breaking news
WTC Final 2025
-
స్వదేశంలో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్లకు ఘన స్వాగతం (ఫొటోలు)
-
చరిత్ర సృష్టించిన బావుమా.. 148 ఏళ్ల టెస్ట్ క్రికెట్ హిస్టరీలోనే
టెంబా బావుమా.. ప్రస్తుతం ఈ పేరు వరల్డ్ క్రికెట్లో మారుమ్రోగిపోతుంది. షాన్ పొలాక్, మార్క్ బౌచర్, గ్రేమ్ స్మిత్, హషీమ్ అమ్లా, జాక్వస్ కల్లిస్ వంటి దిగ్గజ కెప్టెన్లకు సాధ్యం కానిది.. 35 ఏళ్ల బావుమా సాధించాడు. గత 27 ఏళ్ల అందని ద్రాక్షగా ఊరిస్తున్న ఐసీసీ ట్రోఫీని బావుమా తన దేశానికి తీసుకొచ్చాడు.లార్డ్స్ వేదికగా జరిగిన వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో ఆసీస్‌ను బావుమా సారథ్యంలోని ప్రోటీస్ 5 వికెట్ల తేడాతో ఓడించింది. దీంతో సఫారీలు రెండో ఐసీసీ టైటిల్‌ను తమ ఖాతాలో వేసుకున్నారు. ఈ మ్యాచ్‌లో బావుమా కెప్టెన్‌గా, ఆటగాడిగా ఆసాధరణ ప్రదర్శన కనబరిచాడు.తొలి ఇన్నింగ్స్‌లో 36 పరుగులతో కీలక నాక్ ఆడిన టెంబా.. రెండో ఇన్నింగ్స్‌లో విరోచిత పోరాటం చేశాడు. ఓ వైపు తొడ కండరాల గాయంతో బాధపడుతూనే.. జట్టును ముందుండి నడిపించాడు. 134 బంతుల్లో 66 పరుగులు చేసి జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించాడు.చరిత్ర సృష్టించిన బావుమా..తన కెప్టెన్సీతో సౌతాఫ్రికా సుదీర్ఘ నిరీక్షణకు తెరదించిన బావుమా.. ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. 148 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో కెప్టెన్‌గా తొలి 10 మ్యాచ్‌లలో ఓటమి లేకుండా తొమ్మిది విజయాలు సాధించిన ఏకైక ప్లేయర్‌గా బావుమా నిలిచాడు.బావుమా ఇప్పటివరకు పది మ్యాచ్‌లలో ప్రోటీస్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. అందులో సౌతాఫ్రికా తొమ్మిది మ్యాచ్‌లలో విజయం సాధించింది. మరొకటి డ్రాగా ముగిసింది. ఇప్పటివరకు ఎవరూ ఈ ఫీట్ సాధించలేకపోయారు. ఇంగ్లండ్‌కు చెందిన పెర్సీ చాప్మన్ కెప్టెన్‌గా తొలి 10 మ్యాచ్‌లలో తొమ్మిది విజయాలు సాధించాడు. కానీ అందులో ఓ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఓడిపోయింది.బావుమా కెప్టెన్సీలో మాత్రం దక్షిణాఫ్రికా తొలి 10 మ్యాచ్‌లలో ఒక్కటి కూడా ఓడిపోలేదు. చాప్మన్ 1926-31 మధ్య ఈ ఘనతను సాధించాడు. ఆసీస్ దిగ్గజం వార్విక్ ఆర్మ్ స్ట్రాంగ్ (1920-21) కూడా కెప్టెన్‌గా తొలి పది మ్యాచ్‌లలో ఓటమిని చవిచూడలేదు. కానీ అందులో 8 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, మరో రెండు మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి.చదవండి: IND vs ENG: సెలక్టర్లకు స్వీట్ వార్నింగ్.. ఇంగ్లండ్ గడ్డపై సర్ఫరాజ్ సూపర్ సెంచరీ -
వారిద్దరి వల్లే ఓడిపోయాము.. మా జట్టులో ఆ సమస్య ఉంది: ఆసీస్ కెప్టెన్
ఐసీసీ టోర్నీ ఫైనల్ అంటే చెలరేగిపోయే ఆస్ట్రేలియాకు దక్షిణాఫ్రికా ఓటమి రుచి చూపించింది. లార్డ్స్ వేదికగా జరిగిన వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో సౌతాఫ్రికా చేతిలో ఆసీస్ పరాజయం పాలైంది. 282 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ బౌలర్లు కాపాడుకోలేకపోయారు. తొలి ఇన్నింగ్స్‌లో కంగారులు పై చేయి సాధించినప్పటికి.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం బ్యాటింగ్, బౌలింగ్‌లో తేలిపోయారు.ఆసీస్ నిర్ధేశించిన లక్ష్యాన్ని ప్రోటీస్ జట్టు కేవలం 5 వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. దక్షిణాఫ్రికా స్టార్ ఐడైన్ మార్క్రమ్(136) అద్బుతమైన సెంచరీతో తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. అయితే ఐసీసీ టోర్నీ ఫైనల్లో ఆస్ట్రేలియా ఓడిపోవడం 15 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ స్పందించాడు. ఛాంపియన్స్ సౌతాఫ్రికాపై కమ్మిన్స్ ప్రశంసల వర్షం కురిపించాడు. బౌలింగ్, బ్యాటింగ్ అన్ని విభాగాల్లో అద్బుతంగా రాణించారని అతడు కొనియాడాడు.మిగితా ఫార్మాట్లతో పోలిస్తే టెస్టు క్రికెట్లో పరిస్థితులు కాస్త భిన్నంగా ఉంటాయి. మనం ఊహించని విధంగా పరిస్థితులు చాలా త్వరగా మారవచ్చు. ఈ మ్యాచ్‌లో మేము కొన్ని తప్పులు చేశాము. తొలి ఇన్నింగ్స్‌లో మంచి ఆధిక్యం లభించిన తర్వాత కూడా ప్రత్యర్ధి ముందు సరైన టార్గెట్‌ను ఉంచలేకపోయాము.ఇంకా సెషన్ బ్యాటింగ్ చేసి ఉంటే మంచి స్కోర్ వచ్చేండేది. కానీ దక్షిణాఫ్రికా మాకు అవకాశం ఇవ్వలేదు. స్టార్క్-హాజిల్‌వుడ్ కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. ప్రతీ పరుగుకు మేము చప్పట్లు కొట్టి అభినందించాము. బ్యాటింగ్ ఆర్డర్ టాప్-7లో మాకు కొన్ని సమస్యలు ఉన్నాయి. రాబోయే వాటిని పరిష్కరించుకుంటాము. కానీ జట్టులో ఉన్న ప్రతీ ఒక్క ప్లేయర్ గత రెండేళ్లుగా అద్బుతమైన ప్రదర్శన కనబరచడంతోనే మేము ఇక్కడవరకు వచ్చాము. దురదృష్టవశాత్తూ టాస్క్‌ను ఫినిష్ చేయలేకపోయాము.ఈ మ్యాచ్‌లో కూడా మొదటి రెండు రోజుల్లో మా బౌలర్లు బాగా రాణించారు. మేము ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకునేందుకు ప్రయత్నించాము. లియన్ నాథన్ లయన్ బాగానే బౌలింగ్ చేశాడు. కానీ అతనికి వికెట్ దక్కలేదు. ఐడెన్ మార్క్రమ్, టెంబా బావుమా అద్బుతమైన నాక్‌లు ఆడారు. మ్యాచ్‌ను మా నుంచి లాగేసుకున్నారు. మ్యాచ్ సాగిన నాలుగు రోజుల పాటు వారు ఎక్కడ పట్టు కోల్పోలేదు. విజయానికి వారు పూర్తి అర్హులు" అంటూ పోస్ట్ మ్యాచ్ ప్రెజేంటేషన్‌లో కమ్మిన్స్ పేర్కొన్నాడు.చదవండి: WTC Final: చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా.. టీమిండియా వరల్డ్ రికార్డు బద్దలు -
చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా.. టీమిండియా వరల్డ్ రికార్డు బద్దలు
వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ 2023-25ను దక్షిణాఫ్రికా కైవసం చేసుకుంది. లార్డ్స్ వేదికగా జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియాను 5 వికెట్ల తేడాతో ఓడించి డబ్ల్యూటీసీ గదను ప్రోటీస్ జట్టు సొంతం చేసుకుంది. 282 పరుగుల ఛేదనలో ఎయిడెన్ మార్క్రమ్ అద్భుత సెంచరీ (136)తో సఫారీలు చిరస్మరణీయ విజయం అందుకున్నారు.అతడితో కెప్టెన్ టెంబా బవూమా (66 పరుగులు) రాణించాడు. ప్రోటీస్ జట్టుకు ఇది రెండో ఐసీసీ టైటిల్ కావడం విశేషం. .1998లో సౌతాఫ్రికాకు హాన్సీ క్రోన్జే ఐసీసీ ట్రోఫీని అందించగా.. ఇప్పుడు 27 ఏళ్ల తర్వాత బావుమా తిరిగి మళ్లీ వరల్డ్ ఛాంపియన్‌గా నిలిపాడు. ఇక చారిత్రత్మక విజయం సాధించిన దక్షిణాఫ్రికా జట్టు పలు అరుదైన రికార్డులను తమ ఖాతాలో వేసుకుంది.టీమిండియా వరల్డ్ రికార్డు బద్దలు..👉ఐసీసీ టోర్నమెంట్ ఫైనల్లో అత్యధిక లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా సౌతాఫ్రికా వరల్డ్ రికార్డు సృష్టించింది. ఇప్పటివరకు ఈ రికార్డు టీమిండియా పేరిట ఉండేది. 2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో శ్రీలంకపై.. ఎంఎస్ ధోని సారథ్యంలోని భారత జట్టు 275 పరుగుల లక్ష్యాన్ని చేధించింది. తాజా మ్యాచ్‌లో 282 పరుగుల టార్గెట్‌ను ఊదిపడేసిన దక్షిణాఫ్రికా.. భారత్ ఆల్‌టైమ్ రికార్డును బ్రేక్ చేసింది.👉అదేవిధంగా లార్డ్స్ మైదానంలో టెస్టుల్లో అత్యధిక టార్గెట్‌ను చేధించిన రెండో జట్టుగా ఇంగ్లండ్ సరసన దక్షిణాఫ్రికా నిలిచింది. 2004లో న్యూజిలాండ్‌పై 282 పరుగుల టార్గెట్‌ను ఇంగ్లండ్ చేధించగా.. ఇప్పుడు 21 ఏళ్ల తర్వాత అదే లక్ష్యాన్ని ప్రోటీస్ ఛేజ్ చేసింది. ఈ అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో వెస్టిండీస్ అగ్రస్ధానంలో ఉంది. 1984లో ఇంగ్లండ్‌పై 344 పరుగుల టార్గెట్‌ను విండీస్ చేధించింది.చదవండి: వారిద్దరూ అద్భుతం.. నాకు మాటలు కూడా రావడం లేదు: బావుమా -
వారిద్దరూ అద్భుతం.. నాకు మాటలు కూడా రావడం లేదు: బావుమా
సౌతాఫ్రికా సుదీర్ఘ నిరీక్షణ ముగిసింది. వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ 2023-25 విజేతగా నిలిచిన దక్షిణాఫ్రికా.. 27 ఏళ్ల తర్వాత రెండో ఐసీసీ టైటిల్‌ను ముద్దాడింది. లార్డ్స్ వేదికగా జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియాను ఐదు వికెట్ల తేడాతో చిత్తు చేసిన సఫారీలు.. టెస్టు ఛాంపియన్షిప్ గదను సొంతం చేసుకుకున్నారు.ఆసీస్ నిర్ధేశించిన 282 పరుగుల లక్ష్యాన్ని ప్రోటీస్ 5 వికెట్ల కోల్పోయి చేధించింది. మ్యాన్ ఆప్‌ది మ్యాచ్ ఐడైన్ మార్క్రమ్(136) సౌతాఫ్రికా చారిత్రక విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతడితో పాటు బావుమా(66) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. అదేవిధంగా బౌలర్లు కూడా రెండు ఇన్నింగ్స్‌లలో అద్బుతంగా రాణించారు.కగిసో రబాడ ఓవరాల్‌గా రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 9 వికెట్లు పడగొట్టగా.. లుంగీ ఎంగిడీ మూడు, జానెసన్ నాలుగు వికెట్లు సాధించారు. ఇక ఈ అద్బుత విజయంపై మ్యాచ్ అనంతరం టెంబా బావుమా స్పందించాడు. ఈ రోజు కోసమే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నామని బావుమా తెలిపాడు."ఈ విజయం మాకు చాలా ప్రత్యేకం. ముందుగా మాకు ఇక్కడ సపోర్ట్‌గా నిలిచిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. వారి మద్దతు నాకు దక్షిణాఫ్రికాలో ఆడుతున్న అనుభూతిని కలిగించింది. ఈ క్షణం కోసమే మేము ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నాము. అందుకోసం చాలా కష్టపడ్డాము. మా కంటూ ఒక రోజు వస్తుందని అని నమ్మకంతో ముందుకు సాగాము.కానీ అదే సమయంలో చాలా సందేహాలు కూడా ఉండేవి. కానీ వాటన్నంటిని ఈ రోజు మేము జయించాము. ఒక జట్టుగా మాకు ఇది గర్వించదగ్గ విజయం. ఈ విజయం కోసమే ఎన్నో ఏళ్లగా ప్రయత్నిస్తున్నాము. సెమీఫైనల్స్, ఫైనల్స్‌లో ఓడిపోయి హృదయ వేదన అనుభవించాము. కానీ ఎక్కడ కూడా మేము వెనకడుగు వేయలేదు. అదే ఎనర్జీ, అదే పోరాట పటిమతో మా ప్రయాణాన్ని కొనసాగించాము. ఎట్టకేలకు మా లక్ష్యాన్ని చేరుకున్నాము. కగిసో రబాడ ఇక అద్బుతమైన ఆటగాడు. రెండు రోజుల క్రితం నేను ఐసిసి హాల్ ఆఫ్ ఫేమ్ ఈవెంట్‌కు వెళ్లాను. రాబోయే కాలంలో రబాడ కచ్చితంగా ఐసిసి హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కించుకుంటాడని భావిస్తున్నాను.అతడు ఈ మ్యాచ్‌కు ముందు ఓ వివాదంలో చిక్కుకున్నాడు. అయినప్పటికి ఈ ఫైనల్ మ్యాచ్‌లో ఛాంపియన్ ప్రదర్శన కనబరిచాడు. మరోవైపు మార్క్రమ్ గురుంచి ఎంత చెప్పిన తక్కువే. మార్క్రమ్ టెస్టు జట్టులో ఎందుకు అని చాలా మంది ప్రశ్నించారు. వారిందరికి మార్క్రమ్ తన బ్యాట్‌తోనే సమాధానం చెప్పాడు.రెండో ఇన్నింగ్స్‌లో ఎవరో ఒకరు చివరి వరకు క్రీజులో ఉండాలని నిర్ణయించుకున్నాము. ఆ బాధ్యతను మార్క్రమ్ తీసుకున్నాడు. ఫైనల్ మ్యాచ్‌లో ఇటువంటి ప్రదర్శన చేయడం చాలా సంతోషంగా ఉంది. నాకు మాటలు కూడా రావడం లేదు. మా దేశ ప్రజలు కూడా మా సెలబ్రేషన్స్‌లో భాగం అవుతారని భావిస్తున్నాను" అని ప్రెస్ కాన్ఫరెన్స్‌లో బావుమా పేర్కొన్నాడు. కాగా దక్షిణాఫ్రికా క్రికెట్ చరిత్రలో టెంబా బావుమా పేరు చిరస్మరణీయంగా నిలిచిపోతుంది. సౌతాఫ్రికాకు రెండో ఐసీసీ టైటిల్ అందిచిన కెప్టెన్‌గా బావుమా చరిత్ర పుటలెక్కాడు.చదవండి: WTC Final 2025: ఛాంపియన్ దక్షిణాఫ్రికాకు ప్రైజ్‌మనీ ఎన్ని కోట్లంటే? -
WTC ఛాంపియన్ దక్షిణాఫ్రికాకు ప్రైజ్‌మనీ ఎన్ని కోట్లంటే?
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) 2023-25 విజేతగా దక్షిణాఫ్రికా అవతరించింది. లార్డ్స్ వేదికగా జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియాను 5 వికెట్ల తేడాతో ఓడించిన సౌతాఫ్రికా.. 27 ఏళ్ల తర్వాత తొలి ఐసీసీ టైటిల్‌ని ముద్దాడింది. ఆసీస్ నిర్ధేశించిన 282 పరుగుల లక్ష్యాన్ని ప్రోటీస్ జట్టు కేవలం ఐదు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో ఐడైన్ మార్క్రమ్ సూపర్ సెంచరీతో చెలరేగాడు. 207 బంతులు ఎదుర్కొన్న మార్క్రమ్.. 14 ఫోర్ల సాయంతో 136 పరుగులు చేశాడు. అతడితో పాటు టెంబా బావుమా(64) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ మూడు, హాజిల్‌వుడ్, కమ్మిన్స్ తలా వికెట్‌సాధించారు.దక్షిణాఫ్రికా ప్రైజ్‌మనీ ఎన్ని కోట్లంటే?ఇక వరల్డ్ ఛాంపియన్స్‌గా నిలిచిన దక్షిణాఫ్రికాకు ఎంతో ప్రైజ్‌మనీ దక్కింది, రన్నరప్ ఆస్ట్రేలియాకు ఎంతో మొత్తం లభించిందో తెలుసుకుందాం. తొలిసారి డబ్ల్యూటీసీ విజేతగా నిలిచిన ప్రోటీస్‌కు టెస్టు ఛాంపియన్ షిప్ గదతో పాటు ప్రైజ్‌మనీ కింద 3.6 మిలియన్ల డాలర్లు( భారత కరెన్సీలో సుమారు రూ.31.05 కోట్లు) లభించింది. గత రెండు ఎడిషన్లతో పోలిస్తే.. ప్రైజ్ మనీనీ ఈసారి రెండింతలు ఐసీసీ పెంచింది.ఇక రన్నరప్ ఆస్ట్రేలియాకు 2.1 మిలియన్ల డాలర్ల (రూ.18.63 కోట్లు) ప్రైజ్‌మనీ దక్కింది. ఇక డబ్యూటీసీ 2023-25 సైకిల్లో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచిన భారత జట్టుకు 1.44 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 12. 42 కోట్లు) క్యాష్ ప్రైజ్ అందనుంది.WTC 2025 ప్రైజ్‌మనీ వివరాలుసౌతాఫ్రికా: రూ. 31.05 కోట్లుఆస్ట్రేలియా: రూ. 18.63 కోట్లుఇండియా: రూ. 12.42 కోట్లున్యూజిలాండ్: రూ. 10.35 కోట్లుఇంగ్లండ్: రూ. 8.28 కోట్లుశ్రీలంక: రూ. 7.24 కోట్లుబంగ్లాదేశ్: రూ. 6.21 కోట్లువెస్టిండీస్: రూ. 5.17 కోట్లుపాకిస్తాన్: రూ. 4.14 కోట్లుచదవండి: WTC 2025: వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ విజేతగా సౌతాఫ్రికా.. -
SA Vs AUS Photos: 27 ఏళ్ల నిరీక్షణకు తెర.. డబ్ల్యూటీసీ విజేతగా సౌతాఫ్రికా (ఫొటోలు)
-
వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ విజేతగా సౌతాఫ్రికా..
ఎన్నో ఏళ్ల నిరీక్షణ.. ఎంతో మంది దిగ్గజ క్రికెటర్ల చిరకాల స్వప్నం. గత 27 ఏళ్లగా అందని ద్రాక్షగా ఊరిస్తున్న ఐసీసీ టైటిల్ ఎట్టకేలకు ఆ జట్టు సొంతమైంది. ఇకపై మేము ఛోకర్స్ కాదు ఛాంపియన్స్ అంటూ క్రికెట్ ప్రపంచానికి సఫారీలు చాటి చెప్పారు. వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ 2023-25 ఫైనల్ విజేతగా సౌతాఫ్రికా నిలిచింది. లార్డ్స్ వేదికగా జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియాను 5 వికెట్ల తేడాతో చిత్తు చేసిన దక్షిణాఫ్రికా.. తమ సుదీర్ఘ నిరీక్షణకు తెరదించింది. ఆసీస్ నిర్ధేశించిన 282 పరుగుల లక్ష్యాన్ని ప్రోటీస్ జట్టు ఐదు వికెట్లు కోల్పోయి చేధించింది.మార్క్రమ్ సూపర్ సెంచరీ..సౌతాఫ్రికా వరల్డ్ ఛాంపియన్స్‌గా నిలవడంతో ఆ జట్టు ఓపెనర్ ఐడైన్ మార్‌క్రమ్‌ది కీలక పాత్ర. భారీ లక్ష్య చేధనలో మార్క్రమ్ అద్బుతమైన సెంచరీతో మెరిశాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచి ఆచితూచి ఆడుతూ తన జట్టుకు రెండో ఐసీసీ టైటిల్‌ను అందించాడు. అతడి ఇన్నింగ్స్‌కు ప్రత్యర్ధి జట్టు ఆటగాళ్లు సైతం ఫిదా అయిపోయారు. ఆఖరిలో ఔటయ్యి తిరిగి డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్తుండగా లార్డ్స్‌లోని ప్రేక్షకులు స్టాండింగ్ ఓవియేషన్ ఇచ్చారు. ఓవరాల్‌గా 207 బంతులు ఎదుర్కొన్న మార్క్రమ్.. 14 ఫోర్ల సాయంతో 136 పరుగులు చేశాడు.బావుమాది వారియర్..ఈ మ్యాచ్‌లో మార్క్రమ్ సెంచరీ ఎంతో విలువైందో, బావుమా ఇన్నింగ్స్ కూడా వెలకట్టలేనిది. తొడ కండరాల గాయంతో బాధపడుతునే తన జట్టు కోసం బావుమా పోరాడాడు. 134 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో 66 పరుగులు చేశాడు. మార్క్రమ్తో కలిసి కీలక బాగస్వామ్యాన్ని నెలకొల్పిన బావుమా.. దక్షిణాఫ్రికాకు రెండో ఐసీసీ టైటిల్‌ను అందించిన కెప్టెన్‌గా చరిత్రకెక్కాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్ మూడు వికెట్లు పడగొట్టగా, హాజిల్‌వుడ్ కమ్మిన్స్ తలా వికెట్ సాధించారు.ఇక ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 212 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో వెబ్‌స్టెర్(72) టాప్ స్కోరర్‌గా నిలవగా.. స్టీవ్ స్మిత్(66) రాణించాడు. సఫారీ బౌలర్లలో రబాడ ఐదు వికెట్లు పడగొట్టగా.. మార్కో జానెసన్ మూడు వికెట్లు సాధించాడు. అనంతరం దక్షిణాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్‌లో 138 పరుగులకే కుప్పకూలింది. ప్యాట్ కమ్మిన్స్ 6 వికెట్లు పడగొట్టి ప్రోటీస్ పతనాన్ని శాసించాడు. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ 207 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో లభించిన ఆధిక్యాన్ని జోడించి సఫారీల ముందు 282 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఈ లక్ష్యాన్ని చేధించి ప్రోటీస్ ఛాంపియన్స్‌గా నిలిచింది.సంక్షిప్త సమాచారం..ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ స్కోర్: 212/10దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ స్కోర్: 138/10ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ స్కోర్: 207/10సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్ స్కోర్: 282/5ఫలితం: ఆసీస్‌సై 5 వికెట్ల తేడాతో సౌతాఫ్రికా విజయంమ్యాన్ ఆఫ్ ది మ్యాచ్: ఐడైన్ మార్క్రమ్ -
చరిత్ర సృష్టించిన టెంబా బావుమా.. తొలి కెప్టెన్‌గా
27 ఏళ్ల తర్వాత తొలి ఐసీసీ టైటిల్‌ను సొంతం చేసుకునేందుకు సౌతాఫ్రికా కేవలం 69 పరుగుల దూరంలో నిలిచింది. ఐకానిక్ లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) ఫైనల్లో ప్రోటీస్ విజయానికి చేరువైంది.282 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. ఆరంభంలో రెండు వికెట్లు కోల్పోయినప్పటికి సౌతాఫ్రికా తిరిగి పుంజుకుంది. ఐడైన్ మార్క్రమ్(102 బ్యాటింగ్), బావుమా(65 బ్యాటింగ్) అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తున్నారు.వీరిద్దరూ మూడో వికెట్‌కు 143 పరుగుల ఆజేయ భాగస్వామ్యం నెలకొల్పారు. బావుమా ఓ వైపు గాయంతో బాధపడుతూనే తన బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు. మొదటి ఇన్నింగ్స్‌లో బావుమా కీలక నాక్ ఆడాడు. ఈ క్రమంలో టెంబా బావుమా ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు.తొలి కెప్టెన్‌గా..డబ్ల్యూటీసీ ఫైనల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన కెప్టెన్‌గా బావుమా నిలిచాడు. టెంబా బావుమా 3వ రోజు ముగిసే సమయానికి 121 బంతుల్లో 65 పరుగులు చేశాడు. ఇంతకుముందు ఈ రికార్డు కివీస్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ పేరిట ఉండేది. విలియమ్సన్ డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత్‌పై 52 పరుగులు చేశాడు. తాజా ఇన్నింగ్స్‌తో విలియమ్సన్ రికార్డును బావుమా బ్రేక్ చేశాడు.చదవండి: 'మ్యాచ్ ఇంకా ముగియ లేదు'.. ప్రోటీస్‌కు ఆసీస్ కోచ్ వార్నింగ్ -
'మ్యాచ్ ఇంకా ముగియ లేదు'.. ప్రోటీస్‌కు ఆసీస్ కోచ్ వార్నింగ్
లార్డ్స్ వేదికగా ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ ముగింపునకు చేరుకుంది. నాలుగో రోజు మొదటి సెషన్లో ఫలితం తేలే అవకాశముంది. తొలి డబ్ల్యూటీసీ టైటిల్ విజయానికి సౌతాఫ్రికా కేవలం 69 పరుగుల దూరంలో నిలవగా.. ఆస్ట్రేలియా 8 వికెట్ల దూరంలో ఉంది.ఆసీస్ ఓటమి నుంచి తప్పించుకోవాలంటే ఏదైనా అద్బుతం జరిగాలి. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా అసిస్టెంట్ కోచ్ డేనియల్ వెట్టోరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఫైనల్ మ్యాచ్ ఇంకా ముగియలేదని, గెలిచేందుకు ఇంకా దారులు తెరిచే ఉన్నాయని ఈ కివీస్ మాజీ కెప్టెన్ తెలిపాడు.282 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. క్రీజులో ఐడైన్ మార్క్రమ్(102), బావుమా(65) ఉన్నారు."ఈ ఫైనల్ మ్యాచ్‌పై మాకు ఇంకా ఆశలు ఉన్నాయి. మ్యాచ్ ఇంకా ముగియలేదు, ఒక్క వికెట్ పడితే ఏదైన జరగొచ్చు. ప్రస్తుతం మార్క్రమ్, బావుమా తమ ఆధీనంలో ఉంచుకున్నారు. కానీ ఎవరో ఒకరు ఔటయ్యాక కొత్త బ్యాటర్ క్రీజులోకి వచ్చే పరిస్థితి వెరే విధంగా ఉంటుంది.ఇప్పుడు వికెట్లు ఎలా తీయాలన్నదే మేము ఆలోచిస్తున్నాము. తొలి సెషన్లో సవాల్లను ఎదుర్కొనేందుకు మా బౌలర్లు సిద్దంగా ఉన్నారని" వెట్టోరి మూడో రోజు ఆట అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పేర్కొన్నాడు. కాగా తొలి ఇన్నింగ్స్‌లో నిప్పులు చెరిగిన స్టార్క్, కమ్మిన్స్, హాజిల్‌వుడ్ ఆసీస్ పేస్ త్రయం.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం పూర్తిగా తెలిపోయారు. స్టార్క్ ఒక్కడే ఇప్పటివరకు రెండు వికెట్లు పడగొట్టాడు.చదవండి: WTC Final 2025: మార్క్రమ్ వరల్డ్ రికార్డు.. ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కాలేదు -
WTC Final: ఓ వైపు గాయం.. అయినా కానీ! హ్యాట్సప్ బావుమా
టెంబా బావుమా.. ఓ జట్టు నాయకుడు ఎలా ఉండాలో తన పోరాట పటిమతో చాటి చెప్పాడు. లార్డ్స్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో సౌతాఫ్రికా కెప్టెన్ బావుమా ఓ వారియర్‌లా పోరాడుతున్నాడు. ఓవైపు తీవ్రమైన గాయంతో బాధపడుతూనే తన జట్టును రెండో ఐసీసీ టైటిల్ విజయానికి చేరువ చేశాడు.తన గాయం కంటే.. సఫారీల 27 ఏళ్ల కలే ముఖ్యమంటూ ముందుకు సాగుతున్నాడు. వియాన్ ముల్డర్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన బావుమాకు ఆదిలోనే ఓ లైఫ్ వచ్చింది. బావుమా ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను స్లిప్స్‌లో స్టీవ్ స్మిత్ జారవిడిచాడు. ఆ తర్వాత టెంబా ఎడమ కాలి తొడ కండరాలు పట్టేశాయి.దీంతో ఫిజియో మైదానంలో వచ్చి చికిత్స అందించాడు. నొప్పి తీవ్రంగా ఉండడంతో అతడు రిటైర్డ్ హార్ట్‌గా వెనుదిరుగుతాడని అంతా భావించారు. కానీ బావుమా మాత్రం జట్టు విజయమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. వికెట్ల మధ్య కుంటుతూనే పరుగులు తీశాడు. నొప్పిని భరిస్తూనే అవతలి ఎండ్‌లో మార్క్రమ్కు సపోర్ట్‌గా నిలిచాడు.సెంచరీ హీరో మార్క్రమ్తో కలిసి మూడో వికెట్‌కు 143 పరుగుల ఆజేయ భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ క్రమంలో బావుమా పోరాట పటిమపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. బావుమా ది వారియర్ అంటూ పోస్టులు పెడుతున్నారు. బావుమా 65 పరుగులతో తన బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు.కాగా ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా తమ విజయానికి కేవలం 69 పరుగుల దూరంలో నిలిచింది. 282 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ప్రోటీస్.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా ఓపెనర్ ఐడైన్ మార్క్రమ్(102 నాటౌట్) అద్బుత శతకంతో చెలరేగాడు.అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 144/8తో ఆట కొనసాగించిన ఆ్రస్టేలియా తమ రెండో ఇన్నింగ్స్‌లో 207 పరుగులకు ఆలౌటైంది. స్టార్క్ (136 బంతుల్లో 58 నాటౌట్; 5 ఫోర్లు) హాఫ్ సెంచరీ సాధించాడు.చదవండి: WTC Final 2025: మార్క్రమ్ వరల్డ్ రికార్డు.. ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కాలేదు -
ఆస్ట్రేలియాకు భారీ షాక్.. స్టీవ్ స్మిత్‌కు తీవ్ర గాయం
లార్డ్స్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియా సూపర్ స్టార్ స్టీవ్ స్మిత్ గాయపడ్డాడు. మూడో రోజు ఆట సందర్భంగా స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా స్మిత్ చేతి వేలికి గాయమైంది. సౌతాఫ్రికా సెకెండ్ ఇన్నింగ్స్ 20వ ఓవర్ వేసిన మిచెల్ స్టార్క్.. రెండో బంతిని బావుమాకు షార్ట్ లెంగ్త్ డెలివరీగా సంధించాడు.ఆ బంతిని బావుమా లెగ్ సైడ్ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే బంతి థిక్ ఎడ్జ్ తీసుకుని సెకెండ్ స్లిప్ దిశగా వెళ్లింది. ఈ క్రమంలో స్మిత్ ఆ క్యాచ్‌ను అందుకునే ప్రయత్నం చేశాడు. ఈ ప్రయత్నంలో బంతి బలంగా స్మిత్ చిటికెన వేలికి తాకింది. దీంతో స్మిత్ తీవ్రమైన నొప్పితో విల్లవిల్లాడు.వెంటనే ఫిజియో సాయంతో స్మిత్ మైదానం నుంచి బయటకు వెళ్లిపోయాడు. అతడి స్దానంలో కొన్‌స్టాస్ సబ్‌స్ట్యూట్‌గా ఫీల్డ్‌లోకి వచ్చాడు. స్మిత్ గాయంపై క్రికెట్ ఆస్ట్రేలియా అప్డేట్ ఇచ్చింది. అతడి చిటికెన వేలు ఎముక పక్కకు జరిగిందని క్రికెట్ ఆస్ట్రేలియా ఓ ప్రకటనలో పేర్కొంది. దీంతో త్వరలో వెస్టిండీస్‌తో జరనున్న టెస్టు సిరీస్‌కు స్మిత్ దూరమయ్యే అవకాశముంది. -
చరిత్ర సృష్టించిన మిచెల్ స్టార్క్.. ప్రపంచ క్రికెట్లో తొలి ప్లేయర్‌గా
లార్డ్స్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) ఫైనల్లో ఆస్ట్రేలియా స్టార్ పేసర్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో బంతితో మ్యాజిక్ చేసిన స్టార్క్.. రెండో ఇన్నింగ్స్‌లో బ్యాట్‌తో తన జట్టును ఆదుకున్నాడు. 77 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన ఆసీస్‌ను స్టార్క్ తన విరోచిత పోరాటంతో గట్టెక్కించాడు. హెడ్, స్మిత్, లబుషేన్ వంటి స్టార్ ప్లేయర్లు విఫలమైన చోట.. స్టార్క్ తన విలువను మరోసారి చాటుకున్నాడు. తొమ్మిదో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ఈ స్పీడ్ స్టార్.. ప్రోటీస్ బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. 136 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో 58 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో స్టార్క్ ఓ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు.ఓ ఐసీసీ టోర్నమెంట్ ఫైనల్లో తొమ్మిది లేదా అంతకంటే తక్కువ స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చి అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన ఆటగాడిగా స్టార్క్ చరిత్ర సృష్టించాడు. ఇప్పటివరకు ఈ రికార్డు వెస్టిండీస్ మాజీ ఆటగాడు కోర్ట్నీ బ్రౌన్ పేరిట ఉండేది. 2004 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఇంగ్లండ్‌పై తొమ్మిదో స్దానంలో బ్యాటింగ్‌కు వచ్చిన బ్రౌన్.. 35 పరుగులు చేశాడు. తాజా మ్యాచ్‌తో బ్రౌన్ ఆల్‌టైమ్ రికార్డును స్టార్క్ బ్రేక్ చేశాడు.సౌతాఫ్రికా టార్గెట్ 282..ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 207 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో లభించిన ఆధిక్యాన్ని జోడించి సౌతాఫ్రికా ముందు 282 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ ఉంచింది. ఆసీస్ బ్యాటర్లలో స్టార్క్‌తో పాటు అలెక్స్ క్యారీ(43) పరుగులతో రాణించాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో రబాడ నాలుగు వికెట్లు పడగొట్టగా.. లుంగీ ఎంగిడీ మూడు, జానెసన్,మార్క్రమ్ తలా వికెట్ సాధించారు. -
నల్లటి ఆర్మ్ బ్యాండ్లతో ఆసీస్-సౌతాఫ్రికా ఆటగాళ్లు
లార్డ్స్ వేదికగా జరుగుతున్న వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ మూడో రోజు ఆటలో ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా నల్లటి ఆర్మ్ బ్యాండ్లు ధరించి బరిలోకి దిగారు. గురువారం(జూన్ 12) అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినవారికి సంతాపం తెలుపుతూ బ్లాక్ బ్యాండ్స్‌ను ధరించారు.ఆట ఆరంభానికి ముందు ఇరు జట్లు ఆటగాళ్లు రెండు నిమిషాల పాటు మౌనం కూడా పాటించారు. మరో వైపు ఇంట్రాస్వ్కాడ్ ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత జట్టు ఆటగాళ్లు కూడా అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనపై సంతాపం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను అధికారిక బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ ఎక్స్‌లో షేర్ చేసింది.కాగా అహ్మదాబాద్ నుంచి లండన్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన వెంటనే కూలిపోయింది. ఈ ఘోర ప్రమాదంలో మొత్తం 265 మంది తమ ప్రాణాలు కోల్పోయారు. ఊహించని ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఇక డబ్ల్యూటీసీ ఫైనల్ విషయానికి వస్తే.. రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా తడబడి నిలబడింది.టాపార్డర్ విఫలమైనప్పటికి.. అలెక్స్ క్యారీ(43), మిచెల్ స్టార్క్(44 బ్యాటింగ్) ఆసీస్‌ను ఆదుకున్నారు. ఆసీస్ తమ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 59 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసింది. కంగారులు ప్రస్తుతం 260 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.The sports fraternity observes a solemn moment of silence in memory of the lives lost in the tragic Ahmedabad plane crash, standing in deep solidarity with the grieving families during this difficult time. pic.twitter.com/nTXfRnyksP— Star Sports (@StarSportsIndia) June 13, 2025చదవండి: IND vs ENG: ఫ్యామిలీ ఎమర్జెన్సీ.. భారత్‌కు తిరిగొచ్చిన గౌతం గంభీర్ -
