తండ్రి అయిన తెలుగు యంగ్ హీరో.. ఫొటో వైరల్ | Actor Suhas And His Wife Lalitha Blessed With Baby Boy | Sakshi
Sakshi News home page

Suhas: అద్భుతమైన రోజు.. ఆ హీరోకి కొడుకు పుట్టాడు!

Jan 22 2024 2:40 PM | Updated on Jan 22 2024 2:56 PM

Actor Suhas Wife Lalitha Deliver Baby Boy - Sakshi

ప్రస్తుతం అందరూ శ్రీరామ నామజపం చేస్తున్నారు. అయోధ్య రామమందిర ప్రతిష్టాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఇలాంటి అద్భుతమైన రోజున ఓ తెలుగు హీరో సుహాస్ తండ్రి అయ్యాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా రివీల్ చేసి తన ఆనందాన్ని అందరితో పంచుకున్నాడు. 

షార్ట్ ఫిల్మ్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న సుహాస్.. ఆ తర్వాత పలు సినిమాల్లో కామెడీ, క్యారెక్టర్ ఆర్టిస్టు రోల్స్ చేశాడు. 'కలర్ ఫోటో' మూవీతో హీరోగా చాలా గుర్తింపు తెచ్చుకున్నాడు. గతేడాది 'రైటర్ పద్మభూషణ్' అనే సినిమాతోనూ ఆకట్టుకున్నాడు. ఇతడు నటించిన 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్'.. ఫిబ్రవరి 2న థియేటర్లలోకి రానుంది.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 27 సినిమాలు రిలీజ్.. అదొక్కటి స్పెషల్)

తాజాగా సోమవారం (జనవరి 22)న తన భార్యకు మగబిడ్డ పుట్టినట్లు సుహాస్ వెల్లడించాడు. 'ప్రొడక్షన్ నం.1' అని ఓ ఫన్నీ క్యాప్షన్‌తో తను తండ్రి అయిన విషయాన్ని బయటపెట్టాడు. ఇకపోతే సుహాస్ భార్య పేరు లలిత. వీళ్లిది ప్రేమ వివాహం. దాదాపు ఏడేళ్లు పాటు ప్రేమించుకున్నారు. కానీ పెద్దలు నో చెప్పడంతో లేచిపోయి వచ్చి 2017లో పెళ్లి చేసుకున్నారు.

ఇక లలిత.. తనకు భార్య అయిన తర్వాత చాలా కలిసొచ్చిందని సుహాస్ పలుమార్లు చెప్పుకొచ్చాడు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో భార్యతో ఉన్న ఫొటోలని సుహాస్ చేస్తుంటాడు. ఇప్పుడు వీళ్ల ప్రేమకు గుర్తుగా బుల్లి సుహాస్ వచ్చాడనమాట.

(ఇదీ చదవండి: 14 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన సినిమా.. ఫ్రీగా చూసే ఛాన్స్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement