తండ్రి అయిన అమలాపాల్‌ మాజీ భర్త

Director AL Vijay and his wife Aishwarya Welcomed A Baby Boy - Sakshi

చెన్నై: ప్రముఖ దర్శకుడు ఏఎల్‌ విజయ్‌ తండ్రి అయ్యాడు. ఆయన సతీమణి ఐశ్వర్య విజయ్‌ శనివారం ఉదయం పండంటి బిడ్డకు జన్మనిచింది. చెన్నైలోని ఓ ప్రయివేట్‌ ఆస్పత్రిలో ఐశ్వర్య విజయ్‌ మగబిడ్డకు జన్మనిచ్చిందని, తల్లీ బిడ్డలు క్షేమంగా ఉన్నట్లు విజయ్‌ సోదరుడు, నటుడు ఉదయ తెలిపారు. ‘నేను పెద్దనాన్నని అయ్యాను. ఉదయం 11.25 గంటల సమయంలో విజయ్‌, ఐశ్వర్య దంపతులకు మగ బిడ్డ పుట్టాడు. చాలా సంతోషంగా ఉంది’ అని ఉదయ ట్వీట్ చేశారు. (రూ.30 కోట్లు అడగలేదు: నటుడి భార్య)

​కాగా హీరోయిన్‌ అమలాపాల్‌తో విడాకుల అనంతరం డాక్టర్‌ ఆర్‌.ఐశ్వర్యను దర్శకుడు ఏఎల్‌ విజయ్‌ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. విజయ్ 2014లో అమలాపాల్‌ను ప్రేమ వివాహం చేసుకున్నారు. మూడేళ్లు వీరి వైవాహిక జీవితం బాగానే సాగింది. ఆ తరవాత వ్యక్తిగత కారణాల వల్ల వీరిద్దరూ విడిపోయారు. 2017లో విడాకులు తీసుకున్నారు. కాగా, ప్రస్తుతం అమలాపాల్ సింగిల్‌గానే ఉన్నారు. (బాలయ్యకు మద్దతు తెలిపిన నిర్మాత)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top