
బాలీవుడ్ భామ పరిణితి చోప్రా (Parineeti Chopra) పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఏడాది ఆగస్టులో అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన బ్యూటీ.. ఈ దివాళీని మరింత హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోనుంది. తమకు బాబు పుట్టాడని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది ముద్దుగుమ్మ. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు, సినీతారలు విషెస్ చెబుతున్నారు. కాగా.. 2023లో పరిణీతి చోప్రా.. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దాను పెళ్లాడిన సంగతి తెలిసిందే.
ఇక సినిమాల విషయానికొస్తే గతేడాది అమర్ సింగ్ చంకీలా చిత్రంలో దిల్జీత్ దోసాంజ్ సరసన పరిణీతి చోప్రా కనిపించింది. ఈ ఏడాది కేవలం ఓ సినిమాతో పాటు వెబ్ సిరీస్‌లో మాత్రమే నటించింది. ఇటీవల పరిణితి చోప్రా ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో పాల్గొన్న తర్వాత తాను గర్భంతో ఉన్నట్లు శుభవార్తను పంచుకున్న సంగతి తెలిసిందే.
(ఇది చదవండి: ప్రెగ్నెన్సీతో పరిణీతి చోప్రా.. పుట్టబోయే బిడ్డకు స్టార్ హీరోయిన్ గిఫ్ట్!)
అంతేకాకుండా పరిణీతి చోప్రా ఇటీవలే తన యూట్యూబ్ ఛానెల్‌ను తిరిగి ప్రారంభించింది. ఓ వీడియోను సైతం తన ఛానెల్‌లో అప్‌లోడ్ చేసింది. బాలీవుడ్‌లో ఆమె నటించిన ఇష్క్ జాదే, శుద్ద్ దేశీ రొమాన్స్, మేరీ ప్యారీ బిందు, కేసరి, అమర్ సింగ్ చమ్కీలా లాంటి బాలీవుడ్ చిత్రాలు పరిణీతి చోప్రాకు మంచి పేరు తీసుకొచ్చాయి.