద్వారా పంచుకుంది. అంతే కాకుండా ఎప్పటికప్పుడు అప్‌ డేట్స్ ఇస్తూ అభిమానులతో టచ్‌లోనే ఉంటోంది. ఇటీవలే తొమ్మిదినెలలో సీమంతం జరిగిన వేడుకను సోషల్ మీడియా ద్వారా పంచుకుంది.

(ఇది చదవండి: తొమ్మిదవ నెల గర్భంతో లహరి, సీమంతం ఫోటోలు వైరల్‌)

తాజాగా మరో క్రేజీ వార్తను అభిమానులతో పంచుకుంది. తనకు మగబిడ్డ జన్మించినట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ వీడియోను పోస్ట్ చేసింది. తాను ప్రసవించిన ఆస్పత్రిలో కేక్ కట్‌ చేస్తూ ఈ విషయాన్ని తెలిపింది.  ఇది చూసిన అభిమానులు ఆమెకు అభినందనలు తెలుపుతున్నారు. 

(ఇది చదవండి: బేబీ బంప్‌తో బుల్లితెర నటి.. సోషల్ మీడియాలో వైరల్!)


 

Advertisement
 
Advertisement
Advertisement