ఆకట్టుకునేలా తేజ సజ్జా 'మిరాయ్' టీజర్ | Teja Sajja Mirai Movie Teaser Out Watch Video Went Viral, Check Release Date Details Inside | Sakshi
Sakshi News home page

Mirai Movie Teaser: సూపర్ హీరో కాన్సెప్ట్‌తో 'మిరాయ్'.. టీజర్ రిలీజ్

May 28 2025 10:31 AM | Updated on May 28 2025 11:28 AM

Teja Sajja Mirai Teaser Telugu And Release Date

'హనుమాన్' సినిమాతో పాన్ ఇండియా వైడ్ గుర్తింపు తెచ్చుకున్న తేజ సజ్జా.. ఇప్పుడు మరోసారి సూపర్ హీరోగా అలరించేందుకు సిద్ధమైపోయాడు. 'మిరాయ్' మూవీతో రాబోతున్నాడు. తాజాగా టీజర్ రిలీజ్ చేశారు. అలానే మూవీ కొత్త రిలీజ్ తేదీని కూడా ప్రకటించారు.

(ఇదీ చదవండి: సందీప్ వంగాకు దీపిక ఇన్ డైరెక్ట్ కౌంటర్?)

తేజ సజ్జా హీరోగా నటిస్తున్న 'మిరాయ్'లో పవర్‌ఫుల్ విలన్‌గా మంచు మనోజ్ కనిపించబోతున్నాడు. టీజర్ అయితే బందోబస్తుగా ఉంది. ప్రభాస్ 'కల్కి' తరహాలో త్రేతా యుగం, కలియుగం మధ్య ఏదో లింక్ ఉన్నట్లు చూపించారు. విజువల్స్ మాత్రం టాప్ నాచ్ ఉన్నాయి. అలానే లొకేషన్స్ కూడా అదిరిపోయాయి.

కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్‪‌తో నిర్మించింది. తొలుత అనుకున్నట్లు ఆగస్టు 1న కాకుండా సెప్టెంబరు 5న ఏడు భాషల్లో రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. మరి తేజ సజ్జా ఈసారి హిట్ కొడితే.. పాన్ ఇండియా వైడ్ హీరోగా సెటిలైపోవచ్చు. విలన్‌గా మనోజ్ కూడా అంచనాలు పెంచేలా కనిపించాడు. చివర్లో రాముడి ఎంట్రీ ఉందన్నట్లు చూపించి ఆసక్తి పెంచారనే చెప్పొచ్చు.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ బ్లాక్ బస్టర్ 'టూరిస్ట్ ఫ్యామిలీ' మూవీ)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement