భవనం టెర్రస్‌ పైకి యువతి.. రీల్స్‌ పిచ్చే బలి తీసుకుందా? | Bengaluru Woman Died After Falls From 13th Floor Of Under Construction Building, More Details Inside | Sakshi
Sakshi News home page

భవనం టెర్రస్‌ పైకి యువతి.. రీల్స్‌ పిచ్చే బలి తీసుకుందా?

Jun 27 2025 8:58 AM | Updated on Jun 27 2025 10:36 AM

Bengaluru Woman Falls From 13th Floor Of Under Construction Building

బెంగళూరు: తన స్నేహితులతో కలిసి పార్టీ చేసుకోవడానికి వెళ్లిన ఒక యువతి, నిర్మాణంలో ఉన్న భవనంలోని 13వ అంతస్తు నుంచి పడి మరణించింది. బుధవారం రాత్రి ఆ మహిళ తన స్నేహితుల బృందంతో కలిసి పరప్పన అగ్రహార పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆ భవనానికి వెళ్లిందని పోలీసులు వెల్లడించారు.

పార్టీ మధ్యలో యువతి రీల్స్‌ కోసం టెర్రస్‌పైకి వెళ్లింది.. అక్కడ వీడియో తీసుకుంటూ కాలుజారి నుంచి కింద పడిపోయింది. దీంతో తీవ్ర గాయాలతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతురాలు బీహార్‌కు చెందిన యువతిగా గుర్తించారు. నగరంలోని ఓ షాపింగ్ మార్ట్‌లో ఉద్యోగం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటననుపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

అయితే, ఆమె రీల్ షూట్ కోసమే భవనం టెర్రస్‌పైకి వెళ్లినట్లు చెబుతున్నప్పటికి..  ఆమె ఫోన్ నుంచి అలాంటి రికార్డింగ్ ఏదీ లభించలేదని పోలీసులు తెలిపారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని.. ఆ యువతి ప్రమాదవశాత్తు పడిపోయిందని భావిస్తున్నామని పోలీసులు తెలిపారు.

 

 

Advertisement
 
Advertisement
Advertisement