
యశవంతపుర: జర్మనీకీ చెందిన ప్రముఖ టిక్‌టాక్ స్టార్ నోయెల్ రాబిన్సన్‌ను బెంగళూరు పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. నగరంలోని చర్చి స్ట్రీట్‌లో భారతీయ సాంస్కృతిక పండుగలో నృత్యం చేస్తుండగా చూడటానికి వందల మంది జనం గుమిగూడారు. ప్రజలు, వాహనాల సంచారానికి ఇబ్బంది కలిగించారని రాబిన్సన్‌ను బలవంతంగా అదుపులోకి తీసుకొని విచారించి వదిలేశారు. గతంలో కూడా ఓ ప్రముఖ పాప్ స్టార్ ప్రదర్శన ఇస్తుండగా పోలీసులు అడ్డుకున్న సంగతి తెలిసిందే.
రాబిన్సన్‌ను 15 నిమిషాల పాటు పోలీస్ స్టేషన్‌లో ఉంచిన పోలీసులు.. అనుమతి లేకుండా చిత్రీకరించినందుకు జరిమానా విధించారు. అరెస్ట్‌పై ఇన్‌స్టాగ్రామ్‌లో నోయెల్ స్పందిస్తూ.. తాను సురక్షితంగా ఉన్నానని తెలిపాడు.
పోలీస్ స్టేషన్‌కు వెళ్లడం నాకు ఇదే మొదటిసారి అని.. వారు నన్ను జైలుకు పంపుతారేమోనని భయపడ్డానన్న.. రాబిన్సన్ అదృష్టవశాత్తూ, బయటపడ్డానన్నారు. తనకు భారత్ అంటే ఇష్టమంటూ ఆయన పేర్కొన్నారు. భారత్‌పై తనకున్న ప్రేమను వ్యక్తం చేసిన రాబిన్సన్.. ‘‘క్షమించకండి, స్నేహితులారా! ఇది ప్రతి దేశంలోనూ జరగొచ్చు.. ఈ ఘటన ఒక చిన్న అనుభవం లాంటింది. ఇది భారత్ పట్ల తనకున్న ప్రేమను దూరం చేయదు" అంటూ ఆయన వ్యాఖ్యానించారు.
German TikToker Noel Robinson, known for his street dance videos, was briefly detained by Bengaluru police while filming a dance on the streets. The incident occurred while he was filming a street dance video in traditional Indian attire, which drew a large crowd, raising public… pic.twitter.com/26sqQk0RSn
— Waahiid Ali Khan (@waahiidalikhan) July 31, 2025