హిందీ సినిమా 'మస్తీ 4' ఫ్లాప్ అయినప్పటికీ తనకు మాత్రం బాగానే కలిసొచ్చిందంటోంది నటి ఎల్నాజ్ నురోజి. మస్తీ 4 బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాన్ని అందుకోనప్పటికీ వ్యక్తిగతంగా, వృత్తిపరంగా తనను తాను మెరుగుపర్చుకోవడానికి ఉపయోగపడిందని చెప్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఎల్నాజ్ మాట్లాడుతూ.. మస్తీ 4 నాకు చాలా బాగా ఉపయోగపడింది.
ట్రై చేశా..
సినిమా రిజల్ట్ బాగోలేకపోయినప్పటికీ పర్ఫామెన్స్‌కు మాత్రం ప్రశంసలు దక్కాయి. నేను కామెడీ యాంగిల్ ట్రై చేయాలని ఎప్పటినుంచో అనుకున్నా.. అది ఈ సినిమాతో నెరవేరింది. నేను కామెడీ కూడా చేయగలనని ప్రేక్షకులకు నిరూపించాను. సేక్ర్‌డ్ గేమ్స్, అభయ్ వంటి ప్రాజెక్టులలో సీరియస్ పాత్రలు పోషించాను. రాణ్నీతిలో అయితే మరింత సీరియస్‌గా కనిపిస్తాను. కొత్తగా ఏదైనా చేయాలనిపించింది.
నేనే ధైర్యం తెచ్చుకుని..
ఆ విషయంలో మస్తీ 4 నాకు దోహదపడింది. అయితే సినిమా అనుకున్న రీతిలో ఆడనప్పుడు ఎవరైనా బాధపడతారు. అలా అని నేను రోజులకొద్దీ బాధపడుతూ కూర్చునే మనిషిని కాదు. ఒకటీరెండురోజులు ఫీలవుతాను. తర్వాత నాకు నేనే ధైర్యం తెచ్చుకుని ముందుకు సాగుతాను. ఎందుకంటే సినిమా రిజల్ట్ మన చేతుల్లో ఉండదు.
నా లైఫ్ నాది
మస్తీ 4 మూవీలోని అడల్ట్ జోక్స్‌పై జరిగిన ట్రోలింగ్‌ను నేనస్సలు లెక్క చేయలేదు. ఈ నెగెటివిటీనే నేను పట్టించుకోను. నా జీవితం నాది.. పైగా కొన్నిసార్లు ట్రోల్స్‌ను నా ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకుని నవ్వుతుంటాను కూడా! అని నటి ఎల్నాజ్ చెప్పుకొచ్చింది.
చదవండి: 'మా జీవితాల్లో విలన్ ఎవరూ లేరు.. 15 ఏళ్ల బంధానికి ముగింపు'