WTC Final 2025: విజయానికి చేరువలో సౌతాఫ్రికా
విజయం దిశగా సౌతాఫ్రికా..లార్డ్స్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో సౌతాఫ్రికా విజయం దిశగా పయనిస్తోంది. మూడో రోజు ఆటముగిసే సమయానికి సౌతాఫ్రికా రెండు వికెట్లు కోల్పోయి 213 పరుగులు చేసింది. క్రీజులో ఐడైన్ మార్క్రమ్(102), టెంబా బావుమా(65) ఉన్నారు. ప్రోటీస్ విజయానికి ఇంకా 69 పరుగులు కావాలి.లక్ష్యం దిశగా సౌతాఫ్రికా..282 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా ధీటుగా బదులిస్తోంది. 39 ఓవర్లు ముగిసే సరికి దక్షిణాఫ్రికా.. రెండు వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. క్రీజులో ఐడైన్ మార్క్రమ్(76), బావుమా(41) ఉన్నారు. ప్రోటీస్ విజయానికి ఇంకా 122 పరుగులు కావాలి.మార్క్రమ్ హాఫ్ సెంచరీసౌతాఫ్రికా సెకెండ్ ఇన్నింగ్స్‌లో మార్క్రమ్ హాఫ్ సెంచరీ సాధించాడు. 51 పరుగులతో తన బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు. 26 ఓవర్లు ముగిసే సరికి దక్షిణాఫ్రికా రెండు వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసింది.సౌతాఫ్రికా రెండో వికెట్ డౌన్..వియాన్ ముల్డర్ రూపంలో సౌతాఫ్రికా రెండో వికెట్ కోల్పోయింది. 27 పరుగులు చేసిన ముల్డర్.. స్టార్క్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 20 ఓవర్లకు సౌతాఫ్రికా రెండు వికెట్లు కోల్పోయి 79 పరుగులు చేసింది. క్రీజులో మార్క్రమ్(41), బావుమా(5) ఉన్నారు. సౌతాఫ్రికా విజయానికి ఇంకా 201 పరుగులు కావాలి.నిలకడగా ఆడుతున్న సౌతాఫ్రికా..282 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా నిలకడగా ఆడుతోంది. 10 ఓవర్లు ముగిసే సరికి సౌతాఫ్రికా వికెట్ నష్టానికి 47 పరుగులు చేసింది. క్రీజులో ఐడైన్ మార్క్రమ్(19), ముల్డర్(22) ఉన్నారు.సౌతాఫ్రికా తొలి వికెట్ డౌన్..ర్యాన్ రికెల్టన్ రూపంలో దక్షిణాఫ్రికా తొలి వికెట్ కోల్పోయింది. 6 పరుగులు చేసిన రికెల్టన్.. స్టార్క్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.సౌతాఫ్రికా టార్గెట్ 282 పరుగులు..లార్డ్స్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియా తమ రెండో ఇన్నింగ్స్‌లో 207 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో లభించిన ఆధిక్యాన్ని జోడించి సౌతాఫ్రికా ముందు 282 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ ఉంచింది. ఆసీస్ బ్యాటర్లలో టెయిలాండర్ మిచెల్ స్టార్క్ అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.టాపర్డర్, మిడిలార్డర్ బ్యాటర్లు విఫలమైనప్పటికి స్టార్క్ మాత్రం ప్రోటీస్ బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. స్టార్క్ 58 పరుగులతో ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు వికెట్ కీపర్ బ్యాటర్ అలెక్స్ క్యారీ(43) పరుగులతో రాణించాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో రబాడ నాలుగు వికెట్లు పడగొట్టగా.. లుంగీ ఎంగిడీ మూడు, జానెసన్,మార్క్రమ్ తలా వికెట్ సాధించారు.మిచెల్ స్టార్క్ హాఫ్ సెంచరీ.లార్డ్స్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో మిచెల్ స్టార్క్ ఇటు బంతితోనూ, అటు బ్యాట్‌తోనూ రాణిస్తున్నాడు. సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఆసీస్ టాపర్డర్, మిడిలార్డర్ బ్యాటర్లు విఫలమైనప్పటికి స్టార్క్ మాత్రం ప్రోటీస్ బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తున్నాడు. ఈ క్రమంలో తన హాఫ్ సెంచరీ మార్క్‌ను స్టార్క్ అందుకున్నాడు. 53 పరుగులతో తన బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు. 64 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా తొమ్మిది వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. క్రీజులో స్టార్క్‌తో పాటు హాజిల్‌వుడ్(17) కూడా ఉన్నాడు. సౌతాఫ్రికాకు ఆసీస్ టెయిలాండర్ బ్యాటర్ మిచెల్ స్టార్క్ కొరకరాని కొయ్యగా మారాడు. తన బ్యాటింగ్‌తో సఫారీలను ముప్పు తిప్పలు పెడుతున్నాడు. 37 పరుగులతో స్టార్క్ తన బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు. 51 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్ తమ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. కంగారులు ప్రస్తుతం 249 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.ఆసీస్ తొమ్మిదో వికెట్ డౌన్..ఆస్ట్రేలియా తొమ్మిదో వికెట్ కోల్పోయింది. 2 పరుగులు చేసిన నాథన్ లియోన్.. రబాడ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. 43 ఓవర్లకు ఆసీస్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 9 వికెట్లు కోల్పోయి 148 పరుగులు చేసింది. క్రీజులో స్టార్క్(19), హాజిల్‌వుడ్(0) ఉన్నారు.లార్డ్స్ వేదికగా ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా మధ్య వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ మూడో రోజు ఆట ప్రారంభమైంది. 144-8 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజును ఆటను ఆసీస్ ఆరంభించింది. క్రీజులో మిచెల్ స్టార్క్(16), నాథన్ లియోన్(2) ఉన్నారు. ఆసీస్ ప్రస్తుతం 218 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. అంతకుముందు దక్షిణాఫ్రికా తమ మొదటి ఇన్నింగ్స్‌లో 138 పరుగులకే కుప్పకూలిందితుది జట్లుఆస్ట్రేలియా: ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, కామెరూన్ గ్రీన్, స్టీవ్ స్మిత్, హెడ్, వెబ్‌స్టర్, అలెక్స్ కేరీ (వికెట్ కీపర్), పాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్, నాథన్ లియోన్.దక్షిణాఫ్రికా: ఐదెన్ మార్క్రమ్, ర్యాన్ రికిల్టన్, వియాన్ ముల్దర్, తెంబా బవుమా (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, బెడింగ్‌టన్, కైల్ వెరీన్ (వికెట్ కీపర్), మార్కో యాన్సెన్, కేశవ్ మహరాజ్, కగిసో రబాడ, లుంగి ఎంగిడి. -
WTC Final 2025: కమిన్స్ ట్రిపుల్ సెంచరీ
లార్డ్స్ వేదికగా సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-25 ఫైనల్ రసవత్తరంగా సాగుతుంది. తొలి రెండు రోజుల్లోనే ఇరు జట్లకు చెందిన 28 వికెట్లు కూలడంతో మ్యాచ్ నువ్వా నేనా అన్నట్లు మారింది. ప్రస్తుతానికి ఆసీస్ ఆధిక్యంలో ఉన్నట్లు కనిపిస్తున్నా, నిలబెట్టుకుంటుందన్న గ్యారెంటీ లేదు.రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ 218 పరుగుల ఆధిక్యంలో ఉంది. రెండో ఇన్నింగ్స్‌లో ఆ జట్టు 8 వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది. మిచెల్ స్టార్క్ (16), నాథన్ లియోన్ (1) క్రీజ్‌లో ఉన్నారు. 43/4 వద్ద రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన సౌతాఫ్రికా మరో 95 పరుగులు మాత్రమే జోడించి మిగతా 6 వికెట్లు కోల్పోయింది. బెడింగ్హమ్ 45, బవుమా 36 పరుగులు చేసి సౌతాఫ్రికాను మూడంకెల స్కోర్ దాటించారు. వీరు కాక సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో వెర్రిన్ (13), రికెల్టన్ (16) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. మార్క్రమ్ (0), ముల్దర్ (6), స్టబ్స్ (2),జన్సెన్ (0), మహారాజ్ (7), రబాడ (1) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు.కమిన్స్ 6 వికెట్లతో చెలరేగిపోయి ప్రొటీస్ పతనాన్ని శాశించాడు. సౌతాఫ్రికాను స్వల్ప స్కోర్‌కు కట్టడి చేయడంలో స్టార్క్ (2/41), హాజిల్‌వుడ్ (1/27) కూడా తలో చేయి వేశారు. 74 పరుగుల ఆధిక్యంతో సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా కూడా సఫారీ బౌలర్ల ధాటికి వణికింది. ఆ జట్టును అలెక్స్ క్యారీ (43) అదుకున్నాడు. స్టార్క్ ఆసీస్‌ను 300 పరుగుల టార్గెట్ దిశగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. ఆసీస్ ఇన్నింగ్స్‌లో క్యారీ, స్టార్క్ కాకుండా లబూషేన్ (22), స్టీవ్ స్మిత్ (13) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఉస్మాన్ ఖ్వాజా 6, గ్రీన్ 0, హెడ్ 9, వెబ్‌స్టర్ 9, కమిన్స్ 6 పరుగులకు ఔటయ్యారు. సఫారీ బౌలర్లలో రబాడ, ఎంగిడి తలో 3 వికెట్లు పడగొట్టి ఆసీస్‌కు చుక్కలు చూపించారు. జన్సెన్, ముల్దర్ తలో వికెట్ తీశారు.అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. రబాడ (5/51), జన్సెన్ (3/49), కేశవ్ మహారాజ్ (1/19), మార్క్రమ్ (1/5) ధాటికి తొలి ఇన్నింగ్స్‌లో 212 పరుగులకే ఆలౌటైంది. స్టీవ్ స్మిత్ (66), బ్యూ వెబ్‌స్టర్ (72) అర్ద సెంచరీలతో ఆదుకోవడంతో ఆసీస్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది.మిగతా ఆసీస్ బ్యాటర్లలో అలెక్స్ క్యారీ (23), లబూషేన్ (17), ట్రవిస్ హెడ్ (11) రెండంకెల స్కోర్లు చేయగా.. గ్రీన్ (4), కమిన్స్ (1), స్టార్క్ (1) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. ఉస్మాన్ ఖ్వాజా, నాథన్ లియోన్ డకౌట్లయ్యారు.కమిన్స్ ట్రిపుల్ సెంచరీతొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు తీసి సౌతాఫ్రికాను కోలుకోలేని దెబ్బ కొట్టిన ఆసీస్ సారధి కమిన్స్.. ఈ ప్రదర్శన అనంతరం పలు రికార్డులు సాధించాడు. ఈ ప్రదర్శనతో కమిన్స్ టెస్ట్‌ల్లో 300 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఈ మైలురాయిని తాకిని 40వ బౌలర్‌గా.. ఎనిమిదో ఆసీస్ బౌలర్‌గా.. ఓవరాల్‌గా 30వ పేసర్‌గా.. ఆరో ఆసీస్ పేసర్‌గా పలు ఘనతలు సాధించాడు.ఈ ప్రదర్శనతో కమిన్స్ సాధించిన మరిన్ని రికార్డులు ఇవే..అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) టోర్నమెంట్ ఫైనల్లో ఐదు వికెట్లు తీసిన తొలి కెప్టెన్‌గా కమ్మిన్స్ వరల్డ్ రికార్డు సాధించాడు. ఇప్పటివరకు ఏ కెప్టెన్ కూడా ఈ ఫీట్ సాధించలేకపోయారు.ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-25 సైకిల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా కమ్మిన్స్ రికార్డులకెక్కాడు. ఈ డబ్ల్యూటీసీ సైకిల్లో కమ్మిన్స్ 78 వికెట్లు పడగొట్టాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా(77) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో బుమ్రాను కమ్మిన్స్ అధిగమించాడు.లార్డ్స్ మైదానంలో ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన కెప్టెన్‌గా కమ్మిన్స్ (28 పరుగులకు 6 వికెట్లు) నిలిచాడు. ఇప్పటివరకు ఈ రికార్డు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ బాబ్ విల్లీస్ పేరిట ఉండేది. 1982లో భారత్‌పై 101 పరుగులిచ్చి విల్లీస్ 6 వికెట్లు పడగొట్టాడు. తాజా ప్రదర్శతో విల్లీస్ ఆల్‌టైమ్ రికార్డును కమ్మిన్స్ బ్రేక్ చేశాడు. -
చరిత్ర సృష్టించిన ప్యాట్ కమ్మిన్స్.. తొలి కెప్టెన్‌గా వరల్డ్ రికార్డు
లార్డ్స్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ ఆసాధరణ ప్రదర్శన కనబరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో కమ్మిన్స్ తన అద్బుత బౌలింగ్‌తో ప్రోటీస్ జట్టు పతనాన్ని శాసించాడు. కేవలం 28 పరుగులు మాత్రమే ఇచ్చి మొత్తం ఆరు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అతడి బౌలింగ్ దాటికి సౌతాఫ్రికా తమ మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం 138 పరుగులకే కుప్పకూలింది. ఇక ఈ మ్యాచ్‌లో నిప్పులు చెరిగిన కమ్మిన్స్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.కమ్మిన్స్ సాధించిన రికార్డులు ఇవే..👉అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) టోర్నమెంట్ ఫైనల్లో ఐదు వికెట్లు తీసిన తొలి కెప్టెన్‌గా కమ్మిన్స్ వరల్డ్ రికార్డు సాధించాడు. ఇప్పటివరకు ఏ కెప్టెన్ కూడా ఈ ఫీట్ సాధించలేకపోయారు.👉ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-25 సైకిల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా కమ్మిన్స్ రికార్డులకెక్కాడు. ఈ డబ్ల్యూటీసీ సైకిల్లో కమ్మిన్స్ 78 వికెట్లు పడగొట్టాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా(77) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో బుమ్రాను కమ్మిన్స్ అధిగమించాడు.2023-25 ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు:78* - పాట్ కమ్మిన్స్ (ఆస్ట్రేలియా)77 - జస్ప్రీత్ బుమ్రా (భారత్)74 - మిచెల్ స్టార్క్ (ఆస్ట్రేలియా)66 - నాథన్ లియాన్ (ఆస్ట్రేలియా)63 - రవిచంద్రన్ అశ్విన్ (భారత్)👉లార్డ్స్ మైదానంలో ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన కెప్టెన్‌గా కమ్మిన్స్ (28 పరుగులకు 6 వికెట్లు) నిలిచాడు. ఇప్పటివరకు ఈ రికార్డు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ బాబ్ విల్లీస్ పేరిట ఉండేది. 1982లో భారత్‌పై 101 పరుగులిచ్చి విల్లీస్ 6 వికెట్లు పడగొట్టాడు. తాజా ప్రదర్శతో విల్లీస్ ఆల్‌టైమ్ రికార్డును కమ్మిన్స్ బ్రేక్ చేశాడు.లార్డ్స్‌లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన కెప్టెన్లు1. పాట్ కమిన్స్ - 2025లో దక్షిణాఫ్రికాపై 28 పరుగులిచ్చి 6 వికెట్లు2. బాబ్ విల్లీస్ - 1982లో భారత్‌పై 101 పరుగులిచ్చి 6 వికెట్లు3. డేనియల్ వెట్టోరి - 2008లో పరుగులిచ్చి 5 వికెట్లు👉ఈ మ్యాచ్‌లో కమ్మిన్స్ 300 టెస్టు వికెట్ల మైలు రాయిని అందుకున్నాడు. -
WTC Final 2025: నిప్పులు చెరుగుతున్న ప్రోటీస్ పేసర్లు.. కష్టాల్లో ఆసీస్
