వావ్‌.. అచ్చం ఐశ్యర్యరాయ్‌ లాగే..

Aishwarya Rai Doppelganger Manasi Naik Goes Viral on The Internet - Sakshi

ఐశ్వర్యరాయ్‌.. అందానికి కేరాఫ్‌ అడ్రస్‌. అందం అంటే ఆమెదే. కుర్రకారు మొద‌లుకుని సినీ నిర్మాత‌ల వ‌ర‌కూ ఆమె అందానికి ఆక‌ర్షితులే. ప్రతి ఒక్కరు అందాన్ని ఆమెతో పోల్చి చెబుతారు. అలాంటి అందమైన స్త్రీ భూమ్మీద మరొకరు  ఉండరని అంటుంటారు. కానీ ఉన్నారు. ఆమే మారాఠీ నటి మనసి నాయక్‌. ఐశ్యర్యరాయ్‌ లాంటి కళ్లు, అందం గల మనసి నాయక్‌.. ఇటీవల సోషల్‌ మీడియాలో ఫేమస్‌ అయ్యారు. ఆమె చేసిన టిక్‌టాక్‌ వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఆమె ఫోటోలు, వీడియోలు చూసిన ప్రతి ఒక్కరు అచ్చం ఐశ్యర్యరాయ్‌ లాగే ఉన్నారని పొగిడేస్తున్నారు.

ఇక తనను ఐశ్యర్యరాయ్‌తో పోల్చడంతో తెగ సంబరపడిపోతుంది మనసి నాయక్‌. ఐశ్వర్యరాయ్‌ సినిమాలోని పాటలకు టిక్‌టాక్‌ వీడియోలు చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు. ఆమె వీడియోలు చూసిన ప్రతి ఒక్కరు అచ్చం ఐశ్యర్యరాయ్‌లా ఉన్నారని కామెంట్‌ చేస్తున్నారు. ‘ఐశ్యర్యరాయ్‌ డూబ్లికేట్‌’, , ‘ఐశ్యరాయ్‌ జిరాక్స్‌’, , ‘యంగ్‌ ఐశ్యర్యరాయ్‌’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. 

మనసి నాయక్‌ ప్రముఖ మరాఠి నటి. ‘బాగ్తోయి రిక్షావాలా’ అనే ఐటమ్‌ సాంగ్‌లో నటించి ఫేమస్‌ అయ్యారు. తర్వాత జబర్దాస్త్‌, టార్గెట్‌, కుటుంబ్‌, టీన్ బేకా ఫాజిటి ఐకా తదితర మరాఠి చిత్రాలలో నటించారు. 4 మిలియన్ల మంది ఆమె టిక్‌టాక్‌ వీడియోలను ఫాలో అవుతున్నారు. ఇన్‌స్ట్రాగ్రామ్‌లో 9,43,537 మంది ఫాలోవర్స్‌ ఉన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top