
గతంలో వచ్చిన యానిమల్, మార్కో మోస్ట్ వయొలెంట్ చిత్రాలుగా పేరు సంపాదించుకున్నాయి. ఈ సినిమాల్లో మితిమీరిన వయొలెన్స్ ఉందంటూ కొందరు విమర్శించారు. అంతలోనే అంతకు మించిన వయొలెన్స్తో మరో మూవీ రాబోతోంది. తాజాగా విడుదలైన టీజర్ చూస్తే మరి ఇంత వయొలెన్స్ ఏంట్రా సామీ అనాల్సిందే. ఈ టీజర్ కేవలం 18 ఏళ్లు మించినవాళ్లకు మాత్రమే.
బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్, సంజయ్ దత్ కీలక పాత్రల్లో వస్తోన్న మోస్ట్ వయోలెంట్ యాక్షన్ చిత్రం 'బాఘి 4'. తాజాగా ఈ టీజర్ విడుదలైంది. ఇందులో మోస్ట్ వయొలెంట్ విజువల్స్ ఆడియన్స్ వెన్నులో వణుకు పుట్టించేలా ఉన్నాయి. మార్కో, యానిమల్ చిత్రాలను మించిపోయేలా టీజర్ విజువల్స్ ప్రేక్షకులను భయపెట్టేస్తున్నాయి.ఈ చిత్రంలో హర్నాజ్ సంధు, సోనమ్ బజ్వా కీలక పాత్రల్లో నటించారు.
ఈ మూవీలో టైగర్ ష్రాఫ్ తన మోస్ట్ వయొలెంట్ పాత్రలో రోనీగా కనిపించనున్నారు. ఈ టీజర్లో సంజయ్ దత్ స్క్రీన్ ప్రెజెన్స్ భయంకరంగా ఉంది. ఈ చిత్రానికి సాజిద్ నదియాద్వాలా కథ అందించగా.. ఎ హర్ష దర్శకత్వం వహించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 5న థియేటర్లలో విడుదల కానుంది.