218 పరుగుల ఆధిక్యంలో ఆసీస్రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా రెండో రోజు ఆట ముగిసే సమయానికి 218 పరుగుల ఆధిక్యంలో ఉంది. మొత్తంగా రెండో ఇన్నింగ్స్‌లో 8 వికెట్లు కోల్పోయి 144 పరుగులు సాధించారు. కగిసో రబాడ, ఎంగిడీ చెరో 3 వికెట్లు పడగొట్టగా మార్కో జాన్సెన్, ముల్డర్ చెరో వికెట్ తీశారు. ఇక ఈ ఇన్నింగ్స్‌కు ఆసీస్ బ్యాటర్లలో అలెక్స్ క్యారీ 43(50) పరుగులతో టాప్ స్కోరర్‌గా ఉన్నాడు.164 పరుగుల ఆధిక్యంలో ఆసీస్32 ఓవర్లకు ఆసీస్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు కోల్పోయి 91 పరుగులు చేసింది. ఆసీస్ ప్రస్తుతం 164 పరుగుల ఆధిక్యంలో కొసాగుతోంది. క్రీజులో క్యారీ(14), మిచెల్ స్టార్క్(5) ఉన్నారు.ఆలౌట్ దిశగా ఆస్ట్రేలియా.. ప్యాట్ కమ్మిన్స్ రూపంలో ఆసీస్ ఏడో వికెట్ కోల్పోయింది. 6 పరుగులు చేసిన కమ్మిన్స్.. ఎంగిడీ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. 27 ఓవర్లకు ఆసీస్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు కోల్పోయి 78 పరుగులు చేసింది. ఆసీస్ ప్రస్తుతం 152 పరుగుల ఆధిక్యంలో కొసాగుతోంది. ఆసీస్ ఆరో వికెట్ డౌన్..ట్రావిస్ హెడ్ రూపంలో ఆస్ట్రేలియా ఆరో వికెట్ కోల్పోయింది. 9 పరుగులు చేసిన హెడ్.. ముల్డర్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు.నిప్పులు చెరుగుతున్న ప్రోటీస్ పేసర్లు.. కష్టాల్లో ఆసీస్రెండో ఇన్నింగ్స్‌లో సైతం సౌతాఫ్రికా పేసర్లు నిప్పులు చెరుగుతున్నారు. ప్రోటీస్ బౌలర్ల దాటికి ఆసీస్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కడుతున్నారు. వెబ్‌స్టెర్ రూపంలో ఆస్ట్రేలియా ఐదో వికెట్ కోల్పోయింది. 9 పరుగులు చేసిన వెబ్‌స్టెర్ ఎంగిడీ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 23 ఓవర్లకు ఆస్ట్రేలియా 5 వికెట్లు కోల్పోయి 64 పరుగులు చేసింది.ఆసీస్ నాలుగో వికెట్ డౌన్..స్టీవ్ స్మిత్ రూపంలో ఆస్ట్రేలియా నాలుగో వికెట్ కోల్పోయింది. 13 పరుగులు చేసిన స్మిత్.. లుంగీ ఎంగిడీ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు.ఆసీస్ మూడో వికెట్ డౌన్మార్నస్ లబుషేన్ రూపంలో ఆసీస్ మూడో వికెట్ కోల్పోయింది. 22 పరుగులు చేసిన లబుషేన్.. జానెసన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 18. 4 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 48/3ఆసీస్ రెండో వికెట్ డౌన్కామెరూన్ గ్రీన్(0) రూపంలో ఆస్ట్రేలియా రెండో వికెట్ కోల్పోయింది. రబాడ బౌలింగ్‌లో గ్రీన్ స్లిప్‌లో క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 12 ఓవర్లకు ఆసీస్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 32 పరుగులు చేసింది. క్రీజులో స్మిత్(4), లబుషేన్(16) ఉన్నారు.ఆసీస్ తొలి వికెట్ డౌన్ఉస్మాన్ ఖవాజా రూపంలో ఆస్ట్రేలియా తొలి వికెట్ కోల్పోయింది. 6 పరుగులు చేసిన ఖవాజా.. రబాడ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి గ్రీన్ వచ్చాడు.నిలకడగా ఆడుతున్న ఆసీస్ ఓపెనర్లు..ఆస్ట్రేలియా తమ సెకెండ్ ఇన్నింగ్స్‌లో నిలకడగా ఆడుతోంది. 9 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్ వికెట్ నష్టపోకుండా 24 పరుగులు చేసింది. క్రీజులో మార్నస్ లబుషేన్(15), ఖవాజా(4) ఉన్నారు. ఆసీస్ ప్రస్తుతం 98 పరుగుల ఆధిక్యం కొనసాగుతోంది.138 పరుగులకే సౌతాఫ్రికా ఆలౌట్లార్డ్స్ వేదికగా జరుగుతున్న వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో దక్షిణాఫ్రికా బ్యాటర్లు సైతం చేతులేత్తేశారు. ఆసీస్ బౌలర్ల దాటికి సౌతాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్‌లో 138 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ 6 వికెట్లు పడగొట్టి ప్రోటీస్ పతానాన్ని శాసించాడు. అతడితో పాటు స్టార్క్ రెండు వికెట్లు, హాజిల్‌వుడ్ వికెట్ సాధించారు. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో బెడింగ్హామ్(45) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.కమ్మిన్స్ ఆన్ ఫైర్.. సౌతాఫ్రికా ఏడో వికెట్ డౌన్లంచ్ బ్రేక్ అనంతరం ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ నిప్పులు చేరుగుతున్నాడు. 52వ ఓవర్ వేసిన కమ్మిన్స్.. మూడో బంతికి వెర్రియిన్ను పెవిలియన్‌కు పంపగా.. ఆఖరి బంతికి జానెసన్ను ఔట్ చేశాడు. 52 ఓవర్లకు సౌతాఫ్రికా 7 వికెట్లు కోల్పోయి 126 పరుగులు చేసింది.లంచ్ బ్రేక్‌కు దక్షిణాఫ్రికా స్కోరంతంటే?ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ ఆసక్తికరంగా సాగుతోంది. రెండో రోజు లంచ్ బ్రేక్ సమయానికి సౌతాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా ఇంకా 91 పరుగుల వెనకంజలో ఉంది. ప్రస్తుతం క్రీజులో బెడింగ్హామ్(39),వీర్రెయిన్(9) ఉన్నారు.సౌతాఫ్రికా ఐదో వికెట్ డౌన్.. కెప్టెన్ బావుమా ఔట్టెంబా బావుమా రూపంలో సౌతాఫ్రికా ఐదో వికెట్ కోల్పోయింది. 36 పరుగులు చేసిన బావుమా.. కమ్మిన్స్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.నిలకడగా ఆడుతున్న బావుమా, బెడింగ్హామ్35 ఓవర్లకు సౌతాఫ్రికా 4 వికెట్ల నష్టానికి 87 పరుగులు చేసింది. బెడింగ్హామ్(17 బ్యాటింగ్), బావుమా(36 బ్యాటింగ్) నిలకడగా ఆడుతున్నారు.27 ఓవర్లకు దక్షిణాఫ్రికా స్కోర్: 66/427 ఓవర్లు ముగిసే సరికి దక్షిణాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 66 పరుగులు చేసింది. క్రీజులో బావుమా(17), బెడింగ్హమ్(17) ఉన్నారు.లార్డ్స్ వేదికగా దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా మధ్య వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ రెండో రోజు ఆట ప్రారంభమైంది. ఆసీస్ బౌలింగ్ ఎటాక్‌ను మిచెల్ స్టార్క్ ప్రారంభించాడు. క్రీజులో ప్రస్తుతం ప్రోటీస్ కెప్టెన్ టెంబా బావుమా(3), బెడింగ్హామ్(8) ఉన్నారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 22 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 43 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. అంతకుముందు బ్యాటింగ్‌కు చేసిన ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 56.4 ఓవర్లలో 212 పరుగులకు ఆలౌటైంది. బ్యూ వెబ్‌స్టర్ (92 బంతుల్లో 72; 11 ఫోర్లు), స్టీవ్ స్మిత్ (112 బంతుల్లో 66; 10 ఫోర్లు) అర్ధ శతకాలు సాధించారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో కగిసో రబాడ 5 వికెట్లు పడగొట్టగా... మార్కో యాన్సెన్ 3 వికెట్లు తీశాడు. -
WTC Final 2025: చరిత్ర సృష్టించిన స్టార్క్.. షమీ రికార్డును చెరిపేశాడు
ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ టీమిండియా స్టార్ పేసర్ మొహమ్మద్ షమీ పేరిట ఉన్న ఓ ఆల్‌టైమ్ రికార్డును చెరిపేశాడు. సౌతాఫ్రికాతో జరుగుతున్న 2023-2025 డబ్ల్యూటీసీ ఫైనల్లో 2 వికెట్లు తీయడంతో ఐసీసీ ఫైనల్స్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అవతరించాడు. స్టార్క్ ఇప్పటివరకు 5 ఐసీసీ ఫైనల్స్ ఇన్నింగ్స్‌ల్లో 11 వికెట్లు తీశాడు. 2015 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్లో రెండు వికెట్లు తీసిన స్టార్క్.. 2021-23 డబ్ల్యూటీసీ ఫైనల్లో నాలుగు, 2023 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్లో మూడు, ప్రస్తుతం జరుగుతున్న 2023-25 డబ్ల్యూటీసీ ఫైనల్లో రెండు వికెట్లు తీశాడు.గతంలో ఈ రికార్డు షమీ పేరిట ఉండేది. షమీ ఐసీసీ ఫైనల్స్‌లో 6 ఇన్నింగ్స్‌ల్లో 10 వికెట్లు తీశాడు. ఐసీసీ ఫైనల్స్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో స్టార్క్, షమీ తర్వాతి స్థానాల్లో ట్రెంట్ బౌల్ట్ (5 ఇన్నింగ్స్‌ల్లో 8 వికెట్లు), రవీంద్ర జడేజా (10 ఇన్నింగ్స్‌ల్లో 8), కైల్ జేమీసన్ (3 ఇన్నింగ్స్‌ల్లో 8) ఉన్నారు.మ్యాచ్ విషయానికొస్తే.. ఇంగ్లండ్‌లోని లార్డ్స్ మైదానం వేదికగా ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా మధ్య వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-25 ఫైనల్ జరుగుతుంది. నిన్న (జూన్ 11) మొదలైన ఈ టైటిల్ పోరులో సౌతాఫ్రికా టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. రబాడ (5/51), జన్సెన్ (3/49), కేశవ్ మహారాజ్ (1/19), మార్క్రమ్ (1/5) చెలరేగడంతో ఆసీస్ రెండు సెషన్లలోపే 212 పరుగులకు ఆలౌటైంది. స్టీవ్ స్మిత్ (66), బ్యూ వెబ్‌స్టర్ (72) అర్ద సెంచరీలతో ఆదుకోవడంతో ఆసీస్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. మిగతా ఆసీస్ బ్యాటర్లలో అలెక్స్ క్యారీ (23), లబూషేన్ (17), ట్రవిస్ హెడ్ (11) రెండంకెల స్కోర్లు చేయగా.. గ్రీన్ (4), కమిన్స్ (1), స్టార్క్ (1) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. ఉస్మాన్ ఖ్వాజా, నాథన్ లియోన్ డకౌట్లయ్యారు.ఆసీస్‌ను తక్కువ స్కోర్‌కే పరిమితం చేసిన ఆనందం సౌతాఫ్రికాకు ఎంతో సేపు నిలబడలేదు. తొలి ఓవర్‌నే వికెట్ (మార్క్రమ్) కోల్పోయిన ఆ జట్టు మరో 20 ఓవర్ల వ్యవధిలో కేవలం 30 పరుగులు మాత్రమే చేసి మొత్తం నాలుగు వికెట్లు చేజార్చుకుంది. స్టార్క్ (2/10), హాజిల్‌వుడ్ (1/10), కమిన్స్ (1/14) నిప్పులు చెరిగే బంతులతో సౌతాఫ్రికా బ్యాటర్లకు చుక్కలు చూపించారు. ఒక్కో పరుగు చేసేందుకు సౌతాఫ్రికా బ్యాటర్లు నానా ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం క్రీజ్‌లో ఉన్న బవుమా అయితే ఖాతా తెరిచేందుకు ఏకంగా 31 బంతులు తీసుకున్నాడు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో మార్క్రమ్ డకౌట్ కాగా.. రికెల్టన్ 16, ముల్దర్ 6, స్టబ్స్ 2 పరుగులకు ఔటయ్యారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా స్కోర్ 43/4గా ఉంది. బవుమాతో (3) పాటు బెడింగ్హమ్ (8) క్రీజ్‌లో ఉన్నాడు. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు సౌతాఫ్రికా ఇంకా 169 పరుగులు వెనుకపడి ఉంది. -
WTC Final 2025: 145 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారి..!
ఇంగ్లండ్‌లోని లార్డ్స్ మైదానం వేదికగా ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-2025 ఫైనల్ ఓ అరుదైన ఘటనకు వేదికైంది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఇరు జట్ల నంబర్ వన్ ఆటగాళ్లు (ఓపెనర్లు) డకౌటయ్యారు. తొలుత ఆసీస్ ఆటగాడు ఉస్మాన్ ఖ్వాజా 20 బంతులు ఆడి రబాడ బౌలింగ్‌లో డకౌట్ కాగా.. ఆతర్వాత సౌతాఫ్రికా ప్లేయర్ ఎయిడెన్ మార్క్రమ్ 6 బంతులు ఆడి ఖాతా తెరవకుండా స్టార్క్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 145 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇంగ్లండ్ గడ్డపై ఇలా ఇరు జట్ల నంబర్ వన్ ఆటగాళ్లు టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్ కావడం ఇదే మొదటిసారి. ఈ మ్యాచ్‌తో కలుపుకొని ఇంగ్లండ్‌లో ఇప్పటివరకు 561 టెస్ట్ మ్యాచ్‌లు జరగగా.. ఇలాంటి ఘటన ఈ మ్యాచ్‌కు ముందు వరకు ఒక్కసారి కూడా జరగలేదు. 1880లో తొట్ట తొలి అధికారిక టెస్ట్ మ్యాచ్ ఇంగ్లండ్‌లోనే జరిగిన విషయం తెలిసిందే.ఓవరాల్‌గా (ప్రపంచంలో ఎక్కడైనా) చూసినా ఓ టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఇరు జట్ల నంబర్ వన్ ఆటగాళ్లు డకౌట్లు కావడం ఇది 10వ సారి మాత్రమే. ఈ తరహా తొలి ఘటన 1977లో ఆస్ట్రేలియా, ఇండియా మధ్య మెల్బోర్న్లో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో జరిగింది. ఆ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఇరు జట్లు నంబర్ వన్ ఆటగాళ్లు సునీల్ గవాస్కర్, జాన్ డైసన్ డకౌట్లయ్యారు. ఆతర్వాత తాజా ఘటనతో కలుపుకొని ఇలాంటివి తొమ్మిది సార్లు జరిగాయి. ఇందులో చివరి నాలుగు సందర్భాలు కలుపుకొని ఆస్ట్రేలియా మొత్తంగా ఆరు సార్లు భాగమైంది. ఆసీస్ భాగమైన చివరి నాలుగు సందర్భాల్లో స్టార్క్ మూడింట భాగం కావడం (ప్రత్యర్ది వికెట్లు తీయడం) మరో విశేషం.డబ్ల్యూటీసీ ఫైనల్ 2025 విషయానికొస్తే.. ఈ మ్యాచ్ తొలి రోజే 14 వికెట్లు పడ్డాయి. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 212 పరుగులకు ఆలౌట్ కాగా.. సౌతాఫ్రికా తొలి రోజు ఆట ముగిసే సమయానికి 43 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది.ఆసీస్ ఇన్నింగ్స్‌ను రబాడ (5/51), జన్సెన్ (3/49), కేశవ్ మహారాజ్ (1/19), మార్క్రమ్ (1/5) దెబ్బకొట్టగా.. సౌతాఫ్రికాను స్టార్క్ (2/10), హాజిల్‌వుడ్ (1/10), కమిన్స్ (1/14) ఇబ్బందుల్లోకి నెట్టారు.ఆసీస్ ఇన్నింగ్స్‌లో స్టీవ్ స్మిత్ (66), బ్యూ వెబ్‌స్టర్ (72) టాప్ స్కోరర్లు కాగా.. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌ను నిలబెట్టే బాధ్యత బవుమా (3 నాటౌట్), బెడింగ్హమ్ (8 నాటౌట్) భుజస్కందాలపై ఉంది. -
WTC Final 2025: రోహిత్ శర్మ రికార్డు బద్దలు కొట్టిన ట్రివిస్ హెడ్
లార్డ్స్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్ 2025లో ఆసీస్ ఆటగాడు ట్రవిస్ హెడ్ ఓ మైలురాయిని దాటాడు. ఈ మ్యాచ్‌లో విఫలమైనా హెడ్ (13 బంతుల్లో 11) ఓ ఘనత సాధించాడు. ఐసీసీ ఫైనల్స్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో ఉన్న రోహిత్ శర్మను అధిగమించి, ఆ స్థానానికి చేరాడు.ఐసీసీ ఫైనల్స్‌లో రోహిత్ 11 ఇన్నింగ్స్‌ల్లో 322 పరుగులు చేయగా.. ఈ మ్యాచ్‌లో పరుగులతో కలుపుకొని హెడ్ 4 ఇన్నింగ్స్‌ల్లోనే 329 పరుగులు చేశాడు. ఐసీసీ ఫైనల్స్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు రికార్డుల రిరాజు విరాట్ కోహ్లి పేరిట ఉంది. విరాట్ 11 ఇన్నింగ్స్‌ల్లో 411 పరుగులు చేశాడు.వాస్తవానికి ఈ మ్యాచ్‌కు ముందు హెడ్ విరాట్ రికార్డుపైనే కన్నేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైన రెండో ఇన్నింగ్స్‌లో అయినా హెడ్‌కు విరాట్ రికార్డు బద్దలు కొట్టే అవకాశం ఉంది. రెండో ఇన్నింగ్స్‌లో హెడ్ 83 పరుగులు చేస్తే విరాట్ పేరిట ఉన్న ఈ అల్‌టైమ్ రికార్డు బద్దలవుతుంది.ఘనమైన రికార్డుట్రవిస్ హెడ్‌కు ఐసీసీ ఫైనల్స్‌లో ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. 2021-23 డబ్ల్యూటీసీ ఫైనల్లో తొలి ఇన్నింగ్స్‌లో 163, రెండో ఇన్నింగ్స్‌లో 18 పరుగులు చేశారు. 2023 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్లో 137 పరుగులు చేశాడు. తాజాగా జరుగుతున్న 2023-25 డబ్ల్యూటీసీ ఫైనల్లో 11 పరుగులు చేశాడు. హెడ్ ఐసీసీ ఫైనల్స్‌లో చేసిన రెండు సెంచరీలు భారత్‌నే చేయడం విశేషం. ఈ సైకిల్ డబ్ల్యూటీసీలో భారత్ ఫైనల్స్‌కు చేరలేదు. మూడో స్థానంతో సరిపెట్టుకుంది.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. రబాడ (5/51), జన్సెన్ (3/49), కేశవ్ మహారాజ్ (1/19), మార్క్రమ్ (1/5) ధాటికి 56.4 ఓవర్లలో 212 పరుగులకే కుప్పకూలింది. 67 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన ఆసీస్‌ను స్టీవ్ స్మిత్ (66), బ్యూ వెబ్‌స్టర్ (72) అర్ద సెంచరీలతో ఆదుకున్నారు. వీరిద్దరు ఐదో వికెట్‌కు 79 పరుగులు జోడించి ఆసీస్ గౌరవప్రదమైన స్కోర్ సాధించేందుకు దోహదపడ్డారు. వీరిద్దరు ఔటయ్యాక ఆసీస్ ఇన్నింగ్స్ మరోసారి పేకమేడలా కూలింది. మధ్యలో అలెక్స్ క్యారీ (23) కాసేపు పోరాడాడు.ఆసీస్ ఇన్నింగ్స్‌లో స్మిత్, వెబ్‌స్టర్, క్యారీతో పాటు లబూషేన్ (17), ట్రవిస్ హెడ్ (11) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. ఓపెనర్ ఉస్మాన్ ఖ్వాజా 20 బంతుల డకౌట్ కావడంతో ఆసీస్ పతనం మొదలైంది. ఈ మ్యాచ్‌తో ఖ్వాజాకు జోడీగా లబూషేన్‌తో ఓపెనింగ్ ప్రయోగం చేసినప్పటికీ సత్ఫలితం రాలేదు.ఖ్వాజాను రబాడ, లబూషేన్‌ను జన్సెన్ ఔట్ చేశారు. గాయం నుంచి కోలుకొని చాలాకాలం తర్వాత తిరిగి వచ్చిన కెమరూన్ గ్రీన్ (4) దారుణంగా విఫలమయ్యాడు. ఇతని వికెట్ కూడా రబాడకే దక్కింది. స్టీవ్ స్మిత్‌ను మార్క్రమ్, క్యారీని కేశవ్ మహారాజ్.. హెడ్, లియోన్‌ను (0) జన్సెన్ ఔట్ చేశారు. వెబ్‌స్టర్, కమిన్స్ (1), స్టార్క్ (1) వికెట్లు రబాడ ఖాతాలోనే వెళ్లాయి.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌతాఫ్రికాకు కూడా ఆదిలోనే కష్టాలు మొదలయ్యాయి. తొలి ఓవర్లోనే మార్క్రమ్ను స్టార్క్ డకౌట్ చేశాడు. జట్టు స్కోర్ 19 పరుగుల వద్ద ఉండగా మరో ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ను (16) స్టార్కే పెవిలియన్‌కు పంపాడు. వన్‌డౌన్ బ్యాటర్‌గా ప్రమోషన్ పొందిన వియాన్ ముల్దర్ (6) దారుణంగా విఫలమయ్యాడు. అతని వికెట్ కమిన్స్‌కు దక్కింది. అనంతరం వచ్చిన ట్రిస్టన్ స్టబ్స్‌ను (2) హాజిల్‌వుడ్ ఔట్ చేశాడు. దీంతో 30 పరుగులకే సౌతాఫ్రికా 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. సౌతాఫ్రికాను గట్టెక్కించే బాధ్యత బవుమా (3), బెడింగ్హమ్ భుజస్కందాలపై ఉంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్ స్కోర్ 43/4గా ఉంది. ప్రస్తుతం ఆ జట్టు ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 169 పరుగులు వెనుకపడి ఉంది. -
