
మిస్టరీ, థ్రిల్లర్ సినిమాలకు ఓటీటీలో సెపరేట్ ఫ్యాన్స్ ఉంటారు. మరోవైపు చిన్న సినిమాలు థియేటర్లలో రిలీజైనప్పుడు పెద్దగా ఎవరూ పట్టించుకోరు. ఒకవేళ ఓటీటీలోకి వస్తే మాత్రం టైమ్ పాస్ కోసం అలా చూస్తుంటారు. ఇప్పుడు సినీ ప్రేమికుల కోసం అలాంటి ఓ తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. దాదాపు ఏడాది తర్వాత స్ట్రీమింగ్ అవుతోంది. ఇంతకీ ఏంటా సినిమా?
గతేడాది ఆగస్టు 23న థియేటర్లలో రిలీజైన తెలుగు మూవీ 'బ్రహ్మవరం పీఎస్ పరిధిలో'. గురు చరణ్, సూర్య శ్రీనివాస్, స్రవంతి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. థియేటర్లలోకి వచ్చినప్పుడు పర్లేదనిపించే రెస్పాన్స్ అందుకుంది. మరోవైపు స్టార్స్ ఎవరూ లేకపోవడంతో దీనికి పెద్దగా ఆదరణ దక్కలేదు. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి అద్దె విధానంలో అందుబాటులోకి వచ్చింది. ఆసక్తి ఉంటే ఓ లుక్కేయొచ్చు.
(ఇదీ చదవండి: అనిరుధ్‌కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్)
'బ్రహ్మవరం పీఎస్ పరిధిలో' విషయానికొస్తే.. చైత్ర (స్రవంతి బెల్లంకొండ) అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. తాను ఇష్టపడటం కంటే తనని ప్రేమించే కుర్రాడు తనకు భర్తగా రావాలని కోరుకుంటుంది. సూర్యలో (సూర్య శ్రీనివాస్) అలా కనిపించేసరికి అతడితో ప్రేమలో పడుతుంది. గౌతమ్ (గురుచరణ్) ఓ జులాయి. ఇతడి తండ్రి పట్టాభి పోలీస్ కానిస్టేబుల్. తన కళ్ల ఎదుట తప్పు జరిగితే గౌతమ్ సహించలేడు.
ఓ సందర్భంలో బ్రహ్మవరం ఎస్ఐని ఎదురించిన గౌతమ్.. అతడికి శత్రువుగా మారుతాడు. అనుకోకుండా ఓ రోజు బ్రహ్మవరం పోలీస్ స్టేషన్ దగ్గరలో ఓ శవం దొరుకుతుంది. ఆ కేసు సంచలనంగా మారుతుంది. దీంతో పోలీసులు విచారణ మొదలుపెడతారు. సరిగ్గా అదే సమయంలో గౌతమ్‌ని కలవడం కోసం చైత్ర, అమెరికా నుంచి స్వదేశానికి వస్తుంది. ఆ శవానికి చైత్ర, గౌతమ్‌లకు సంబంధమేంటి? హంతుకుడు దొరికాడా లేదా అనేది మిగతా స్టోరీ.
(ఇదీ చదవండి: ప్రేమ కోసం లండన్ నుంచి చెన్నై.. విజయ్ భార్య బ్యాక్ గ్రౌండ్ తెలుసా?)