
బాలీవుడ్ స్టార్ కమెడియన్ కపిల్ శర్మకు భారీగా భద్రతను పెంచారు. ఇటీవల మరోసారి కెనడాలోని ఆయన కేఫ్పై కాల్పులు జరగడంతో ముంబయి పోలీసులు చర్యలు చేపట్టారు. ముందస్తు చర్యల్లో భాగంగా కపిల్ శర్మ ఇంటి వద్ద భద్రత ఏర్పాటు చేసినట్లు సీనియర్ పోలీసు అధికారి వెల్లడించారు.
కాగా.. ఆగస్టు 8న కెనడాలోని సర్రేలో ఉన్న కపిల్ శర్మ ఇటీవల ప్రారంభించిన రెస్టారెంట్ కాప్స్ కేఫ్‌పై కాల్పులు జరిగాయి. నెలలోపే ఇది రెండవ ఘటన కావడం ఆందోళనకు గురి చేస్తోంది. గతంలోనే జూలై 10న ఇదే తరహాలో దాడి జరిగింది. కపిల్ శర్మను లక్ష్యంగా చేసుకుని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఈ దాడులకు పాల్పడుతున్నట్లు సమాచారం.
రెండోసారి దాడి తర్వాత బిష్ణోయ్ సన్నిహితుడు హ్యారీ బాక్సర్ నుంచి ఆడియో సందేశం వచ్చినట్లు తెలుస్తోంది. కపిల్ శర్మ నెట్‌ఫ్లిక్స్ షో ప్రీమియర్‌లో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కనిపించడమే దీనిని కారణమని ఆడియో సందేశంలో పేర్కొన్నారు. సల్మాన్ ఖాన్‌తో కలిసి పనిచేసే వారిని బిష్ణోయ్ గ్యాంగ్ లక్ష్యంగా పని చేస్తుందని ఆడియోలో వార్నింగ్ ఇచ్చారు. దీంతో ముంబయి పోలీసులు ఓషివారాలోని కపిల్ శర్మ నివాసాన్ని సందర్శించి భద్రతా చర్యలను కట్టుదిట్టం చేశారు.