WTC Final 2025: చరిత్ర సృష్టించిన రబాడ
లార్డ్స్ వేదికగా ఆస్ట్రేలియాతో నిన్న (జూన్ 11) మొదలైన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో సౌతాఫ్రికా స్టార్ పేసర్ కగిసో రబాడ చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీసిన అతను.. సౌతాఫ్రికా తరఫున టెస్ట్‌ల్లో అత్యధిక వికెట్లు తీసిన నాలుగో బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. రబాడ ఈ రికార్డు సాధించే క్రమంలో దిగ్గజ ఫాస్ట్ బౌలర్ అలెన్ డొనాల్డ్‌ను (72 టెస్ట్‌ల్లో 330 వికెట్లు) అధిగమించాడు. తాజా ప్రదర్శన అనంతరం రబాడ ఖాతాలో 332 వికెట్లు (70 టెస్ట్‌ల్లో) ఉన్నాయి.టెస్ట్‌ల్లో సౌతాఫ్రికా తరఫున అత్యధిక వికెట్లు తీసిన రికార్డు డేల్ స్టెయిన్ పేరిట ఉంది. స్టెయిన్ 93 టెస్ట్‌ల్లో 439 వికెట్లు తీశాడు. స్టెయిన్ తర్వాత షాన్ పొలాక్ (108 టెస్ట్‌ల్లో 421 వికెట్లు), మఖాయా ఎన్తిని (101 టెస్ట్‌ల్లో 390 వికెట్లు) రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. ఓవరాల్‌గా టెస్ట్‌ల్లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డు ముత్తయ్య మురళీథరన్ పేరిట ఉంది. మురళీ 133 టెస్ట్‌ల్లో 800 వికెట్లు తీశాడు. షేన్ వార్న్ (145 టెస్ట్‌ల్లో 708), జేమ్స్ ఆండర్సన్ (188 టెస్ట్‌ల్లో 704) రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు.కాగా, ఆసీస్‌తో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో రబాడ చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. రబాడ ఆసీస్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. ఉస్మాన్ ఖ్వాజా, గ్రీన్, వెబ్‌స్టర్, కమిన్స్, స్టార్క్ వికెట్లు తీసి ఆసీస్ పతనాన్ని శాశించాడు.రబాడకు (5/51) జన్సెన్ (3/49), కేశవ్ మహారాజ్ (1/19), మార్క్రమ్ (1/5) తోడవ్వడంతో ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 212 పరుగులకే కుప్పకూలింది (56.4 ఓవర్లలో). తొలి రోజు టీ విరామం కాగానే ఆసీస్ ఇన్నింగ్స్ ముగిసింది. 67 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన ఆసీస్‌ను స్టీవ్ స్మిత్ (66), బ్యూ వెబ్‌స్టర్ (72) అర్ద సెంచరీలతో ఆదుకున్నారు. వీరిద్దరు ఐదో వికెట్‌కు 79 పరుగులు జోడించి ఆసీస్ గౌరవప్రదమైన స్కోర్ సాధించేందుకు దోహదపడ్డారు. వీరిద్దరు ఔటయ్యాక ఆసీస్ ఇన్నింగ్స్ మరోసారి పేకమేడలా కూలింది. మధ్యలో అలెక్స్ క్యారీ (23) కాసేపు పోరాడాడు. ఆసీస్ ఇన్నింగ్స్‌లో స్మిత్, వెబ్‌స్టర్, క్యారీ కాక లబూషేన్ (17), ట్రవిస్ హెడ్ (11) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. ఓపెనర్ ఉస్మాన్ ఖ్వాజా 20 బంతుల డకౌట్ కావడంతో ఆసీస్ పతనం మొదలైంది.ఈ మ్యాచ్‌తో ఖ్వాజాకు జోడీగా లబూషేన్‌తో ఓపెనింగ్ ప్రయోగం చేసినప్పటికీ సత్ఫలితం రాలేదు. గాయం నుంచి కోలుకొని చాలాకాలం తర్వాత తిరిగి వచ్చిన కెమరూన్ గ్రీన్ (4) దారుణంగా విఫలమయ్యాడు. స్టీవ్ స్మిత్‌ను మార్క్రమ్, క్యారీని కేశవ్ మహారాజ్.. హెడ్, లియోన్‌ను (0) జన్సెన్ ఔట్ చేశారు.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌతాఫ్రికాకు కూడా ఆదిలోనే కష్టాలు మొదలయ్యాయి. తొలి ఓవర్లోనే మార్క్రమ్ను స్టార్క్ డకౌట్ చేశాడు. జట్టు స్కోర్ 19 పరుగుల వద్ద ఉండగా మరో ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ను (16) స్టార్కే పెవిలియన్‌కు పంపాడు. వన్‌డౌన్ బ్యాటర్‌గా ప్రమోషన్ పొందిన వియాన్ ముల్దర్ (6) దారుణంగా విఫలమయ్యాడు. అతని వికెట్ కమిన్స్‌కు దక్కింది. అనంతరం వచ్చిన ట్రిస్టన్ స్టబ్స్‌ను (2) హాజిల్‌వుడ్ ఔట్ చేశాడు. దీంతో 30 పరుగులకే సౌతాఫ్రికా 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. సౌతాఫ్రికాను గట్టెక్కించే బాధ్యత బవుమా (3), బెడింగ్హమ్ భుజస్కందాలపై ఉంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్ స్కోర్ 43/4గా ఉంది. ప్రస్తుతం ఆ జట్టు ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 169 పరుగులు వెనుకపడి ఉంది. -
WTC Final 2025: చెత్త రికార్డు మూటగట్టుకున్న ఆస్ట్రేలియా
2023-2025 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్ లార్డ్స్ వేదికగా నిన్న (జూన్ 11) ప్రారంభమైంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా, తొలిసారి ఫైనల్‌కు చేరిన సౌతాఫ్రికా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ కోసం పోరాడుతున్నాయి. భారతకాలమానం ప్రకారం ఈ మ్యాచ్ నిన్న మధ్యాహ్నం 3 గంటలకు మొదలైంది. సౌతాఫ్రికా టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ప్రొటీస్ ఫాస్ట్ బౌలర్లు చెలరేగడంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో ఘోరంగా పతనమైంది. రబాడ (5/51), జన్సెన్ (3/49), కేశవ్ మహారాజ్ (1/19), మార్క్రమ్ (1/5) ధాటికి 56.4 ఓవర్లలో 212 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ ఇన్నింగ్స్ తొలి రోజు విరామం కాగానే ముగిసింది. 67 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన ఆసీస్‌ను స్టీవ్ స్మిత్ (66), బ్యూ వెబ్‌స్టర్ (72) అర్ద సెంచరీలతో ఆదుకున్నారు. వీరిద్దరు ఐదో వికెట్‌కు 79 పరుగులు జోడించి ఆసీస్ గౌరవప్రదమైన స్కోర్ సాధించేందుకు దోహదపడ్డారు. వీరిద్దరు ఔటయ్యాక ఆసీస్ ఇన్నింగ్స్ మరోసారి పేకమేడలా కూలింది. మధ్యలో అలెక్స్ క్యారీ (23) కాసేపు పోరాడాడు. ఆసీస్ ఇన్నింగ్స్‌లో స్మిత్, వెబ్‌స్టర్, క్యారీ కాక లబూషేన్ (17), ట్రవిస్ హెడ్ (11) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. ఓపెనర్ ఉస్మాన్ ఖ్వాజా 20 బంతుల డకౌట్‌తో ఆసీస్ పతనాన్ని మొదలుపెట్టాడు. ఈ మ్యాచ్‌తో ఖ్వాజాకు జోడీగా లబూషేన్‌తో ఓపెనింగ్ ప్రయోగం చేసినప్పటికీ సత్ఫలితం రాలేదు. ఖ్వాజాను రబాడ, లబూషేన్‌ను జన్సెన్ ఔట్ చేశారు. గాయం నుంచి కోలుకొని చాలాకాలం తర్వాత తిరిగి వచ్చిన కెమరూన్ గ్రీన్ (4) దారుణంగా విఫలమయ్యాడు. ఇతని వికెట్ కూడా రబాడకే దక్కింది. స్టీవ్ స్మిత్‌ను మార్క్రమ్, క్యారీని కేశవ్ మహారాజ్.. హెడ్, లియోన్‌ను (0) జన్సెన్ ఔట్ చేశారు. వెబ్‌స్టర్, కమిన్స్ (1), స్టార్క్ (1) వికెట్లు రబాడ ఖాతాలోనే వెళ్లాయి.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌతాఫ్రికాకు కూడా ఆదిలోనే కష్టాలు మొదలయ్యాయి. తొలి ఓవర్లోనే మార్క్రమ్ను స్టార్క్ డకౌట్ చేశాడు. జట్టు స్కోర్ 19 పరుగుల వద్ద ఉండగా మరో ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ను (16) స్టార్కే పెవిలియన్‌కు పంపాడు. వన్‌డౌన్ బ్యాటర్‌గా ప్రమోషన్ పొందిన వియాన్ ముల్దర్ (6) దారుణంగా విఫలమయ్యాడు. అతని వికెట్ కమిన్స్‌కు దక్కింది. అనంతరం వచ్చిన ట్రిస్టన్ స్టబ్స్‌ను (2) హాజిల్‌వుడ్ ఔట్ చేశాడు. దీంతో 30 పరుగులకే సౌతాఫ్రికా 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. సౌతాఫ్రికాను గట్టెక్కించే బాధ్యత బవుమా (3), బెడింగ్హమ్ (8) భుజస్కందాలపై ఉంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్ స్కోర్ 43/4గా ఉంది. ప్రస్తుతం ఆ జట్టు ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 169 పరుగులు వెనుకపడి ఉంది. చెత్త రికార్డుఇదిలా ఉంటే, తొలి ఇన్నింగ్స్‌లో 212 పరుగులకే ఆలౌటైన ఆస్ట్రేలియా ఓ చెత్త రికార్డును మూటగట్టుకుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్ చరిత్రలో అత్యల్ప తొలి ఇన్నింగ్స్ స్కోర్ నమోదు చేసిన జట్టుగా అపఖ్యాతిని మూటగట్టుకుంది. గతంలో ఈ రికార్డు టీమిండియా పేరిట ఉండేది. తొలి డబ్ల్యూటీసీ (2019-2021) ఫైనల్లో భారత్ న్యూజిలాండ్‌పై తొలి ఇన్నింగ్స్‌లో 217 పరుగులకు ఆలౌటైంది. ఇప్పటివరకు భారత్ పేరిట ఉండిన ఈ చెత్త రికార్డును ఆసీస్ తమ ఖాతాలోకి వేసుకుంది. -
చరిత్ర సృష్టించిన స్మిత్.. 99 ఏళ్ల రికార్డు బద్దలు
లార్డ్స్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) ఫైనల్లో ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 67 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఆసీస్‌ను వెబ్‌స్టెర్‌తో కలిసి స్మిత్ ఆదుకున్నాడు. ఆచితూచి ఆడుతూ స్కోర్ బోర్డును ముందుకు నడిపించాడు. 112 బంతుల్లో 10 ఫోర్ల సాయంతో 66 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ క్రమంలో స్మిత్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.చరిత్ర సృష్టించిన స్మిత్..ఇంగ్లండ్ గడ్డపై టెస్టుల్లో అత్యధిక ఫిప్టీ ప్లస్ స్కోర్లు సాధించిన విదేశీ బ్యాటర్‌గా స్మిత్ నిలిచాడు. ఇప్పటివరకు స్మిత్ ఇంగ్లండ్‌లో 18 సార్లు ఏభైకి పైగా పరుగులు చేశాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా దిగ్గజం అలన్ బోర్డర్ (17) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో బోర్డర్ ఆల్‌టైమ్ రికార్డును స్మిత్ బ్రేక్ చేశాడు.ఇంగ్లండ్‌లో టెస్టుల్లో అత్యధిక సార్లు ఫిప్టీ ప్లస్ స్కోర్లు చేసిన విదేశీ బ్యాటర్లు వీరే..స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా)-18అల్లన్ బోర్డర్ (ఆస్ట్రేలియా)- 17వివ్ రిచర్డ్స్ (వెస్టిండీస్)- 17డాన్ బ్రాడ్‌మాన్ (ఆస్ట్రేలియా)- 14గ్యారీ సోబర్స్ (వెస్టిండీస్)- 14అదేవిధంగా ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన విదేశీ బ్యాటర్‌గా స్టీవ్ స్మిత్ చరిత్ర సృష్టించాడు. స్మిత్ ఇప్పటివరకు లార్డ్స్‌లో 591 పరుగులు చేశాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఆసీస్ లెజెండ్ వారెన్ బార్డ్స్లీ (575 పరుగులు) పేరిట ఉండేది. 1909-1926 కాలంలో బార్డ్స్లీ ఈ ఫీట్ సాధించాడు. తాజా ఇన్నింగ్స్‌తో 99 ఏళ్ల బార్డ్స్లీ రికార్డును స్మిత్ బద్దలు కొట్టాడు.లార్డ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన విదేశీ బ్యాటర్లు..స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా)- 591వారెన్ బార్డ్స్లీ (ఆస్ట్రేలియా) - 575గ్యారీఫీల్డ్ సోబర్స్ (వెస్టిండీస్) - 571డాన్ బ్రాడ్‌మన్ (ఆస్ట్రేలియా) - 551శివ్‌నారాయణ్ చందర్‌పాల్ (వెస్టిండీస్) - 512దిలీప్ వెంగ్‌సర్కార్ (భారత్) - 508అలెన్ బోర్డర్ (ఆస్ట్రేలియా) - 503చదవండి: WTC Final: ఐదేసిన రబాడ.. 212 పరుగులకు ఆసీస్ ఆలౌట్ -
ఐదేసిన రబాడ.. 212 పరుగులకు ఆసీస్ ఆలౌట్
లార్డ్స్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో సౌతాఫ్రికా బౌలర్లు చెలరేగారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా తమ మొదటి ఇన్నింగ్స్‌లో 212 పరుగులకే ఆలౌటైంది. సౌతాఫ్రికా స్పీడ్ స్టార్ కగిసో రబాడ ఐదు వికెట్లు పడగొట్టి కంగారుల పతనాన్ని శాసించాడు.అతడి పేస్ బౌలింగ్ దాటికి ఆసీస్ బ్యాటర్లు విల్లవిల్లాడారు. ఖవాజా, గ్రీన్, వెబ్‌స్టెర్, కమ్మిన్స్ వంటి కీలక వికెట్లను రబాడ తన ఖాతాలో వేసుకున్నాడు. అతడితో పాటు మార్కో జానెసన్ మూడు, మార్క్రమ్, మహారాజ్ తలా వికెట్ సాధించారు. ఆసీస్ ఇన్నింగ్స్‌లో వెబ్‌స్టెర్(72) టాప్ స్కోరర్‌గా నిలవగా.. స్టీవ్ స్మిత్(66) పరుగులతో రాణించాడు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు.తుది జట్లుఆస్ట్రేలియా: ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, కామెరూన్ గ్రీన్, స్టీవ్ స్మిత్, హెడ్, వెబ్‌స్టర్, అలెక్స్ కేరీ (వికెట్ కీపర్), పాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్, నాథన్ లియోన్.దక్షిణాఫ్రికా: ఐదెన్ మార్క్రమ్, ర్యాన్ రికిల్టన్, వియాన్ ముల్దర్, తెంబా బవుమా (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, బెడింగ్‌టన్, కైల్ వెరీన్ (వికెట్ కీపర్), మార్కో యాన్సెన్, కేశవ్ మహరాజ్, కగిసో రబాడ, లుంగి ఎంగిడి. -
సౌతాఫ్రికా వికెట్ కీపర్ సంచలన క్యాచ్.. తెల్లముఖం వేసిన హెడ్! వీడియో
లార్డ్స్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో సౌతాఫ్రికా వికెట్ కీపర్ కైల్ వెర్రీన్ అద్బుత క్యాచ్‌తో మెరిశాడు. ఆసీస్ డెంజరస్ బ్యాటర్ ట్రావిస్ హెడ్‌ను సంచలనాత్మక క్యాచ్‌తో వెర్రీన్ పెవిలియన్‌కు పంపాడు. లబుషేన్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన హెడ్ ఓ బౌండరీ బాది మంచి టచ్‌లో కన్పించాడు. మొదటి సెషన్ చివరి ఓవర్ వేసిన మార్కో జానెసన్ రెండో బంతిని హెడ్‌కు లెగ్ సైడ్ సంధించాడు. ఆబంతిని హెడ్ లైగ్ సైడ్ ఫ్లిక్ షాట్ ఆడాడు. ఈ క్రమంలో వికెట్ కీపర్ వెర్రీన్ తన కుడివైపనకు డైవ్ చేస్తూ ఒంటి చేత్తో స్టన్నింగ్ క్యాచ్‌ను అందుకున్నాడు. ఇది చూసిన హెడ్ బిత్తరపోయాడు.చేసేదేమిలేక నిరాశతో హెడ్(11) పెవిలియన్‌కు చేరాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇక ఈ తొలి రోజు ఆటలో ఆస్ట్రేలియా తడబడి నిలబడింది. మొదట 67 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఆసీస్‌ను స్మిత్(66), వెబ్‌స్టెర్(56 నాటౌట్) ఆదుకున్నారు. 52 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్ ఆరు వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. క్రీజులో కమ్మిన్స్, వెబ్‌స్టెర్ ఉన్నారు.#MarcoJansen dismisses TravisHead after a splendid catch by #KyleVerreynne behind the stumps! 🔥LIVE NOW 👉 https://t.co/9lZGHcdeVP #WTCFinal | #SAvAUS, Day 1, watch LIVE on Star Sports 1, Star Sports 1 Hindi & JioHotstar pic.twitter.com/i4HNMMtsrW— Star Sports (@StarSportsIndia) June 11, 2025 -
