ఐశ్వర్య రాయ్‌తో పెళ్లికి ముందు ఆ హీరోయిన్‌తో ఎంగేజ్‌మెంట్‌! | Actress Karisma Kapoor Broke Engagement With Abhishek Bachchan | Sakshi
Sakshi News home page

ఆ హీరోయిన్‌ను కోడలిగా ప్రకటించిన జయా బచ్చన్‌.. ఒక్క కారణం వల్ల పెళ్లి క్యాన్సిల్‌!

Jun 26 2025 2:33 PM | Updated on Jun 26 2025 3:08 PM

Actress Karisma Kapoor Broke Engagement With Abhishek Bachchan

పెళ్లిళ్లు స్వర్గంలోనే నిర్ణయిస్తారు అంటుంటారు. అందుకేనేమో.. పీకల్లోతు ప్రేమలో ఉన్న అభిషేక్‌ బచ్చన్‌, కరిష్మా కపూర్‌.. ఎంగేజ్‌మెంట్‌ వరకు వచ్చి ఆగిపోయారు. మనసు నిండా ఒకరినొకరు నింపుకున్నారు కానీ, తలరాతల్లో మాత్రం లేకుండా పోయారు. జంటగా నడవాలనుకుంటే వేర్వేరుగా ప్రయాణించారు. అభిషేక్‌.. ఐశ్వర్యను, కరిష్మా.. సంజయ్‌ను పెళ్లాడారు. అసలు ఆనాడేం జరిగిందో ఓసారి గుర్తు చేసుకుందాం..

అభిషేక్‌- కరిష్మా ప్రేమ
సినీరంగంలో సత్తా చాటుతున్న కపూర్‌ ఫ్యామిలీలో పుట్టింది కరిష్మా (Karisma Kapoor). 17 ఏళ్ల వయసులోనే నటిగా ప్రయాణం ప్రారంభించింది. మొదట్లో కొన్ని వైఫల్యాలు చూసిన కరిష్మా.. రాజా హిందుస్తానీ చిత్రంతో సక్సెస్‌ అందుకుంది. తర్వాత ఈ బ్యూటీ బిగ్‌బీ తనయుడు అభిషేక్‌ బచ్చన్‌ (Abhishek Bachchan)తో ప్రేమలో పడింది. అభిషేక్‌ సోదరి శ్వేత బచ్చన్‌ పెళ్లిలోనే వీరి చూపులు కలిశాయి. ఐదేళ్లపాటు ప్రేమించుకున్నారు. రెండు కుటుంబాలు ఏమీ అభ్యంతరం చెప్పలేదు. 

జయా బచ్చన్‌తో కరిష్మా కపూర్‌

నా కోడలు: జయా బచ్చన్‌
దీంతో 2002లో అమితాబ్‌ బచ్చన్‌ 60వ పుట్టినరోజు వేడుకల్లో జయా బచ్చన్‌.. అభిషేక్‌, కరిష్మాల ఎంగేజ్‌మెంట్‌ను  ప్రకటించింది. కరిష్మాను తన కోడలిగా చేసుకోనున్నట్లు వెల్లడించింది. బాలీవుడ్‌లో పెద్ద పండగే జరగబోతుందనుకున్నవారికి షాకిస్తూ వీరి ఎంగేజ్‌మెంట్‌ క్యాన్సిల్‌ అయింది. అమితాబ్‌ తన సంపదలో కొంత భాగం అభిషేక్‌ పేరు మీదకు ట్రాన్స్‌ఫర్‌ చేయాలని కరిష్మా తల్లి బబిత డిమాండ్‌ చేసిందట! ఈ నిశ్చితార్థం రద్దవడానికి ఈ డిమాండే ముఖ్య కారణమని అప్పట్లో ప్రచారం జరిగింది.

పెళ్లి
ఎంగేజ్‌మెంట్‌ ఆగిపోయిన కొద్ది నెలలకే బబిత.. తన కూతురికి మంచి వ్యాపారవేత్తను చూసి పెళ్లి చేసింది. 2003లో కరిష్మా, సంజయ్‌ కపూర్‌ల పెళ్లి జరిగింది. ఇతడికిది రెండో పెళ్లి కావడం గమనార్హం. కానీ ఈ బంధం ఎంతోకాలం నిలవలేదు. పిల్లలు పుట్టిన కొంతకాలానికే కరిష్మా- సంజయ్‌ విడాకుల కోసం కోర్టుకెక్కారు. 2014లో విడాకుల కోసం దరఖాస్తు చేయగా 2016లో డివోర్స్‌ మంజూరయ్యాయి. కొద్దిరోజుల క్రితమే సంజయ్‌ కపూర్‌ కన్నుమూశాడు. ఇకపోతే అభిషేక్‌ బచ్చన్‌.. 2007లో ఐశ్వర్యరాయ్‌ను పెళ్లి చేసుకున్నాడు. వీరికి కూతురు ఆరాధ్య జన్మించింది. అభిషేక్‌- ఐశ్వర్య అయినా సంతోషంగా ఉన్నారా? అంటే.. అప్పుడే దూరంగా ఉన్నట్లు అనిపిస్తారు. అంతలోనే జంటగా కనిపిస్తారు. వీరి మధ్య ఏం జరుగుతుందనేది వారికే తెలియాలి!

 

 

చదవండి: కాస్టింగ్‌ కౌచ్‌.. ఓ గొప్ప ఫిలింమేకర్‌ కాంప్రమైజ్‌ అడిగాడు: నటుడు

Advertisement
 
Advertisement
Advertisement