
బిందెలో చిక్కుకున్న దివ్యన్ తల
చెన్నై,అన్నానగర్: మూడేళ్ల బిడ్డ ఆడుకుంటూ బిందె వద్దకెళ్లి తలదూర్చింది. ఇంకేముంది తల బిందెలో ఇరుక్కుపోయింది. ఈ ఘటన ఆవడి సమీపంలో గురువారం కలకలం సృష్టించింది. ఆవడి సమీపంలోని కోవిల్‌పదాగై అశోక్ నగర్‌కు చెందిన శ్రీనివాసన్ చెన్నై పాడిలో ఉన్న ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నాడు. ఇతని కుమారుడు దివ్యన్ (3). గురువారం సాయంత్రం ఇంట్లో ఆడుకుంటున్నదివ్యన్ తల బిందెలో చిక్కుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సిల్వర్ బిందెలో నుంచి దివ్యన్ తలను బయటకు తీశారు.