అనిరుధ్‌కు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ | Anirudh Ravichander’s ‘Hukum Tour’ Gets Madras HC Nod, Grand Concert in Chennai | Sakshi
Sakshi News home page

అనిరుధ్‌కు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌

Aug 23 2025 10:42 AM | Updated on Aug 23 2025 11:23 AM

Madras High court allows Anirudh Music concert event

యువ సంగీత కెరటం అనిరుధ్ రవిచందర్‌(Anirudh Ravichander)కు మద్రాస్‌ హైకోర్టు నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చేసింది. 'హుక్కుమ్'‌ పేరుతో ప్రపంచ వ్యాప్తంగా సంగీత కచేరిలను నిర్వహించాలని ఆయన తలపెట్టారు. అందులో భాగంగా చెన్నైలో నేడు సాయింత్రం (ఆగష్టు 23)వ తేదీన నిర్వహించనున్నారు. చెన్నై సముద్ర తీర ప్రాంతం, కువత్తూర్‌లోని స్వర్మభూవి ప్రాంతంలో ఈ కార్యక్రమం జరుగనుంది. అందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. టికెట్ల బుకింగ్‌ కూడా భారీ ఎత్తున జరుగుతున్నట్లు అనిరుద్‌ వెల్లడించారు. అయితే ఈ సంగీత కచేరిని నిర్వాహకులు కలెక్టర్‌ అనుమతి పొందకుండా నిర్వహిస్తున్నారని, నిర్వహణ ప్రాంతంలో వచ్చే ప్రజలకు కనీస వసతులు కూడా ఏర్పాటు చేయలేదని, అందువల్ల ఆ సంగీత కచేరి జరగకుండా నిషేధం విధించాలని కోరుతూ  చెయ్యూర్‌ నియోజకవర్గం శాసనసభ్యుడు పనైయూర్‌ బాబు  చెన్నై హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. 

ఈ పిటీషన్‌పై విచారణ చేపట్టిన న్యాయమూర్తి ఆనంద్‌ వెంకటేష్‌ పలు సూచనలు ఇచ్చి...  అనిరుద్‌ హుక్కుమ్‌ పేరుతో నిర్వహిస్తున్న సంగీత కచేరీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తూ తీర్పు ఇచ్చారు. అయితే ప్రజల భద్రత దృష్ట్యా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా మహాబలిపురం డీఎస్సీ అనుమతి పొందాలని ఆదేశాలు జారీ చేశారు.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement