
'కలర్ ఫోటో' సినిమాతో ఫేమ్ తెచ్చుకుని ఆడపాదడపా మూవీస్ చేస్తున్న హీరో సుహాస్.. ఇప్పుడు మరోసారి తండ్రయ్యాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. ఈ క్రమంలోనే తోటి సెలబ్రిటీలు, స్నేహితులు.. ఇతడికి శుభాకాంక్షలు చెబుతున్నారు.
(ఇదీ చదవండి: పెళ్లికి ముందే ప్రెగ్నెన్సీ.. కడుపు తీయించుకుంది: హీరో ధర్మ మహేశ్)
షార్ట్ ఫిల్మ్స్‌తో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న సుహాస్.. తర్వాత టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు చిత్రాల్లో నటించాడు. 'కలర్ ఫోటో' మూవీతో హీరోగా మారి హిట్ కొట్టాడు. 'రైటర్ పద్మభూషణ్', 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్' తదితర చిత్రాలు కూడా ఇతడికి బాగానే పేరు తీసుకొచ్చాయి.
అసలు విషయానికొస్తే గతేడాది జనవరిలో సుహాస్ భార్య లలిత మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇప్పుడు మరోసారి వీళ్లకు కొడుకు పుట్టాడు. ఈ విషయాన్ని సుహాస్ ప్రకటించాడు. సుహాస్‌ది ప్రేమ వివాహం. ఏడేళ్లు పాటు ప్రేమించుకున్నారు కానీ పెద్దలు నో చెప్పేసరికి లేచిపోయి 2017లో పెళ్లి చేసుకున్నారు. లలిత.. తనకు భార్య అయిన తర్వాత చాలా కలిసొచ్చిందని సుహాస్ గతంలో పలుమార్లు చెప్పాడు. ఇప్పుడు వీళ్ల ప్రేమకు గుర్తుగా ఇద్దరు వారసులు పుట్టారు. ప్రస్తుతం సుహాస్, తెలుగులో రెండు తమిళంలో ఓ సినిమా చేస్తున్నాడు.
(ఇదీ చదవండి: ఓజీలో పవన్ కూతురిగా సాయేషా.. ఎవరీ పాప?)