ఆస్ట్రేలియాను చిత్తు చేసిన సౌతాఫ్రికా | South Africa beat Australia by innings and 31 runs | Sakshi
Sakshi News home page

AUS vs SA: ఆస్ట్రేలియాను చిత్తు చేసిన సౌతాఫ్రికా

Oct 22 2026 9:41 PM | Updated on Oct 22 2026 9:46 PM

South Africa beat Australia by innings and 31 runs

సెయింట్ జార్జ్ పార్క్  వేదిక‌గా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో ఇన్నింగ్స్ అండ్ 31 ప‌రుగుల తేడాతో సౌతాఫ్రికా ఘ‌న‌విజ‌యం సాధించింది. దీంతో మూడు టెస్టు సిరీస్‌ను 1-1తో ప్రోటీస్ స‌మం చేసింది. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా త‌మ తొలి ఇన్నింగ్స్‌ను 425/9 ప‌రుగుల భారీ స్కోర్ వ‌ద్ద డిక్లేర్ చేసింది. దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా (179) వీరోచిత సెంచ‌రీతో క‌దం తొక్కాడు. అత‌డితో పాటు మార్కో జాన్సెన్ కూడా 85 పరుగులతో రాణించాడు. ఆసీస్ బౌల‌ర్ల‌లో స్కాట్ బోలాండ్ 5 వికెట్ల‌తో స‌త్తాచాటాడు.

కుప్ప‌కూలిన ఆసీస్‌
అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియాను సఫారీ బౌలర్లు దెబ్బతీశారు. మార్కో జాన్సెన్ 5 వికెట్లతో చెలరేగడంతో ఆసీస్ కేవలం 99 పరుగులకే ఆలౌటై ఫాలోఆన్ ఆడింది.  రెండో ఇన్నింగ్స్‌(ఫాలో ఆన్‌)లో కూడా ఆసీస్ బ్యాట‌ర్ల తీరు మార‌లేదు. ఓపెన‌ర్‌ ట్రావిస్ హెడ్ (121) సెంచ‌రీతో స‌త్తాచాటిన‌ప్ప‌టికి, ఇతర బ్యాటర్ల నుంచి తగిన సహకారం లభించలేదు.

స్కాట్ బోలాండ్‌(40), అలెక్స్ కారీ(37) కాస్త ఫ‌ర్వాలేద‌న్పించారు. ఫలితంగా ఆసీస్ ఫాలో ఆన్‌లో 295 ప‌రుగులు చేసి ఇన్నింగ్స్ తేడాతో ఓట‌మి పాలైంది. సెకెండ్ ఇన్నింగ్స్‌లో స‌ఫారీ పేసర్లు కాగిసో రబాడా నాలుగు, వియాన్ ముల్డర్ మూడు వికెట్ల‌తో చెల‌రేగారు. ఇరు జ‌ట్ల మ‌ధ్య సిరీస్ డిసైడ‌ర్ మూడో టెస్ట్ అక్టోబ‌ర్ 27 నుంచి కేప్‌టౌన్ వేదిక‌గా ప్రారంభం కానుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement