'నేను ఏం మాట్లాడిన ‍అలానే తీసుకుంటారు'.. విడాకుల రూమర్స్‌పై అభిషేక్ బచ్చన్! | Abhishek Bachchan Breaks Silence On His Marriage And Separation Rumours | Sakshi
Sakshi News home page

Abhishek Bachchan: 'నేను ఏం మాట్లాడిన ‍అలానే తీసుకుంటారు'.. విడాకుల రూమర్స్‌పై అభిషేక్ బచ్చన్!

Jun 30 2025 6:10 PM | Updated on Jun 30 2025 6:38 PM

Abhishek Bachchan Breaks Silence On His Marriage And Separation Rumours

బాలీవుడ్ స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌-ఐశ్వర్య జంటపై గత కొన్ని నెలలుగా రూమర్స్ వస్తూనే వినిపిస్తున్నాయి. వీరిద్దరు విడాకుల తీసుకోబోతున్నారంటూ చాలాసార్లు కథనాలొచ్చాయి. గతంలో ఐశ్వర్యరాయ్‌ తన కూతురు ఆరాధ్యతో కలిసి చాలాసార్లు కనిపించడంతో ఈ రూమర్స్ ఎక్కువయ్యాయి. అంతేకాకుండా ఐశ్వర్య బర్త్‌ డే ఆలస్యంగా విష్ చేయడం.. ఆమెతో అభిషేక్ బచ్చన్‌ ఎక్కువగా కనిపించకపోవడంతో విడాకుల వార్తలకు మరింత బలం చేకూరింది. అయితే ఈ వార్తలపై అభిషేక్‌ ఇప్పటివరకు స్పందించలేదు.

తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన అభిషేక్ బచ్చన్‌.. తనపై వస్తున్న రూమర్స్‌పై స్పందించారు.  సోషల్ మీడియాలో తన గురించి జరుగుతున్న తప్పుడు సమాచారంపై తాను ఎందుకు స్పందించలేదనే విషయాన్ని వెల్లడించారు. నెగెటివ్ వార్తలు రాయడం అనేది ఈ రోజుల్లో కొత్త ట్రోలింగ్ ట్రెండ్ అని అభిషేక్ అన్నారు. తాను ఏం మాట్లాడిన ప్రజలు నెెగెటివ్‌గానే తీసుకుంటారని స్పష్టం చేశారు.

అభిషేక్ బచ్చన్ మాట్లాడుతూ.. "గతంలో నా గురించి వచ్చిన కథనాలేవీ నన్ను ఎలాంటి ప్రభావితం చేయలేదు. ఎందుకంటే ఈ రోజు నాకు ఒక కుటుంబం ఉంది. నేను ఏదైనా మాట్లాడితే అది వారిని చాలా బాధ పెడుతుంది. నేను ఏం చెప్పినా  ప్రజలు దాన్ని నెగెటివ్‌గానే తీసుకుంటారు. ఎందుకంటే నెగెటివ్‌ వార్తలే ఎక్కువగా అమ్ముడవుతాయి. అలాంటి ప్రతికూలతను బయటపెట్టే వ్యక్తులు తమ మనస్సాక్షితో జీవించాలి. ఇక్కడ మనందరికీ కూడా కుటుంబాలు ఉన్నాయి. ఈ రోజుల్లో ఇది ఒక కొత్త ట్రోలింగ్ ఫ్యాషన్‌. మీరు సోషల్ మీడియాలో ఏదైనా చెప్పే బదులు.. డైరెక్ట్‌గా నాతో వచ్చి చెప్పడానికి మీకు అనుమతి ఇస్తా. కానీ నా ఎదురుగా వచ్చి చెప్పడానికి మీకు ధైర్యం ఉండదు. ఎవరైనా నా ఎదురుగా వచ్చి మాట్లాడితే వారిని స్వయంగా నేనే గౌరవిస్తా" అని అన్నారు. కాగా.. అభిషేక్ ప్రస్తుతం కాళిధర్ లపతా చిత్రంలో కనిపించనున్నారు. ఈ సినిమాకు మధుమిత దర్శకత్వం వహించారు. మరోవైపు అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ 2007లో వివాహం చేసుకున్నారు. ఈ జంటకు 13 ఏళ్ల కుమార్తె ఆరాధ్య బచ్చన్‌ ఉన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement