
గత నెలలో జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడి తదనంతరం భారత్ పాక్‌ల మధ్య పెరిగిన ఉద్రిక్తతల నడుమ చాలా చోట్ల దుకాణలో ఐకానిక్ స్వీట్ మైసూర్ పాక్ పేరుని మార్చేశారు కొందరు దుకాణాదారులు. దాంతోపాటు పాక్ పేరు వినిపించేలా ఉన్న కొన్ని రకాల ప్రసిద్ధ వస్తువుల పేర్లను కూడా మార్చేశారు. అయితే ఆ స్వీట్‌ని మైసూర్ శ్రీగా మార్చి.. అమ్మడం వివాదాలకు దారితీసింది. మైసూర్ రాజు కృష్ణరాజ వడియార్ IV పాలనలో మైసూర్ ప్యాలెస్ వంటగదిలో తయారైంది ఈ స్వీట్. ఆ రాజు వంటవాడి ఘనతకు నిదర్శనం ఆ స్వీట్. దాంతో ఆ వంటవాడి వారుసులు ఇలా పేరు మార్చడంపై మండిపడుతున్నాడు. ఇప్పటికీ మైసూర్ ప్యాలెస్‌లోనే తయారయ్యే ఆ స్వీట్ సృష్టికర్త కాకాసుర మాడప్ప మునిమనవడు ఎస్ నటరాజ్ అలా పేరు మార్చడాన్ని అస్సలు అంగీకరించటం లేదు.
అలానే పిలవండి..
ఆ స్వీట్‌ని మైసూర్ పాక్ అనే పిలవండి. ఎందుకంటే మా పూర్వీకులు అందించిన ఈ పాక ఆవిష్కరణకు మరో పేరు ఉండకూదని అన్నారు. ప్రతి స్మారక చిహ్నం లేదా సంప్రదాయానికి ఒక ప్రత్యేక పేరు ఉన్నట్టే..ఈ స్వీట్‌కి ఓ ప్రత్యేక పేరు ఏర్పడింది. దాన్ని తప్పుగా సూచించకూడదు..అలాగే మార్చకూడదు కూడా అని వ్యాఖ్యానించారు నటరాజ్.
'పాక్' అనే పదం ఎందుకు వచ్చిందంటే..
కన్నడలో 'పాక్' అనే పదం చక్కెర సిరప్‌ను సూచిస్తుంది. అలాగే ఈ స్వీట్‌ని మైసూర్ ప్యాలెస్‌లో తయారు చేయడంతో ..ఈ రెండు పేర్ల కలయికతో ఆ స్వీట్‌ని అలా పిలవడం జరగిందని అని వివరించారు నటరాజ్. అందువల్ల దీన్ని వేరే పేరుతో పిలిచే ప్రశ్నే లేదు అని తెగేసి చెప్పారు.
అంతేగాదు..ఆ పేరే ఎందుకు ఉండాలంటే..ప్రపంచంలో ఎక్కడకి వెళ్లినా..ఆ స్వీట్‌ని చూసినా..దాన్ని చూడగానే ఎలా తయారైందని కథ గుర్తొచ్చేలా ఆ పేరులో ఉండాలి. అప్పుడే ఆ స్వీట్‌కి ప్రాముఖ్యత ఉంటుందన్నారు. దాని పేరు మార్చే హక్కులేదని నొక్కి చెప్పారు నటరాజ్. కర్ణాటకలో మైసూరు ప్రసిద్ధ గురు స్వీట్స్ కుటుంబం దీన్ని కొనసాగిస్తోంది.
ఇప్పుడు దాని ఐదవతరం స్వీట్‌లో రారాజుగా పేరొందిన ఈ మిఠాయిని ప్రజాక్షేత్రంలో మరింత ప్రాచుర్యం కల్పించేలా నటరాజ్ ముత్తాత దుకాణాలను ప్రారంభించారు. అలా దీని గురించి దేశమంతటా తెలిసిందని చెబుతున్నారు కుటుంబసభ్యులు. అంతేగాదు ఆ కుటుంబం నాల్గోతరం సభ్యుడు సుమేఘ్..వైసూర్, కర్ణాటక సాంస్కృతిక చారిత్రకలతో ముడిపడి ఉన్న స్వీట్ అని చెబుతున్నారు.
ఇది తమ కన్నడిగ సమాజానికే గర్వకారణమని అన్నారు. ఇది మా ప్రజల మాధుర్యాన్ని కన్నడ సంస్కృతి గొప్పతనాన్ని ప్రతిబింబించేలా మధురంగా ఉంటుందన్నారు. అంతేగాదు ఈ స్వీట్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా బాగా ఫేమస్ అయ్యింది కాబట్టి దీన్ని అనవసర వివాదాల్లోకి లాగొద్దని కోరుతున్నారు ఆ స్వీట్ సృష్టించిన కుటుంబ వారసులు. నోటిలో ఈజీగా కరిగిపోయే ఈ స్వీట్ భారతదేశం అంతటా వివిధ వేడుకలకు, పండుగల్లో తప్పనిసరిగా ఉండే ప్రముఖ స్వీట్ ఇది.
(చదవండి: ‘మైసూర్’లో ‘పాక్’ మాయం! )