
కర్ణాటక: బెంగళూరు ఉత్తర తాలూకా అంచెపాళ్య గ్రామంలో భీమన అమావాస్య రోజున భర్తకు పాదపూజ చేసి అదేరోజు రాత్రి భార్య ఆత్మహత్య చేసుకున్న కేసులో ట్విస్టు చోటుచేసుకుంది. అంచెపాళ్య నివాసి అభిషేక్ భార్య స్పందన (24) ఆత్మహత్య చేసుకోవడం తెలిసిందే. వీరిది ప్రేమ వివాహం. తమ కుమార్తెను అభిషేక్, అతని తల్లి లక్ష్మమ్మ హత్య చేసి ఆత్మహత్యగా చెబుతున్నారని, వరకట్నం కోసం వేధించేవారని స్పదన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసుల దర్యాప్తులో స్పందన ఆత్మహత్య చేసుకున్నట్టు తేలింది. భర్తకు పరాయి స్త్రీతో సంబంధం ఉందని స్పందనకు అనుమానం ఉండేది. భీమన అమావాస్య రోజున భర్తకు పాదపూజ చేస్తున్న సమయంలో భర్తకు ఆ మహిళ ఫోన్ చేయడంతో కలత చెందిన స్పందన ఆరోజు రాత్రి ఇంట్లో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఇలా భర్త అక్రమ సంబంధం భార్య ప్రాణాలను బలిగొంది.