
అతిలోక సుందరి ఐశ్వర్యా రాయ్.. హీరో అభిషేక్ బచ్చన్‌ని పెళ్లి చేసుకున్నప్పుడు చాలామంది ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఈ కాంబోని ఎవరూ అస్సలు ఊహించలేదు. స్టార్ కొరియోగ్రాఫర్ అయిన వైభవి మర్చంట్ కూడా తను ఇలానే అనుకున్నానని చెప్పింది. ఓ ఐటమ్ సాంగ్‌లో వీళ్లిద్దరూ నటించిన తర్వాత.. పెళ్లి జరగడంతో ఒక్కసారిగా షాకయ్యానని చెప్పుకొచ్చింది.
అమితాబ్ బచ్చన్ వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన అభిషేక్.. హీరోగా నిలదొక్కుకోలేకపోయాడు. మొన్నటివరకు సహాయ పాత్రల్లో కనిపించాడు. ప్రస్తుతం ఓటీటీ సినిమాల్లో హీరోగా మెరుసున్నాడు. గతంలో అభిషేక్, తండ్రి అమితాబ్‌తో కలిసి 'బంటీ ఔర్ బబ్లీ' అనే మూవీ చేశాడు. 'కజరారే..' అనే ఐటమ్ సాంగ్ వినే ఉంటారుగా. అది ఈ సినిమాలోనిదే. ఈ చిత్రానికి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కొరియోగ్రాఫర్ వైభవి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అభిషేక్-ఐశ్వర్య పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
(ఇదీ చదవండి: సందీప్ వంగాకు దీపిక ఇన్ డైరెక్ట్ కౌంటర్?)
''కజరారే..' పాట చేస్తున్నప్పుడు.. తండ్రి అమితాబ్ కూడా సెట్‌లోనే ఉండటంతో అభిషేక్ చాలా భయపడుతుండేవాడు. ఐశ్వర్య అయితే ఇది వర్కౌట్ అవుతుందా లేదా అని సందేహపడుతూ ఉండేది. ఈ పాట జరిగిన కొన్నేళ్ల తర్వాత అభిషేక్-ఐశ్వర్య పెళ్లి చేసుకోవడంతో నేను ఆశ్చర్యపోయాను. ఎందుకంటే ఐటమ్ సాంగ్ చేసిన తర్వాత వివాహం చేసుకుంటారని అస్సలు ఊహించలేదు. కానీ జరిగింది' అని వైభవి మర్చంట్ చెప్పుకొచ్చింది.
ఈ పాటలో అమితాబ్-అభిషేక్-ఐశ్వర్య.. ముగ్గురూ డ్యాన్స్‌తో మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చారు. ఈ సాంగ్ ఓ రకంగా ఐశ్వర్యకు కమ్ బ్యాక్ అని అనుకోవచ్చు. ఈ తరహా పాటలతో పాటు సినిమాల్లో మళ్లీ ఈమెకు హీరోయిన్‌గా అప్పట్లో అవకాశాలు వచ్చాయి. ఏదేమైనా ఓ పాట.. ఇద్దరు స్టార్ హీరోహీరోయిన్ల పెళ్లికి కారణమైందనమాట!
(ఇదీ చదవండి: ఆకట్టుకునేలా తేజ సజ్జా 'మిరాయ్' టీజర్)