టానిక్‌ సీసా మూత మింగిన బాలుడు | Nine Months Baby Boy Swallowed Tonic Bottle Cap Odisha | Sakshi
Sakshi News home page

టానిక్‌ సీసా మూత మింగిన బాలుడు

Feb 28 2020 11:40 AM | Updated on Feb 28 2020 11:57 AM

Nine Months Baby Boy Swallowed Tonic Bottle Cap Odisha - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

ఒడిశా, సోంపేట: మండలంలోని రుషికుడ్డ గ్రామానికి చెందిన 9 నెలల బాలుడు టానిక్‌ సీసా పైకప్పు మింగడటంతో గొంతులోకి ఇరుక్కుంది. వెంటనే వైద్యులు తగిన వైద్యం అందించడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. కుటుంబ సభ్యుల వివరాలు ప్రకారం... గ్రామానికి చెందిన కర్రి యోగేశ్వరరావు, గీత దంపతుల కుమారులు సాత్విక్‌(4), రాము (9 నెలలు) తమ ఇంటి ఆవరణలో ఆడుకుంటున్నారు.ఈ క్రమంలో అక్కడ కింద పడి ఉన్న టానిక్‌ సీసా పైకప్పును బాలుడు మింగి వేశాడు. దీంతో ఊపిరి పీల్చుకోవడం కష్టంగా మారింది. ఈ విషయాన్ని గుర్తించిన తల్లిదండ్రులు హుటాహుటిన సోంపేట పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ వైద్యులు మంచు ప్రదీప్‌కుమార్, ఎం సాగర్‌ శస్త్రచికిత్స చేసి గొంతు నుంచి దాన్ని బయటకు తీసి బాలుడి ప్రాణాలు కాపాడారు. ఈ మేరకు వైద్యులకు తల్లిదండ్రులు ధన్యవాదాలు తెలియజేశారు.

Advertisement
 
Advertisement
Advertisement