ఆసీస్ స్టార్ ఓపెనర్ అత్యంత చెత్త రికార్డు.. బుమ్రా సరసన
లార్డ్స్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా దారుణమైన ప్రదర్శన కనబరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఖాతా తెరవకుండానే ఖవాజా పెవిలియన్‌కు చేరాడు. మార్నస్ లబుషేన్‌తో కలిసి ఆసీస్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఖవాజా.. ప్రోటీస్ బౌలర్లను ఎదుర్కొనేందుకు తీవ్ర ఇబ్బంది పడ్డాడు.ఈ క్రమంలో సౌతాఫ్రికా స్పీడ్‌స్టార్ కగిసో రబాడ బౌలింగ్‌లో స్లిప్‌లో క్యాచ్ ఇచ్చి ఖవాజా ఔటయ్యాడు. ఇక ఈ మ్యాచ్‌లో డకౌటైన ఖవాజా ఓ చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఐసీసీ టోర్నీ ఫైనల్లో అత్యధిక డకౌటైన ఆటగాడిగా జస్ప్రీత్ బుమ్రా, తిలకరత్నే దిల్షాన్, మెకల్లమ్ సరసన నిలిచాడు.బుమ్రా, దిలాన్ష్, మెకల్లమ్ ఐసీసీ ఈవెంట్ల ఫైనల్లో రెండు సార్లు డకౌట్ కాగా.. ఖవాజా సైతం సరిగ్గా రెండు సార్లు ఎటువంటి పరుగులు చేయకుండా ఔటయ్యాడు. కాగా ఆసక్తికరంగా డబ్ల్యూటీసీ ఫైనల్ 2023లో కూడా ఖవాజా డకౌటయ్యాడు.ఐసీసీ టోర్నీ ఫైనల్లో అత్యధిక సార్లు డకౌటైన ఆటగాళ్లు వీరే..జస్ప్రీత్ బుమ్రా - 2తిలకరత్నే దిల్షాన్ - 2ఉస్మాన్ ఖవాజా - 2బ్రెండన్ మెకల్లమ్ - 2మొయిన్ అలీ - 1కష్టాల్లో ఆసీస్..కాగా ఫైనల్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ బ్యాటర్లకు సఫారీ పేసర్లు చుక్కలు చూపిస్తున్నారు. ప్రోటీస్ బౌలర్ల దాటికి కంగారులు కేవలం 67 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డారు. ఇప్పటివరకు రబాడ, జానెసన్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.చదవండి: IND vs ENG: టీమిండియాతో తొలి టెస్టు.. ఇంగ్లండ్ జట్టులోకి 19 ఏళ్ల యువ సంచలనంKagiso Rabada delivers big time for South Africa with two wickets in an over 🔥Catch the action live on our official broadcasters here ➡ https://t.co/oas2Rsdptj#Cricket #CricketReels #WTC25 pic.twitter.com/I9vOR8nCup— ICC (@ICC) June 11, 2025 -
India vs Aus 5th test: ఆస్ట్రేలియాతో డబ్ల్యూటీసీ ఫైనల్.. తడబడుతున్న సౌతాఫ్రికా
ఆస్ట్రేలియాతో డబ్ల్యూటీసీ ఫైనల్.. తడబడుతున్న సౌతాఫ్రికాసౌతాఫ్రికా బ్యాటర్లు సైతం తొలి ఇన్నింగ్స్‌లో తడబడుతున్నారు. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి సౌతాఫ్రికా 22 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 43 పరుగులు చేసింది. క్రీజులో బావుమా(3) , బెడింగ్‌టన్(8) ఉన్నారు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ రెండు వికెట్లు పడగొట్టగా జోష్ హేజిల్‌వుడ్, పాట్ కమిన్స్ చెరో వికెట్ సాధించారు. చెలరేగిన రబాడ.. 212 పరుగులకు ఆసీస్ ఆలౌట్డబ్ల్యూటీసీ ఫైనల్లో సౌతాఫ్రికా స్పీడ్‌స్టార్ కగిసో రబాడ 5 వికెట్లతో చెలరేగాడు. దీంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు ఆస్ట్రేలియా తమ మొదటి ఇన్నింగ్స్‌లో 212 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో వెబ్‌స్టెర్(72) టాప్ స్కోరర్‌గా నిలవగా.. స్టీవ్ స్మిత్(66) పరుగులతో రాణించాడు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ప్రోటీస్ బౌలర్లలో రబాడతో పాటు మార్కో జానెసన్ మూడు, మార్క్రమ్, మహారాజ్ తలా వికెట్ సాధించారు.ఆసీస్ ఎనిమిదో వికెట్ డౌన్ఆస్ట్రేలియా ఎనిమిదో వికెట్ కోల్పోయింది. 72 పరుగులు చేసిన వెబ్‌స్టెర్.. రబాడ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 55 ఓవర్లకు ఆసీస్ స్కోర్: 210/8ఆసీస్ ఏడో వికెట్ డౌన్199 పరుగుల వద్ద ఆసీస్ ఏడో వికెట్ కోల్పోయింది. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసిన కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్.. రబాడ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. అంతకుముందు అలెక్స్ క్యారీ(23).. కేశవ్ మహారాజ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు.ఆసీస్ ఐదో వికెట్ డౌన్.. స్మిత్ ఔట్స్టీవ్ స్మిత్ రూపంలో ఆసీస్ ఐదో వికెట్ కోల్పోయింది. 66 పరుగులు చేసిన స్మిత్.. మార్క్రమ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 44 ఓవర్లకు ఆస్ట్రేలియా 5 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది. క్రీజులో వెబ్‌స్టెర్(48), అలెక్స్ క్యారీ(1) ఉన్నారు.ఆచితూచి ఆడుతున్న స్మిత్, వెబ్‌స్టెర్31 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 94 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్(45), వెబ్‌స్టెర్(8) ఆచితూచి ఆడుతున్నారు.పంజా విసురుతున్న ప్రోటీస్ పేసర్లు..ట్రావిస్ హెడ్ రూపంలో ఆసీస్ నాలుగో వికెట్ కోల్పోయింది. 11 పరుగులు చేసిన హెడ్.. మార్కో జానెసన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. లంచ్ బ్రేక్ సమయానికి 23.2 ఓవర్లలో ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు కోల్పోయి 67 పరుగులు చేసింది. క్రీజులో స్మిత్(26) ఉన్నాడు. ప్రోటీస్ బౌలర్లలో రబాడ, జానెసన్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.ఆసీస్ మూడో వికెట్ డౌన్.. లబుషేన్ ఔట్మార్నస్ లబుషేన్ రూపంలో ఆస్ట్రేలియా మూడో వికెట్ కోల్పోయింది. 17 పరుగులు చేసిన లబుషేన్.. జానెసన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి ట్రావెస్ హెడ్ వచ్చాడు. 18 ఓవర్లకు ఆసీస్ స్కోర్ఆచితూచి ఆడుతున్న స్మిత్, లబుషేన్..ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయిన ఆసీస్ జట్టును సీనియర్ బ్యాటర్లు స్టీవ్ స్మిత్(17), లబుషేన్(17) ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. 17 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా రెండు వికెట్ల నష్టానికి 41 పరుగులు చేసింది.రబాడ ఆన్ ఫైర్.. ఒకే ఓవర్లో రెండు వికెట్లుటాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాను సౌతాఫ్రికా స్పీడ్‌స్టార్ కగిసో రబాడ బెంబెలెత్తిస్తున్నాడు. 7వ ఓవర్ వేసిన రబాడ బౌలింగ్‌లో ఉస్మాన్ ఖావాజా(0), గ్రీన్(4) వెంటవెంటనే పెవిలియన్‌కు చేరారు. 8 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్ రెండు వికెట్ల నష్టానికి 18 పరుగులు చేసింది. క్రీజులో లబుషేన్(10), స్మిత్(0) ఉన్నారు.వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్-2025 ఫైనల్ మ్యాచ్ ప్రారంభమైంది. ప్రతిష్టాత్మక లార్డ్స్ వేదికగా జరుగుతున్న తుది పోరులో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఆసీస్ జట్టులోకి కామెరూన్ గ్రీన్ తిరిగి రాగా.. సౌతాఫ్రికా టెస్టు టీమ్‌లోకి పేసర్ లుంగీ ఎంగిడీ పునరాగమనం చేశాడు.ప్రోటీస్ జట్టుకు ఇది తొలి డబ్ల్యూటీసీ ఫైనల్ కాగా.. ఆసీస్‌కు రెండో ఫైనల్. ఈ ఆఖరి పోరులో ఎలాగైనా గెలిచి తొలి ఐసీసీ ట్రోఫీని సొంతం చేసుకోవాలని సఫారీలు భావిస్తుంటే, కంగూరులు మాత్రం మరో ఐసీసీ టైటిల్‌ను తమ ఖాతాలో వేసుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. అయితే చోకర్స్‌గా పేరొందిన దక్షిణాఫ్రికా, పటిష్టమైన ఆసీస్‌ను ఓడించడం అంతసులువు కాదు.తుది జట్లుఆస్ట్రేలియా: ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, కామెరూన్ గ్రీన్, స్టీవ్ స్మిత్, హెడ్, వెబ్‌స్టర్, అలెక్స్ కేరీ (వికెట్ కీపర్), పాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్, నాథన్ లియోన్.దక్షిణాఫ్రికా: ఐదెన్ మార్క్రమ్, ర్యాన్ రికిల్టన్, వియాన్ ముల్దర్, తెంబా బవుమా (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, బెడింగ్‌టన్, కైల్ వెరీన్ (వికెట్ కీపర్), మార్కో యాన్సెన్, కేశవ్ మహరాజ్, కగిసో రబాడ, లుంగి ఎంగిడి.చదవండి: శ్రేయస్ అయ్యర్ కోసం భారత సెలెక్టర్లపై ధ్వజమెత్తిన గంగూలీ -
WTC Final: కోహ్లి ఆల్‌టైమ్ రికార్డుపై కన్నేసిన ట్రవిస్ హెడ్
ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా జట్ల మధ్య ప్రతిష్టాత్మకమైన లార్డ్స్ మైదానంలో ఇవాళ (జూన్ 11) మధ్యాహ్నం 3 గంటలకు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌కు ముందు ఇరు జట్లకు చెందిన ఆటగాళ్లను పలు రికార్డులు ఊరిస్తున్నాయి. ఆ రికార్డులు ఏంటో చూద్దాం.కోహ్లి ఆల్‌టైమ్ రికార్డుపై కన్నేసిన హెడ్ఈ మ్యాచ్‌లో (రెండు ఇన్నింగ్స్‌ల్లో) ఆసీస్ విధ్వంసకర ఆటగాడు ట్రవిస్ హెడ్ 94 పరుగులు చేస్తే ఐసీసీ టోర్నీల ఫైనల్స్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లి రికార్డును బద్దలు కొడతాడు. విరాట్ ఐసీసీ టోర్నీల ఫైనల్స్‌లో ఇప్పటివరకు 411 పరుగులు చేయగా.. ట్రవిస్ హెడ్ ఖాతాలో ప్రస్తుతం 318 పరుగులు (కేవలం 3 ఇన్నింగ్స్‌ల్లోనే) ఉన్నాయి.బుమ్రా రికార్డుకు ఎసరు పెట్టిన కమిన్స్, స్టార్క్నేటి నుంచి ప్రారంభం కాబోయే డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆసీస్ స్పీడ్స్టర్లు పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్ ఐదు, ఆరు వికెట్లు తీస్తే, ప్రస్తుత డబ్ల్యూటీసీ సైకిల్లో (2023-2025) అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లుగా అవతరిస్తారు. ప్రస్తుతం ఈ రికార్డు భారత పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా పేరిట ఉంది. బుమ్రా ఈ సైకిల్లో 77 వికెట్లు తీయగా.. కమిన్స్ 73, స్టార్క్ 72 వికెట్లు తీశారు.చరిత్ర సృష్టించనున్న బవుమాఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా మరో 46 పరుగులు చేస్తే (రెండు ఇన్నింగ్స్‌ల్లో) డబ్ల్యూటీసీ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన సౌతాఫ్రికా బ్యాటర్‌గా చరిత్ర సృష్టిస్తాడు. ప్రస్తుతం ఈ రికార్డు మాజీ కెప్టెన్ డీన్ ఎల్గర్ పేరిట ఉంది. ఎల్గర్ డబ్ల్యూటీసీలో 1935 పరుగులు చేయగా.. ప్రస్తుతం బవుమా ఖాతాలో 1890 పరుగులు ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా గెలిస్తే బవుమా మరో రికార్డు కూడా తన ఖాతాలో వేసుకుంటాడు. డబ్ల్యూటీసీలో అత్యధిక విజయాలు సాధించిన సౌతాఫ్రికా కెప్టెన్‌గా రికార్డు నెలకొల్పుతాడు. ప్రస్తుతం ఈ రికార్డు డీన్ ఎల్గర్, బవుమాల పేరిట సంయుక్తంగా ఉంది. ఇద్దరు తలో 8 విజయాలు సాధించారు.లియోన్ ఊరిస్తున్న అశ్విన్ రికార్డుఈ మ్యాచ్‌లో ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియోన్ ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేస్తే డబ్ల్యూటీసీ చరిత్రలో అత్యధిక ఐదు వికెట్ల ప్రదర్శనలు నమోదు చేసిన బౌలర్‌గా చరిత్ర సృష్టిస్తాడు. ప్రస్తుతం ఈ రికార్డును లియోన్ టీమిండియా స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్‌తో కలిసి షేర్ చేసుకుంటున్నాడు. ఇప్పటివరకు ఇద్దరు తలో 11 ఐదు వికెట్ల ప్రదర్శనలు నమోదు చేశారు.చరిత్ర సృష్టించేందుకు 2 వికెట్ల దూరంలో ఉన్న మహారాజ్ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహారాజ్ రెండు వికెట్లు తీస్తే.. సౌతాఫ్రికా టెస్ట్ క్రికెట్ చరిత్రలో 200 వికెట్లు తీసిన తొలి స్పిన్నర్‌గా చరిత్ర సృష్టిస్తాడు. ప్రస్తుతం మహారాజ్ ఖాతాలో 198 వికెట్లు ఉన్నాయి. -
డబ్ల్యూటీసీ ఫైనల్.. ఆస్ట్రేలియా జట్టులో అనూహ్య మార్పు
లార్డ్స్ వేదికగా జూన్ 11న ప్రారంభమయ్యే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-25 ఫైనల్ కోసం సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు తమ ప్లేయింగ్ ఎలెవెన్‌ను ప్రకటించాయి. ఇరు జట్లలో ఊహించిన ఆటగాళ్లే తుది జట్టులో చోటు దక్కించుకున్నారు. అయితే ఆస్ట్రేలియా మాత్రం తమ బ్యాటింగ్ ఆర్డర్లో ఓ అనూహ్య మార్పు చేసింది. మిడిలార్డర్లో కీలకమైన మార్నస్ లబూషేన్‌ను ఆసీస్ మేనేజ్మెంట్ ఓపెనర్‌గా ప్రమోట్ చేసింది. డేవిడ్ వార్నర్ రిటైరయ్యాక ఆసీస్ ఓపెనర్ సమస్యను ఎదుర్కొంటుంది. కొన్ని మ్యాచ్‌ల్లో స్టీవ్ స్మిత్‌ను ప్రయోగించినా ప్రతికూల ఫలితాలు వచ్చాయి. దీంతో ఉస్మాన్ ఖ్వాజాకు జోడీగా లబూషేన్‌తో ప్రయోగానికి పూనుకుంది. కీలక డబ్ల్యూటీసీ ఫైనల్ కావడంతో ఓపెనర్‌గా లబూషేన్ ఏ మేరకు రాణిస్తాడో అని అంతా ఆసక్తిగా గమనిస్తున్నారు. మరోవైపు సౌతాఫ్రికా కూడా బ్యాటింగ్ లైనప్‌లో ఓ మార్పు చేసింది. బౌలింగ్ ఆల్‌రౌండర్ వియాన్ ముల్దర్‌ను వన్‌డౌన్‌కు ప్రమోట్ చేసింది. సౌతాఫ్రికా తుది జట్టులో ఏకంగా నలుగురు వికెట్‌కీపర్ బ్యాటర్లు (రికెల్టన్, స్టబ్స్, వెర్రిన్, బెడింగ్హమ్) ఉండటం విశేషం. అయితే మ్యాచ్‌లో మాత్రం వెర్రిన్ వికెట్‌కీపింగ్ బాధ్యతలు చేపట్టనున్నట్లు సౌతాఫ్రికా మేనేజ్మెంట్ ప్రకటించింది.మ్యాచ్ విషయానికొస్తే.. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా టైటిల్ నిలబెట్టుకోవడమే లక్ష్యంగా బరిలోకి దిగుతుంది. మరోవైపు 27 ఏళ్లుగా ఐసీసీ టైటిల్ సాధించలేకపోయిన సౌతాఫ్రికా ఈ సువర్ణావకాశాన్ని అస్సలు మిస్ చేసుకోకూడదని మహా పట్టుదలగా ఉంది.డబ్ల్యూటీసీలో ఇది మూడో ఫైనల్ కాగా...తొలి రెండు ట్రోఫీలను న్యూజిలాండ్, ఆ్రస్టేలియా గెలుచుకున్నాయి. రెండు సందర్భాల్లోనూ ఫైనల్ చేరి ఓడిన భారత్ ఈసారి తుది పోరుకు అర్హత సాధించలేకపోయింది. మూడో స్థానంతో సరిపెట్టుకుంది.తుది జట్లు..దక్షిణాఫ్రికా: ఎయిడెన్ మార్క్రమ్, 2. ర్యాన్ రికెల్టన్, 3. వియాన్ ముల్డర్, 4. టెంబా బవుమా (కెప్టెన్), 5. ట్రిస్టన్ స్టబ్స్, 6. డేవిడ్ బెడింగ్హమ్, 7. కైల్ వెర్రిన్ (వికెట్‌కీపర్), 8. మార్కో జన్సెన్, 9. కేశవ్ మహారాజ్, 10. కగిసో రబాడ, 11. లుంగి ఎంగిడిఆస్ట్రేలియా: 1. ఉస్మాన్ ఖవాజా, 2. మార్నస్ లబూషేన్, 3. కెమరూన్ గ్రీన్, 4. స్టీవ్ స్మిత్, 5. ట్రావిస్ హెడ్, 6. బ్యూ వెబ్‌స్టర్, 7. అలెక్స్ క్యారీ (వికెట్‌కీపర్), 8. పాట్ కమిన్స్ (కెప్టెన్), 9. మిచెల్ స్టార్క్, 10. నాథన్ లియోన్, 11. జోష్ హాజిల్‌వుడ్ -
టీమిండియా జాక్‌పాట్.. పాపం పాకిస్థాన్!
ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) విజేత ఎవరో తేలిపోయే సమయం ఆసన్నమైంది. లండన్‌లోని లార్డ్స్ మైదానంలో బుధవారం నుంచి డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనుంది. పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా టైటిల్ కోసం బరిలోకి దిగనున్నాయి. గత రెండు ఎడిషన్లతో పోలిస్తే ఈసారి విజేతకు రెండింతల ఎక్కువ ప్రైజ్‌మనీ దక్కుతుంది. టెస్ట్ క్రికెట్‌కు పూర్వవైభవం తెచ్చేందుకు ప్రైజ్‌మనీని భారీగా పెంచింది ఐసీసీ.డబ్ల్యూటీసీ టైటిల్ గెలిచే జట్టుకు ఈసారి 3.6 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 30.8 కోట్లు) ప్రైజ్‌మనీ సొంతమవుతుంది. రన్నరప్‌కు 2.1 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 17.9 కోట్లు) నగదు బహుమతి అందుతుంది. హ్యాట్రిక్ ఫైనల్ మిస్సయి 3వ స్థానంలో నిలిచిన టీమిండియా కూడా భారీగానే ప్రైజ్‌మనీ అందుకోబోతోంది. మూడో స్థానంలో నిలిచినప్పటికీ గత రెండు ఎడిషన్ల విజేతల కంటే ఎక్కువ సొమ్మును భారత్ దక్కించుకోబోంది. 1.44 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 12.34 కోట్లు) నగదు బహుమతి పొందనుంది. పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో నిలిచిన న్యూజిలాండ్‌కు 1.2 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 10.26 కోట్లు) ప్రైజ్‌మనీ వస్తుంది.పాపం పాకిస్థాన్!పాకిస్థాన్ క్రికెట్ జట్టు పరిస్థితి రానురాను మరింత దయనీయంగా తయారవుతోంది. డబ్ల్యూటీసీ సైకిల్ 2023-2025లో పాక్ టీమ్ చివరి స్థానంతో సరిపెట్టుకుంది. దీంతో బంగ్లాదేశ్, వెస్టిండీస్ కన్నా తక్కువ మొత్తం ఆ జట్టుకు దక్కుతుంది. బంగ్లాదేశ్ 7.2 లక్షల డాలర్లు (దాదాపు రూ. 6.16 కోట్లు), వెస్టిండీస్ 6.1 లక్షల డాలర్లు (సుమారు రూ. 5.21 కోట్లు) నగదు బహుమతిగా అందుకోనున్నాయి. పాకిస్థాన్‌కు దాదాపు 4.1 కోట్ల రూపాయల (4.8 లక్షల డాలర్లు) నగదు మాత్రమే దక్కనుంది. పాయింట్ల పట్టికలో బంగ్లాదేశ్ 7, వెస్టిండీస్ 8 స్థానాల్లో నిలవగా, పాకిస్థాన్ చివరిదైన 9వ స్థానంలో ఉంది.డబ్ల్యూటీసీ సైకిల్ 2023-2025 పాయింట్ల పట్టికలో ఇంగ్లండ్, శ్రీలంక ఐదారు స్థానాల్లో నిలిచాయి. ఇంగ్లండ్ 9.6 లక్షల డాలర్లు (సుమారు రూ. 8.21 కోట్లు), శ్రీలంక 8.4 లక్షల డాలర్లు (దాదాపు రూ. 7.18 కోట్లు) నగదు బహుమతి అందుకుంటాయి. కాగా, 2019-21లో న్యూజిలాండ్, 2021-23లో ఆస్ట్రేలియా డబ్ల్యూటీసీ టైటిల్ గెలిచిన సంగతి తెలిసిందే. ఈ రెండు జట్లు ఇండియాపైనే గెలవడం గమనార్హం.డబ్ల్యూటీసీ 2025 ప్రైజ్‌మనీ వివరాలు1. విజేత: రూ. 30.8 కోట్లు2. రన్నరప్: రూ. 17.9 కోట్లు3. ఇండియా: రూ. 12.34 కోట్లు4. న్యూజిలాండ్: రూ. 10.26 కోట్లు5. ఇంగ్లండ్: రూ. 8.21 కోట్లు6. శ్రీలంక: రూ. 7.18 కోట్లు7. బంగ్లాదేశ్: రూ. 6.16 కోట్లు8. వెస్టిండీస్: రూ. 5.21 కోట్లు9. పాకిస్థాన్: రూ.4.1 కోట్లుచదవండి: అమ్మకానికి ఆర్సీబీ..?, ఆందోళనలో ఫ్యాన్స్.. -
'చోకర్స్ ట్యాగ్‌ను చెరిపేయాలి'.. సౌతాఫ్రికాకు బౌచర్ పిలుపు
దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు తొలి ఐసీసీ ట్రోఫీని ముద్దాడేందుకు అడుగు దూరంలో ఉంది. జూన్ 11 నుంచి 15 వరకు ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో జరగనున్న వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్-2025 ఫైనల్ పోరులో ఆస్ట్రేలియాతో సౌతాఫ్రికా అమీతుమీ తెల్చుకోనుంది.ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి తొలి ఐసీసీ టైటిల్‌ను అందుకోవాలని ప్రోటీస్ జట్టు ఉవ్విళ్లూరుతోంది. ప్రపంచ క్రికెట్లో చోకర్స్ టీమ్‌గా పేరు తెచ్చుకున్న సౌతాఫ్రికా ఈ సారి ఎలాగైనా ఆ ట్యాగ్‌ను పోగొట్టుకోవాలని పట్టుదలతో ఉంది. అయితే పాట్ కమ్మిన్స్ నేతృత్వంలోని ఆస్ట్రేలియాను ఓడించడం సఫారీలకు అంతసులువు కాదు.గతంలో ఐసీసీ టోర్నీ నాకౌట్స్ మ్యాచ్‌లలో ప్రోటీస్ చిత్తు అయింది. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ మార్క్ బౌచర్ తన జట్టును ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. సౌతాఫ్రికా ఐసీసీ ట్రోఫీ గెలవనంతవరకు ఛోకర్స్ ట్యాగ్ అలానే ఉంటుందని బౌచర్ అన్నాడు. ఈసారి గెలిచి ఆ ట్యాగ్‌ను చెరేపేయాలని బౌచర్ ప్రోటీస్‌కు పిలుపునిచ్చాడు."మేము మా తొలి ట్రోఫీ కోసం ఆడుతున్నాము. చాలా మంది మేము డబ్ల్యూటీసీ ఫైనల్లో గెలవమని అనుకుంటున్నారు. కానీ టెస్టు క్రికెట్ పరిస్థితులు వేరు. ఐదు రోజుల పాటు జరిగే మ్యాచ్‌లో ఏదైనా జరగొచ్చు. చాలా మలుపులు ఉంటాయి. అవునూ మాకు చోకర్స్ అనే ట్యాగ్ ఉంది. మేము ఐసీసీ ట్రోఫీని గెలుచుకునేవరకు ఆ ట్యాగ్ పోదు. కాబట్టి గెలిచి ఆ ముద్రను పోగుట్టుకోవాలి. కచ్చితంగా మా ఆటగాళ్లపై ఒత్తిడి ఉంటుంది. కానీ ఈ యువ జట్టుకు ఆ ట్యాగ్‌ను చెరిపేసే సత్తా ఉందని" బౌచర్ ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. కాగా టీ20 వరల్డ్‌కప్-2024 ఫైనల్లో భారత్ చేతిలో దక్షిణాఫ్రికా ఓటమిపాలైన సంగతి తెలిసిందే.చదవండి: ENG vs IND: ఇంగ్లండ్‌తో తొలి టెస్టు.. చరిత్రకు అడుగు దూరంలో బుమ్రా -
రెండు నెలలు బ్యాట్ టచ్ చేయలేదు.. వింతగా అన్పించింది: స్టీవ్ స్మిత్
వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్-2025 ఫైనల్‌కు సమయం అసన్నమవుతోంది. జూన్ 11 నుంచి 15 వరకు ప్రతిష్టాత్మక లార్డ్స్‌లో జరగనున్న తుది పోరులో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి రెండోసారి ఛాంపియన్‌గా నిలవాలని ఆస్ట్రేలియా భావిస్తుంటే.. మరోవైపు దక్షిణాఫ్రికా తొలి ఐసీసీ టైటిల్‌ను సొంతం చేసుకోవాలని భాస్తోంది.ఇప్పటికే లండన్‌కు చేరుకున్న ఇరు జట్లు ప్రాక్టీస్‌లో మునిగి తేలుతున్నాయి. ఇక ఫైనల్ పోరుకు ముందు తన ప్రాక్టీస్‌పై ఆసీస్ స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రెండు నెలల పాటు కనీసం బ్యాట్‌ను కూడా తను టచ్ చేయలేదని స్మిత్ చెప్పుకొచ్చాడు.కాగా ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో సెమీఫైనల్లో ఆసీస్ ఓటమి తర్వాత.. స్మిత్ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించి అందరికి షాకిచ్చాడు. ఆ తర్వాత తన సహచర ఆటగాళ్లు కొంతమంది ఐపీఎల్లో పాల్గొంటే.. మరి కొంతమంది డొమాస్టిక్ క్రికెట్లో ఆడారు. కానీ స్మిత్ మాత్రం న్యూయర్క్‌కు వెళ్లి విశ్రాంతి తీసుకున్నాడు. తన తుంటి గాయంపై ట్రైనర్‌తో కలిసి పనిచేశాడు."నేను సాధరణంగా ఇంటిలో ఖాళీగా ఉంటే షాడో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాను. కానీ ఈసారి మాత్రం అందుకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. అందుకే న్యూయర్క్‌కు వెళ్లిపోయాను. నేను ఇక్కడికి వచ్చి ప్రాక్టీస్‌లో తొలి షాట్ ఆడేంతవరకు కనీసం బ్యాట్‌ను కూడా టచ్ చేయలేదు.చాలా రోజులు తర్వాత బ్యాట్ పట్టుకుంటే చాలా కొత్తగా అన్పించింది. రెండు ప్రాక్టీస్ సెషన్ల తర్వాత నా లయను తిరిగి నేను అందుకున్నాను. ఇప్పుడు అంతా బాగానే ఉంది. ప్రస్తుతం ఫిట్నెస్ పరంగా కూడా ఎటువంటి సమస్యలు లేవు. 2014లో ఎలా ఉన్నానో ఇప్పుడు కూడా అలానే ఉన్నాను. తుంటి గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాను. ఇప్పుడు తిరిగి స్లిప్స్‌లో ఫీల్డింగ్ చేసేందుకు సిద్దంగా ఉన్నాను. నేను ఇప్పటికీ ఓపెనర్‌గా రాణించగలనని భావిస్తున్నాను. కానీ నేను ఆడిన గత నాలుగు మ్యాచ్‌లలో అంత మెరుగ్గా రాణించలేకపోయాను. ఈ రోజుల్లో టాప్-4లో బ్యాటింగ్ చేసే ఎవరైనా ఓపెనర్‌గా రాణించగలరు" అని స్మిత్ ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.చదవండి: IND vs ENG: వైభవ్ సూర్యవంశీ సిక్సర్ల వర్షం..! వీడియో వైరల్ -
WTC Final: సౌతాఫ్రికా మాస్టర్ ప్లాన్.. ఇక ఆసీస్‌కు చుక్కలే
వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్(WTC)-2025 ఫైనల్‌కు సమయం అసన్నమవుతోంది. జూన్ 11 నుంచి 15 వరకు లార్డ్స్ వేదికగా జరగనున్న తుది పోరులో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఈ క్రమంలో సౌతాఫ్రికా క్రికెట్ కీలక నిర్ణయం తీసుకుంది.ఈ ఫైనల్ మ్యాచ్ కోసం తమ జట్టు బౌలింగ్ కన్సల్టెంట్‌గా ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలింగ్ దిగ్గజం స్టువర్ట్ బ్రాడ్‌ను సీఎస్ఎ (Cricket South Africa) నియమించింది. ఫైనల్ మ్యచ్‌కు రెండు రోజుల ముందు ప్రోటీస్ జట్టుతో బ్రాడ్ చేరనున్నాడు. లార్డ్స్ మైదానంలో పరిస్థితులపై బ్రాడ్‌కు పూర్తి స్ధాయి అవగహన ఉంది. అతడు తన కెరీర్లో ఎన్నో మ్యాచ్‌లు ఈ క్రికెట్ మక్కాలో ఆడాడు. ఈ నేపథ్యంలోనే అతడితో సీఎస్ఎ తమ కోచింగ్ స్టాప్‌లోకి చేర్చుకుంది.రికార్డుల రారాజు..కెరీర్లో 167 టెస్ట్‌లు, 121, వన్డేలు, 56 టీ20లు ఆడిన బ్రాడ్ ఎన్నో రికార్డులను నమోదు చేశాడు. టెస్ట్‌ల్లో అత్యధిక వికెట్లు (604) తీసిన బౌలర్ల జాబితాలో ఐదో స్థానంలో నిలిచిన బ్రాడ్ బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ పలు రికార్డులు నెలకొల్పాడు. టెస్ట్‌ల్లో బ్రాడ్ 244 ఇన్నింగ్స్‌లు ఆడి 3662 పరుగులు చేశాడు. ఇతని ఖాతాలో సెంచరీ (169), 13 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.డబ్ల్యూటీసీ ఫైనల్‌కు సౌతాఫ్రికా జట్టుటెంబా బావుమా (కెప్టెన్), ఎయిడెన్ మార్క్రమ్, లుంగి ఎంగిడి, టోనీ డి జోర్జి, డేవిడ్ బెడింగ్హమ్, కేశవ్ మహారాజ్, ట్రిస్టన్ స్టబ్స్, కార్బిన్ బాష్, సెనురన్ ముత్తుసామి, మార్కో జాన్సెన్, కగిసో రబాడ, కైల్ వెర్రెయిన్, డేన్ ప్యాటర్సన్, వియాన్ ముల్డర్, ర్యాన్ రికెల్టన్.డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఆసీస్ జట్టుఉస్మాన్ ఖ్వాజా, సామ్ కోన్స్టాస్, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, కామెరూన్ గ్రీన్, ఇంగ్లిస్, అలెక్స్ క్యారీ, వెబ్‌స్టర్, పాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, హేజెల్‌వుడ్, స్కాట్ బోలాండ్, నాథన్ లయన్, మాథ్యూ కుహ్నెమాన్ -
డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు ఆస్ట్రేలియాకు శుభవార్త.. సెంచరీల మోత మోగిస్తున్న యువ ఆల్‌రౌండర్
వచ్చే నెలలో (జూన్ 11) సౌతాఫ్రికాతో జరుగబోయే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-25 (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు ముందు ఆస్ట్రేలియా జట్టుకు శుభవార్త అందింది. గాయం కారణంగా ఎనిమిది నెలలు క్రికెట్‌కు దూరంగా ఉన్న ఆ జట్టు యువ ఆల్‌రౌండర్ కెమరూన్ గ్రీన్ సెంచరీల మోత మోగిస్తున్నాడు. ఇంగ్లండ్‌లో జరుగుతున్న కౌంటీ ఛాంపియన్‌షిప్‌తో గ్రీన్ రెండు సెంచరీలు (112, 128) చేశాడు. ఈ టోర్నీలో గ్లోసెస్టర్‌షైర్‌కు ఆడుతున్న గ్రీన్ కెంట్ జట్టుపైనే రెండు సెంచరీలు చేశాడు. తాజా ప్రదర్శనతో గ్రీన్ డబ్ల్యూటీసీ ఫైనల్ ప్రత్యర్థి సౌతాఫ్రికాకు గట్టి వార్నింగ్ మెసేజ్ పంపాడు. గ్రీన్ డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం కొద్ది రోజుల కింద ప్రకటించిన ఆస్ట్రేలియా జట్టుకు ఎంపికయ్యాడు. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు ప్రాక్టీస్ నిమిత్తం గ్రీన్ కౌంటీ ఛాంపియన్షిప్ ఆడుతున్నాడు. అతనితో పాటు డబ్ల్యూటీసీ జట్టు సహచర సభ్యుడు మార్నస్ లబూషేన్ కూడా కౌంటీల్లో ఆడుతున్నాడు. అయితే గ్రీన్ తరహాలో లబూషేన్‌కు సత్ఫలితాలు రాలేదు. లబూషేన్ ఆడిన రెండు ఇన్నింగ్స్‌ల్లో 0, 4 పరుగులకు ఔటయ్యాడు. మిడిలార్డర్ బ్యాటర్ అయిన లబూషేన్ డబ్ల్యూటీసీ ఫైనల్లో ఓపెనర్‌గా మారే అవకాశం ఉందని తెలుస్తుంది. గ్రీన్‌తో పాటు మరో ఆల్‌రౌండర్ బ్యూ వెబ్‌స్టర్‌కు తుది జట్టులో ఆవకాశం కల్పించాలంటే లబూషేన్ ఓపెనర్‌గా ప్రమోట్ కాక తప్పదు. లబూషేన్.. వెటరన్ ఓపెనర్ ఉస్మాన్ ఖ్వాజాతో ఇన్నింగ్స్ ప్రారంభిస్తే.. గ్రీన్, వెబ్‌స్టర్ ఇద్దరికీ తుది జట్టులో ఛాన్స్ దొరుకుతుంది.ఇదిలా ఉంటే, డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం ఆస్ట్రేలియా జట్టును ప్రకటించిన వెంటనే సౌతాఫ్రికా కూడా తమ జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు టెంబా బవుమా సారధిగా వ్యవహరించనుండగా.. ఏకంగా ఆరుగురు పేసర్లు (కగిసో రబాడ, లుంగి ఎంగిడి, మార్కో జన్సెన్, వియన్ ముల్దర్, డేన్ ప్యాటర్సన్, కార్బిన్ బాష్) ఎంపికయ్యారు.డబ్ల్యూటీసీ ఫైనల్-2025కి ఆస్ట్రేలియా జట్టు: పాట్ కమిన్స్ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, కామెరాన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్, ట్రవిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, సామ్ కాన్స్టాస్, మాట్ కుహ్నెమాన్, మార్నస్ లబుషేన్, నాథన్ లియాన్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, బ్యూ వెబ్‌స్టర్.ట్రావెలింగ్ రిజర్వ్: బ్రెండన్ డాగెట్.డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం సౌతాఫ్రికా జట్టు: టెంబా బావుమా (కెప్టెన్), ఎయిడెన్ మార్క్రమ్, లుంగి ఎంగిడి, టోనీ డి జోర్జి, డేవిడ్ బెడింగ్హమ్, కేశవ్ మహరాజ్, ట్రిస్టన్ స్టబ్స్, కార్బిన్ బాష్, సెనురన్ ముత్తుసామి, మార్కో జన్సెన్, కగిసో రబడ, కైల్ వెర్రెయిన్, డేన్ ప్యాటర్సన్, వియాన్ ముల్డర్, ర్యాన్ రికెల్టన్. -
