'ఆయన బాడీని చూస్తుంటే ఇండియన్‌ టైసన్‌లా'

Tamil Actor Arya Latest Look - Sakshi

పాత్రలకు తగ్గట్టుగా మారడానికి హీరోలు చాలా శ్రమపడుతున్నారు. ఆరు పలకలు, ఎనిమిది పలకలు అంటూ కఠిన కసరత్తులతో బాడీని మార్చుకుంటున్నారు. అలాంటి వారిలో నటుడు ఆర్య చేరారు. ఈయన ఇప్పటి గెటప్‌ చూస్తే ఆర్యనేనా అని ఆశ్చర్యపడతారు. ఇటీవల కాప్పాన్‌ చిత్రంలో కనిపించిన ఆర్య ప్రస్తుతం టెడీ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో ఆయన భార్య సాయేషాసైగల్‌నే హీరోయిన్‌గా నటించడం విశేషం. ఈ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. కాగా తాజాగా పా.రంజిత్‌ దర్శకత్వంలో నటించడానికి ఆర్య రెడీ అవుతున్నారు. ఈ చిత్రం కోసమే ఆయన బాడీ బిల్డర్‌గా మారారు.దర్శకుడు పా.రంజిత్‌ రజనీకాంత్‌ హీరోగా తెరకెక్కించిన కాలా తరువాత పిర్చా ముండా అనే చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేశారు.   చదవండి: ఈ హీరోను గుర్తుపట్టారా?

అయితే కొన్ని కారణాల వల్ల ఆ చిత్రం వాయిదా పడింది. దీంతో ఇప్పుడు నటుడు ఆర్య హీరోగా చిత్రం చేయడానికి సిద్ధం అయ్యారు. ఇప్పటికే ప్రారంభమైన ఈ చిత్ర షూటింగ్‌ చెన్నై పరిసరాల్లో చిత్రీకరణను జరుపుకుంటోంది. అయితే దీని గురించి చిత్ర వర్గాలు అధికారికంగా గురువారం వెల్లడించారు. ఇందులో ఆర్య బాక్సింగ్‌ క్రీడాకారుడిగా నటిస్తున్నారు. అందుకోసం ఆయన తన బాడీని పూర్తిగా మార్చుకున్నారు. కఠినంగా కసరత్తులు చేసి సిక్స్‌ప్యాక్‌కు తయారయ్యారు. ఆయన బాడీని చూస్తుంటే ఇండియన్‌ టైసన్‌లా ఉన్నారు. ఆ ఫొటోలను ఆయన ట్విట్టర్‌లో విడుదల చేశారు. అవి ఇప్పుడు సామాజిక మాద్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. వాటిని చూసిన ఆయన మిత్ర వర్గం వావ్‌ అదుర్స్‌ అంటూ అభినందనల వర్షం కురిపిస్తున్నారు.    చదవండి: అతడితోనే తాళి కట్టించుకుంటా: అనుష్క 

ఇక అభిమానులైతే సూపర్‌ అంటూ లైకులు కొడుతున్నారు. దీంతో ఆర్య నటించే చిత్రంపై అంచనాలు పెరిగిపోతున్నాయి. కాగా ఆర్య తాజా చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను చిత్ర యూనిట్‌ ఇంకా వెల్లడించలేదు. అయితే నటుడు కలైయరసన్, దినేశ్‌ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నట్లు ఇంతకు ముందే ప్రచారం జరిగింది. నటుడు ఆర్యకు అర్జెంట్‌గా ఇప్పుడు ఒక హిట్‌ కావాలి. దీంతో ఆయన తన చిత్రాలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. అందులో భాగమే ఈ సిక్స్‌ప్యాక్‌కు రెడీ అవడం అని భావించవచ్చు.    

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top