దర్శకుడి ఇంట్లోకి వారసుడు.. పేరేంటో తెలుసా!

Director Pa Ranjith Blessed With A Baby Boy - Sakshi

సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌తో కబాలి, కాలా వంటి చిత్రాలు రూపొందించిన కోలీవుడ్‌ దర్శకుడు పా రంజిత్‌ కుటుంబంలో ఆనందాలు వెల్లువిరిశాయి. రంజిత్‌ రెండోసారి తండ్రి అయ్యినట్లు కోలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన భార్య అనిత చెన్నైలోని ప్రైవేటు ఆసుపత్రిలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్లు సోషల్‌ మీడియాలో ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే తనకు కొడుకు పుట్టిన విషయాన్ని రంజిత్‌ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. ప్రస్తుతం తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక పుత్రోత్సాహంతో ఉన్న రంజిత్‌ ఇప్పటికే తన కొడుక్కి మిలిరాన్‌గా నామకరణం చేసినట్లు సమాచారం. రంజిత్‌ దంపతులకు ఇప్పటికే మఘజిని అనే కూతురు ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల కూతురు పుట్టినరోజు వేడుకలను నిర్వహించిన పా రంజిత్‌ తన కూతురుకు బర్త్‌డే రోజు ప్రత్యేక సందేశాన్ని రాశారు. ('ఆయన బాడీని చూస్తుంటే ఇండియన్‌ టైసన్‌లా')

కాగా పా రంజిత్‌, అనితలది ప్రేమ వివాహం. డిగ్రీ చదివే రోజుల్లోనే వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. అనంతరం ప్రేమలో పడిన వీరు పెళ్లి బంధంతో ఒకటయ్యారు. ఇక సినిమాల విషయానికొస్తే ఆర్యతో కలిసి బాక్సింగ్‌ నేపథ్యంలో సాగే ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటుంది. అయితే ఈ సినిమాకు మొదట సూర్యను అనుకున్నట్లు సమాచారం. చివరకు సూర్యతో కుదరకపోవడంతో ఆర్యతో తెరకెక్కిస్తున్నారు. (వావ్‌.. అచ్చం ఐశ్యర్యరాయ్‌ లాగే..)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top