అతడితోనే తాళి కట్టించుకుంటా: అనుష్క | Anushka Gave Clarity On Her Wedding Subject | Sakshi
Sakshi News home page

అతడితోనే తాళి కట్టించుకుంటా: అనుష్క

Feb 22 2020 7:17 AM | Updated on Feb 22 2020 3:59 PM

Anushka Gave Clarity On Her Wedding Subject - Sakshi

అతడితోనే తల వంచి తాళి కట్టించుకుంటానని అంటోంది స్వీటీ అనుష్క. ఇప్పుడున్న మోస్ట్‌ బ్యాచిలర్‌ హీరోయిన్లలో ఈ అమ్మడు ఒకరు. 2005లో కథానాయకిగా టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన ఈ బెంగళూరు భామ ఆ తర్వాత అగ్ర హీరోయిన్‌గా ఎదిగారు.  ఇక కోలీవుడ్‌లో ‘రెండు’ అనే చిత్రంతో పరిచయం అయిన అనుష్క అందులో మాధవన్‌కు జోడీగా నటించారు. మళ్లీ చాన్నాళ్లకు ‘సైలెన్స్‌’ అనే చిత్రంలో ఆయనతో స్క్రీన్‌ పంచుకున్నారు. అయితే అప్పటికీ ఇప్పటికీ తేడా చాలానే ఉంది. అప్పట్లో అందాల ఆరబోతకే పరిమితం అయిన అనుష్క ఇప్పుడు అభినయానికి అవకాశం ఉంటేనే చిత్రాలను అంగీకరిస్తున్నారు. ఈ దశాబ్దన్నర కాలంలో అన్ని రకాల పాత్రలను పోషించిన ఆమె... ఇప్పటికీ అగ్ర కథానాయకిగా రాణించడం సాధారణ విషయం కాదు.

కాగా హీరోయిన్‌గా ఎంత పేరు తెచ్చుకున్నారో, అంతగానే వదంతుల్లో నానుతూ వచ్చారు. ఆ మధ్య నటుడు ప్రభాస్‌తో వరుసగా మూడు చిత్రాల్లో నటించడంతో ఆయనతో ప్రేమలో ఉందంటూ కథలు అల్లేశారు. తమ మధ్య ఫ్రెండ్‌షిప్పే కానీ ప్రేమ, దోమా లేదని చాలాసార్లు ఇద్దరూ క్లారిటీ ఇచ్చారు. ఆ తరువాత ఒక వ్యాపారవేత్తతో ప్రేమాయణం సాగిస్తుందనే ప్రచారం జరిగింది. ఇటీవల ఓ క్రికెటర్‌తో ప్రేమలో ఉన్నట్లు వచ్చిన వదంతులపై మరోసారి అనుష్క స్పందించక తప్పలేదు. ప్రేమ, పెళ్లి అంటూ తన గురించి తరచూ వదంతులు ప్రచారం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు.

తన గురించే ఇలా ఎందుకు వదంతులు పుట్టిస్తున్నారో అర్థం కావడం లేదని వాపోయారు.  తనపై లేనిపోని తప్పుడు ప్రచారం చేయడం బాధగా ఉందని, తన పెళ్లి గురించి తన తల్లిదండ్రులే నిర్ణయం తీసుకుంటారని తేల్చిచెప్పారు. తన తల్లిదండ్రులు ఎవరిని చూపించి పెళ్లి చేసుకోమంటారో అతగాడితోనే తల వంచి తాళి కట్టించుకుంటానని చెప్పారు. ఈ అమ్మడు గురించి ఇకనైనా అసత్య ప్రచారం ఆపుతారో? లేదో? చూడాలి. కాగా అనుష్క నటించిన తాజా చిత్రం సైలెన్స్‌ త్వరలో తెరపైకి రావడానికి రెడీ అవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement