బాలీవుడ్ భామ పరిణీతి చోప్రా గతనెలలో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ప్రముఖ పొలిటీషియన్ రాఘవ్ చద్దాను పెళ్లాడిన ముద్దుగుమ్మ.. రెండేళ్ల తర్వాత అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. అక్టోబర్ 19న మొదటి బిడ్డను తమ జీవితంలో ఆహ్వానించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది.
తాజాగా తమ ముద్దుల చిన్నారికి బారసాల కార్యక్రమం నిర్వహించారు ఈ జంట. బాబు పుట్టిన నెల రోజులకు పేరు పెట్టారు. తమ బిడ్డకు నీర్ అని నామకరణం చేశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. జలస్య రూపం, ప్రేమస్య స్వరూపం - తత్ర ఏవ నీర్.. మా హృదయాలు జీవితంలో శాశ్వతమైన శాంతిని పొందాయి.. మా అబ్బాయికి నీర్ అని పేరు పెట్టాం అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. నీర్ అంటే స్వచ్ఛమైన, దైవిక, పరిమితం లేని అనే అర్థం వస్తుందని వెల్లడించారు. పరిణీతిలోని నీ... రాఘవ్‌లోని రా కలిసి వచ్చేలా తమ ముద్దుల బిడ్డకు నామకరణం చేశారు.
(ఇది చదవండి: బిడ్డకు జన్మనిచ్చిన పరిణీతి చోప్రా.. సోషల్ మీడియాలో పోస్ట్)
ఈ ఏడాదిలో ఆగస్టులో పరిణీతి, రాఘవ్ ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు ప్రకటించారు. వీరిద్దరు సెప్టెంబర్ 2023లో పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. ఢిల్లీలో జరిగిన వీరి వివాహానికి పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు హాజరయ్యారు. ఇక సినిమాల విషయానికొస్తే గతేడాది అమర్ సింగ్ చంకీలా చిత్రంలో దిల్జీత్ దోసాంజ్ సరసన పరిణీతి చోప్రా కనిపించింది. ఈ ఏడాది కేవలం ఓ సినిమాతో పాటు వెబ్ సిరీస్‌లో మాత్రమే నటించింది.


