WTC Final: ఓ వైపు గాయం.. అయినా కానీ! హ్యాట్సప్ బావుమా | Temba Bavuma's heroic innings earns respect of fans in WTC Final | Sakshi
Sakshi News home page

WTC Final: ఓ వైపు గాయం.. అయినా కానీ! హ్యాట్సప్ బావుమా

Jun 14 2025 11:38 AM | Updated on Jun 14 2025 11:57 AM

Temba Bavuma's heroic innings earns respect of fans in WTC Final

టెంబా బావుమా.. ఓ జ‌ట్టు నాయకుడు ఎలా ఉండాలో త‌న పోరాట ప‌టిమ‌తో చాటి చెప్పాడు. లార్డ్స్ వేదిక‌గా ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న వ‌ర‌ల్డ్ టెస్టు ఛాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్లో సౌతాఫ్రికా కెప్టెన్‌ బావుమా ఓ వారియ‌ర్‌లా పోరాడుతున్నాడు. ఓవైపు తీవ్ర‌మైన‌ గాయంతో బాధపడుతూనే త‌న జ‌ట్టును రెండో ఐసీసీ టైటిల్ విజ‌యానికి చేరువ చేశాడు.

త‌న గాయం కంటే.. స‌ఫారీల 27 ఏళ్ల క‌లే ముఖ్యమంటూ ముందుకు సాగుతున్నాడు. వియాన్ ముల్డ‌ర్ ఔట‌య్యాక క్రీజులోకి వ‌చ్చిన బావుమాకు ఆదిలోనే ఓ లైఫ్ వ‌చ్చింది. బావుమా ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను స్లిప్స్‌లో స్టీవ్ స్మిత్ జార‌విడిచాడు. ఆ త‌ర్వాత టెంబా ఎడ‌మ కాలి తొడ కండ‌రాలు ప‌ట్టేశాయి.

దీంతో ఫిజియో మైదానంలో వ‌చ్చి చికిత్స అందించాడు. నొప్పి తీవ్రంగా ఉండ‌డంతో అత‌డు రిటైర్డ్ హార్ట్‌గా వెనుదిరుగుతాడ‌ని అంతా భావించారు. కానీ బావుమా మాత్రం జ‌ట్టు విజ‌య‌మే ల‌క్ష్యంగా పెట్టుకున్నాడు. వికెట్ల మ‌ధ్య కుంటుతూనే ప‌రుగులు తీశాడు. నొప్పిని భరిస్తూనే అవ‌త‌లి ఎండ్‌లో మార్‌క్ర‌మ్‌కు స‌పోర్ట్‌గా నిలిచాడు.

సెంచ‌రీ హీరో మార్‌క్ర‌మ్‌తో క‌లిసి మూడో వికెట్‌కు 143 ప‌రుగుల ఆజేయ భాగ‌స్వామ్యం నెల‌కొల్పాడు. ఈ క్ర‌మంలో బావుమా పోరాట ప‌టిమ‌పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. బావుమా ది వారియర్ అంటూ పోస్టులు పెడుతున్నారు. బావుమా 65 పరుగులతో తన బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు.

కాగా ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా తమ విజయానికి కేవలం 69 పరుగుల దూరంలో నిలిచింది. 282 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ప్రోటీస్‌.. మూడో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి  రెండు వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. ద‌క్షిణాఫ్రికా ఓపెన‌ర్ ఐడైన్ మార్‌క్ర‌మ్(102 నాటౌట్‌) అద్బుత శత‌కంతో చెల‌రేగాడు.

అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 144/8తో ఆట కొనసాగించిన ఆ్రస్టేలియా తమ రెండో ఇన్నింగ్స్‌లో 207 పరుగులకు ఆలౌటైంది. స్టార్క్‌ (136 బంతుల్లో 58 నాటౌట్‌; 5 ఫోర్లు) హాఫ్‌ సెంచరీ సాధించాడు.
చదవండి: WTC Final 2025: మార్‌క్ర‌మ్ వ‌ర‌ల్డ్ రికార్డు.. ఇప్ప‌టివ‌ర‌కు ఎవ‌రికీ సాధ్యం కాలేదు

Advertisement
 
Advertisement
Advertisement