కర్ణాటక రాష్ట్రం: జిల్లాలో ఎస్‌ఎస్ పురం కస్తూర్భా ఆస్పత్రిలో 4.5 కేజీల బరువున్న శిశువు జన్మించాడు. ఔరా బాలభీముడని చూసినవారు ఆశ్చర్యపోయారు. తుమకూరు నివాసి రమ్య (32) కు నెలలు నిండడంతో ఆస్పత్రిలో చేరింది. ఆమె గర్భం దాల్చినప్పటి నుంచి క్రమం తప్పకుండా ఇదే ఆస్పత్రికి వచ్చి వైద్య పరీక్షలు చేయించుకుని, వైద్యులు సూచనల మేరకు ఆహారం, వ్యాయామం, యోగా ఆచరించేవారని తెలిపారు. మంగళవారం సహజ ప్రసవం ద్వారా కొడుకు పుట్టాడు. వాస్తవానికి శిశువు బరువు ఎక్కువ ఉంటే సాధారణ కాన్పు కావడం చాలా కష్టమని, అయితే తల్లి సరైన ఆరోగ్య దినచర్యను పాటించడం వల్ల మామూలుగా కాన్పు జరిగినట్లు వైద్యులు తెలిపారు. బాలభీముడు వైరల్ అయ్యాడు.


