
టాలీవుడ్ కమెడియన్ మహేశ్ విట్టా.. గుడ్ న్యూస్ చెప్పేశాడు. తాను తండ్రిగా ప్రమోషన్ పొందానని చెప్పుకొచ్చాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఫొటోని షేర్ చేశాడు. రెండు నెలల క్రితం తన భార్య ప్రెగ్నెన్సీ గురించి బయటపెట్టిన ఇతడు.. గత నెలలో సీమంతం వీడియోని పోస్ట్ చేశాడు. ఇప్పుడు తన భార్య ప్రసవించిందని చెప్పి ఆనందం వ్యక్తం చేశాడు.
(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా)
యూట్యూబ్ వీడియోలతో పాపులారిటీ తెచ్చుకున్న మహేశ్ విట్టా.. తర్వాత టాలీవుడ్‌లోకి వచ్చాడు. కృష్ణార్జున యుద్ధం, కొండపొలం, జాంబీరెడ్డి, ఏ1 ఎక్స్‌ప్రెస్ తదితర సినిమాల్లో నటించాడు. బిగ్‌బాస్ షోలోనూ రెండుసార్లు పాల్గొన్నాడు. ప్రస్తుతం ఓ వెబ్ సిరీస్ చేస్తున్నాడు. మరో సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. బిగ్‌బాస్ హౌసులో ఉండగానే తన ప్రేమ సంగతి చెప్పాడు. అదే ఏడాది శ్రావణి రెడ్డి అనే అమ్మాయిని పెళ్లి కూడా చేసుకున్నాడు.
మహేశ్ విట్టా చెల్లెలి ఫ్రెండ్ శ్రావణి. దాదాపు ఐదేళ్ల పాటు ప్రేమించుకున్న వీళ్లిద్దరూ.. పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు మహేశ్ భార్య మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ మేరకు ఇన్ స్టాలో పోస్ట్ పెట్టి తన ఆనందాన్ని పంచుకున్నాడు. ఈ క్రమంలోనే నెటిజన్లు ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.
(ఇదీ చదవండి: ప్రేమ కోసం లండన్ నుంచి చెన్నై.. దళపతి విజయ్ భార్య బ్యాక్ గ్రౌండ్ తెలుసా?)