
సిద్ధార్థ్ మల్హోత్రా , జాన్వీ కపూర్ జంటగా నటించిన తాజా రొమాంటిక్ ఎంటర్టైనర్ పరమ్ సుందరి. తుషార్ జలోటా దర్శకత్వం వహించిన ఈ మూవీ విడుదలకు సిద్ధమైంది. ఇటీవలే క్రేజీ లవ్ సాంగ్ను రిలీజ్ చేసిన మేకర్స్.. తాజాగా ట్రైలర్ను విడుదల చేశారు. కేరళ అమ్మాయితో ఢిల్లీకి చెందిన అబ్బాయి ప్రేమలో పడితే ఎలా ఉంటుందనే ఆసక్తికర ప్రేమకథగా ఈ సినిమాను తెరకెక్కించారు.
తాజాగా రిలీజైన ట్రైలర్ చూస్తుంటే జాన్వీ కపూర్, సిద్ధార్థ్ మధ్య సన్నివేశాలు నవ్వులు తెప్పిస్తున్నాయి. ఈ చిత్రాన్ని లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్గా తీర్చిదిద్దినట్లు ట్రైలర్లో అర్థమవుతోంది. ట్రైలర్ చివర్లో తమిళంలో రజినీకాంత్, మలయాళంలో మోహన్ లాల్, తెలుగులో అల్లు అర్జున్, కన్నడలో యశ్ అంటూ జాన్వీ కపూర్ చెప్పిన డైలాగ్ ఆడియన్స్ను అలరిస్తోంది. ఈ సినిమాను మాడాక్ ఫిల్మ్స్ బ్యానర్లో దినేశ్ విజన్ నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా ఆగస్టు 29న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో రెంజీ పనీకర్, సిద్ధార్థ్ శంకర్, మన్జోత్ సింగ్, సంజయ్ కపూర్, ఇనాయత్ వర్మ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు సచిన్ జిగర్ సంగీతమందించారు.
#ParamSundariTrailer features the iconic "JHUKEGA NAHI" reference of our Icon Star. 🔥
Wishing #JanhviKapoor, @SidMalhotra and @MaddockFilms all the best for Param Sundari on behalf of all Allu Arjun fans. ♥️ pic.twitter.com/wmGYQCi5ir— Trends Allu Arjun ™ (@TrendsAlluArjun) August 12, 2025