IPL 2025: నేనైతే వెళ్లేవాడిని కాదు.. మీరూ వెళ్లొద్దు: ఆసీస్ మాజీ క్రికెటర్
ఐపీఎల్-2025 (IPL 2025) ప్లే ఆఫ్స్ దశకు చేరుకున్న వేళ అనుకోని విధంగా వారం పాటు వాయిదా పడింది. ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో భారత్- పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అయితే, ప్రస్తుతం పరిస్థితులు చక్కబడటంతో లీగ్‌ను పునఃప్రారంభించేందుకు బోర్డు సిద్ధమైంది.కొందరు వచ్చేశారుఇప్పటికే పది ఫ్రాంఛైజీలకు తమ ఆటగాళ్లందరినీ ఒకే చోట చేర్చాల్సిందిగా ఆదేశించిన బోర్డు.. శనివారం (మే 17) నుంచి మ్యాచ్‌లు కొనసాగించనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే కొంత మంది విదేశీ ఆటగాళ్లు భారత్‌కు చేరుకోగా.. మరికొంత మంది జాతీయ జట్టు విధుల దృష్ట్యా స్వదేశాల్లోనే ఉండిపోయారు.ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మిచెల్ జాన్సన్ ఐపీఎల్ ఆడే విదేశీ ఆటగాళ్లను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ‘‘ఐపీఎల్ ఆడేందుకు తిరిగి ఇండియాకు వెళ్లాలా వద్దా అనే నిర్ణయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా ఆటగాళ్లకే వదిలివేసింది.నేనైతే ‘నో’ చెప్పేవాడినినిజానికి మధ్యలోనే ఇలా లీగ్‌ను వదిలివేయడం నిరాశకు గురిచేస్తుంది. ప్రొఫెషనల్‌గా, ఆర్థికంగా ఒక్కోసారి ఎదురుదెబ్బలు తగులుతాయి. అయితే, అన్నింటికంటే భద్రతే ముఖ్యం. ఒకవేళ నేనే గనుక వారి స్థానంలో ఉండి ఉంటే.. ఇండియాకు వెళ్లి లీగ్ పూర్తి చేయాలని ఆదేశించినా.. కచ్చితంగా ‘నో’ చెప్పేవాడిని.ఎందుకంటే నా వరకు చెక్కుల కంటే కూడా ప్రాణాలు ముఖ్యమైనవి. అయితే, ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. ఐపీఎల్ ఒక్కటనే కాదు.. పాకిస్తాన్ సూపర్ లీగ్ ఆడేందుకు కూడా ఆటగాళ్లు అక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదనే నేను భావిస్తున్నా’’ అని మిచెల్ జాన్సన్ ది వెస్ట్రన్ ఆస్ట్రేలియన్‌కు రాసిన కాలమ్‌లో పేర్కొన్నాడు.సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు ఓప్పుకోవడానికి కారణం అదేఅదే విధంగా.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్-2025 ఫైనల్ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘జూన్ 3న ఐపీఎల్ ఫైనల్ జరుగుతుంది. ఆ తర్వాత వారం రోజులకే లార్డ్స్‌లో డబ్ల్యూటీసీ ఫైనల్ ఉంది. కాబట్టి ఈ మెగా మ్యాచ్‌కు సన్నద్ధమయ్యే క్రమంలో ఆటగాళ్లపై తీవ్రమైన ఒత్తిడి నెలకొంటుంది’’ అని మిచెల్ జాన్సన్ పేర్కొన్నాడు.అయితే, బీసీసీఐతో సౌతాఫ్రికా క్రికెట్ బోర్డుకు ఉన్న ఆర్థిక సంబంధాల దృష్ట్యా ప్రొటిస్ ఆటగాళ్లంతా తిరిగి ఐపీఎల్లో పాల్గొంటారని జాన్సన్ అభిప్రాయపడ్డాడు. కాగా ఐపీఎల్ ఫ్రాంఛైజీల సారథ్యంలోనే సౌతాఫ్రికా టీ20 లీగ్ జరుగుతున్న విషయం తెలిసిందే.రిక్కీ పాంటింగ్ ఉండటమే కాదు.. వాళ్లనూ ఒప్పించాడుఇదిలా ఉంటే.. ధర్మశాలలో పంజాబ్ కింగ్స్- ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ అర్ధంతరంగా ఆగిపోయిన విషయం తెలిసిందే. పాక్ దుశ్చర్యలను తిప్పికొట్టేందుకు భారత్ అక్కడ బ్లాక్ అవుట్ (విద్యుత్ సరఫరా నిలిపివేయడం) ప్రకటించడంతో స్టేడియం కూడా చీకటైపోయింది.ఈ క్రమంలో ఆటగాళ్లతో పాటు ప్రేక్షకులను సురక్షితంగా అక్కడి నుంచి తరలించింది బీసీసీఐ. అంతేకాదు.. వందే భారత్ రైలులో అత్యంత భద్రత నడుమ పంజాబ్, ఢిల్లీ ఆటగాళ్లను ఢిల్లీకి చేర్చింది. ఈ నేపథ్యంలో కాస్త భయాందోళనకు లోనైనప్పటికీ.. భారత్‌లోనే ఉండిపోవాలని పంజాబ్ కింగ్స్ హెడ్‌కోచ్, ఆసీస్ దిగ్గజ కెప్టెన్ రిక్కీ పాంటింగ్ నిర్ణయించుకున్నాడు. బీసీసీఐ చేసిన ఏర్పాట్లు, భారత ప్రభుత్వం తీసుకున్న రక్షణ చర్యల నేపథ్యంలో ఆటగాళ్లను కూడా ఇందుకు ఒప్పించాడు. అయితే, మిచెల్ జాన్సన్ మాత్రం ఇందుకు భిన్నంగా స్పందించాడు. కాగా ముంబై ఇండియన్స్ తరఫున రెండుసార్లు (2013, 2017) ఐపీఎల్ గెలిచిన జట్టులో జాన్సన్ సభ్యుడు. చదవండి: మాట తప్పారు!.. ఆర్సీబీకి తిరిగి ఆడాలని అనుకోలేదు: పాటిదార్ఐపీఎల్ 2025 పునఃప్రారంభం.. ఎవరు తిరిగొస్తున్నారు.. ఎవరు రావడం లేదు..? -
డబ్ల్యూటీసీ ప్రైజ్‌మనీ ప్రకటించిన ఐసీసీ.. విజేతకు ఎన్ని కోట్లంటే?
వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ 2023-25 ఫైనల్‌కు సమయం అసన్నమవుతోంది. జూన్ 11 నుంచి 15 వరకు జరగనున్న తుది పోరులో దక్షిణాఫ్రికా- ఆస్ట్రేలియా జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఈ క్రమంలో డబ్ల్యూటీసీ ఫైనల్ ప్రైజ్ మనీని అంతర్జాతీయ కౌన్సిల్ గురువారం ప్రకటించింది. గత రెండు ఎడిషన్లతో పోలిస్తే.. ప్రైజ్ మనీనీ ఈసారి రెండింతలు ఐసీసీ పెంచింది.ఈ మెగా మ్యాచ్‌లో విజేతగా నిలిచిన జట్టుకు 3.6 మిలియన్ల డాలర్లు( భారత కరెన్సీలో సుమారు రూ. 31 కోట్లు) ప్రైజ్‌మనీ దక్కనున్నది. అదేవిధంగా రన్నరప్‌గా నిలిచిన జట్టుకు 2.1 మిలియన్ల డాలర్ల ( సుమారు రూ. 18 కోట్లు) నగదు బహుమతి లభించనుంది. కాగా డబ్ల్యూటీసీ ఫైనల్ 2021-23 ఫైనల్లో భారత జట్టుపై గెలిచిన ఆస్ట్రేలియాకు 1.6 మిలియన్ల డాలర్ల (రూ. 13.68 కోట్లు) ప్రైజ్‌మనీ దక్కింది. అలాగే రన్నరప్ టీమిండియాకు 8 లక్షల డాలర్లు (రూ. 6.84 కోట్లు) ఇచ్చారు. అయితే టెస్టు క్రికెట్‌కు ప్రాముఖ్యతను మరింత పెంచేందుకు ప్రైజ్‌మనీని డబుల్ చేసినట్లు ఐసీసీ ఓ ప్రకటనలో పేర్కొంది. అదేవిధంగా డబ్ల్యూటీసీ సైకిల్ 2023-25లో భాగమైన ఇతర జట్లకు కూడా నగదు బహుమతి లభించనుంది. పాయింట్ల పట్టికలో మూడవ స్థానంలో ఉన్న భారత్‌కు 1.44 మిలియన్ డాలర్లు(సుమారు రూ.12 కోట్లు), నాల్గవ స్థానంలో ఉన్న న్యూజిలాండ్ 1.2 మిలియన్ డాలర్లు ప్రైజ్‌మనీ అందనుంది. ఇక డబ్ల్యూటీసీ సైకిల్ 2023-25లో దక్షిణాఫ్రికా 69.44 శాతం పాయింట్లతో అగ్రస్ధానంలో నిలిచింది. ఆ తర్వాత డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా 67.54 పాయింట్లతో రెండో స్థానంలో నిలవగా.. 50.00 పాయింట్లతో ఇండియా మూడవ స్థానంతో సరిపెట్టుకుంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత్ ఓటమి పాలవ్వడంతో డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలు గల్లంతయ్యాయి.డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం ఆస్ట్రేలియా జట్టు: పాట్ కమిన్స్ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, కామెరూన్ గ్రీన్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, సామ్ కాన్స్టాస్, మ్యాట్ కునెమన్, మార్నస్ లబుషేన్, నాథన్ లైయన్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, బ్యూ వెబ్‌స్టర్. ట్రావెలింగ్ రిజర్వ్: బ్రెండన్ డగెట్డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం దక్షిణాఫ్రికా జట్టు: టెంబా బవుమా (కెప్టెన్), టోనీ డి జోర్జి, ఐడెన్ మార్క్రమ్, వియాన్ ముల్డర్, మార్కో యన్సెన్, కగిసో రబాడా, కేశవ్ మహరాజ్, లుంగి ఎంగిడి, కార్బిన్ బాష్, కైల్ వెర్రెయిన్, డేవిడ్ బెడింగ్హామ్, ట్రిస్టన్ స్టబ్స్, ర్యాన్ రికెల్టన్, సెనురన్ ముత్తుసామీ, డేన్ పాటర్సన్చదవండి: IPL 2025: హ్యాండ్ ఇచ్చిన జోస్ బట్లర్.. గుజరాత్ జట్టులోకి విధ్వంసకర వీరుడు? -
డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం సౌతాఫ్రికా జట్టు ప్రకటన.. ఐపీఎల్ జట్లకు భారీ షాక్
జూన్ 11 నుంచి లార్డ్స్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగే డబ్ల్యూటీసీ 2023-25 ఫైనల్ కోసం 15 మంది సభ్యుల సౌతాఫ్రికా జట్టును ఇవాళ (మే 13) ప్రకటించారు. ఈ జట్టుకు సారధిగా టెంబా బవుమా వ్యవహరించనున్నాడు. ఈ జట్టులో ఏకంగా ఆరుగురు పేసర్లకు (కగిసో రబాడ, లుంగి ఎంగిడి, మార్కో జన్సెన్, వియన్ ముల్దర్, డేన్ ప్యాటర్సన్, కార్బిన్ బాష్) చోటు దక్కింది. లార్డ్స్ పిచ్ పేసర్లకు అనుకూలంగా ఉండనుండటంతో సౌతాఫ్రికా సెలక్టర్లు ఈ మేరకు నిర్ణయించారు.పేస్ దళంతో పోలిస్తే సౌతాఫ్రికా బ్యాటింగ్ విభాగం కాస్త బలహీనంగా కనిపిస్తుంది. ఆ జట్టులో బవుమా, మార్క్రమ్ మినహా అనుభవజ్ఞులైన బ్యాటర్లు లేరు. రికెల్టన్, స్టబ్స్, డేవిడ్ బెడింగ్హమ్ లాంటి పరిమిత ఓవర్ల స్టార్లు ఉన్నా టెస్ట్‌ల్లో వారు ఏ మేరకు రాణించగలరో చూడాలి.TEMBA BAVUMA ANNOUCING SOUTH AFRICA SQUAD FOR WTC FINAL. 🥶🔥 pic.twitter.com/uZbtbcxAGn— Johns. (@CricCrazyJohns) May 13, 2025డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం సౌతాఫ్రికా జట్టు: టెంబా బావుమా (కెప్టెన్), ఎయిడెన్ మార్క్రమ్, లుంగి ఎంగిడి, టోనీ డి జోర్జి, డేవిడ్ బెడింగ్హమ్, కేశవ్ మహరాజ్, ట్రిస్టన్ స్టబ్స్, కార్బిన్ బాష్, సెనురన్ ముత్తుసామి, మార్కో జన్సెన్, కగిసో రబడ, కైల్ వెర్రెయిన్, డేన్ ప్యాటర్సన్, వియాన్ ముల్డర్, ర్యాన్ రికెల్టన్.కాగా, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో సౌతాఫ్రికాకు ఇదే తొలి ఫైనల్. 1998 ఐసీసీ నాకౌట్ ట్రోఫీ తర్వాత ఆ జట్టు ఇప్పటివరకు ఒక్క ఐసీసీ టైటిల్ కూడా గెలవలేదు. మరోవైపు ఫైనల్లో సౌతాఫ్రికా ఎదుర్కోబోయే ఆస్ట్రేలియా డబ్ల్యూటీసీలో డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఉంది. ఆ జట్టు గత ఎడిషన్ (2021-23) ఫైనల్లో భారత్‌పై విజయం సాధించి ఛాంపియన్‌గా అవతరించింది. ఆస్ట్రేలియా కూడా ఇవాళే జట్టును ప్రకటించింది. ఆసీస్ జట్టుకు సారధిగా పాట్ కమిన్స్ వ్యవహరించనున్నాడు. ఆల్‌రౌండర్ కెమారూన్ గ్రీన్ చాలా కాలం తర్వాత ఆసీస్ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు.డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం ఆస్ట్రేలియా జట్టు: పాట్ కమిన్స్, స్కాట్ బోలాండ్, అలెక్స్ క్యారీ, కెమారూన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్, ట్రవిస్ హెడ్, జోస్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖ్వాజా, సామ్ కొన్‌స్టాస్, మ్యాట్ కుహ్నేమన్, మార్నస్ లబూషేన్, నాథన్ లియోన్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, బ్యూ వెబ్స్టర్ట్రావెలింగ్ రిజర్వ్: బ్రెండన్ డాగెట్ఐపీఎల్ జట్టుకు షాక్డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం ఇవాళ ప్రకటించిన ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా జట్లలో 13 మంది ఐపీఎల్ స్టార్లు చోటు దక్కించుకున్నారు. వీరిలో ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఐదుగురు కాగా.. సౌతాఫ్రికాకు చెందిన వారు ఎనిమిది మంది. ఐపీఎల్ 2025 పూర్తైన వారం రోజులకే డబ్ల్యూటీసీ ఫైనల్ మొదలు కానుండటంతో ఈ 13 మంది ఆటగాళ్లు క్యాష్ రిచ్ లీగ్‌కు ఏమేరకు అందుబాటులో ఉంటారో అన్నది ప్రశ్నార్థకంగా మారింది.డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఎంపికైన ఐపీఎల్ 2025 స్టార్లు..ఆసీస్ ఆటగాళ్లు..పాట్ కమిన్స్ (ఎస్ఆర్హెచ్)ట్రవిస్ హెడ్ (ఎస్ఆర్హెచ్)జోష్ హాజిల్‌వుడ్ (ఆర్సీబీ)జోస్ ఇంగ్లిస్ (పంజాబ్)మిచెల్ స్టార్క్ (ఢిల్లీ)సౌతాఫ్రికా ఆటగాళ్లు..మార్క్రమ్ (లక్నో)ఎంగిడి (ఆర్సీబీ)స్టబ్స్ (ఢిల్లీ)కార్బిన్ బాష్ (ముంబై ఇండియన్స్)ర్యాన్ రికెల్టన్ (ముంబై ఇండియన్స్)జన్సెన్ (పంజాబ్)రబాడ (గుజరాత్)ముల్దర్ (ఎస్ఆర్హెచ్) -
WTC Final-2025: ఆస్ట్రేలియా జట్టు ప్రకటన
ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (WTC)-2025 ఫైనల్‌కు క్రికెట్ ఆస్ట్రేలియా తమ జట్టును ప్రకటించింది. లార్డ్స్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగే ఈ మెగా మ్యాచ్‌కు పదిహేను మంది సభ్యులతో కూడిన టీమ్ వివరాలను మంగళవారం వెల్లడించింది.పునరాగమనంకాగా గాయం కారణంగా శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు దూరమైన రెగ్యులర్ కెప్టెన్, స్టార్ పేసర్ ప్యాట్ కమిన్స్ జట్టులోకి పునరాగమనం చేశాడు. అదే విధంగా.. వెన్నునొప్పికి శస్త్ర చికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకున్న ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ కూడా తిరిగి జట్టులోకి వచ్చాడు.అంతేకాదు.. మరో పేసర్ జోష్ హాజిల్‌వుడ్ కూడా గాయం నుంచి కోలుకుని టెస్టు జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఇక స్పిన్నర్ మ్యాట్ కుహ్నెమన్‌కు కూడా ఆసీస్ సెలక్టర్లు డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడే జట్టులో చోటిచ్చారు.కరేబియన్లతో ఆడే జట్టూ ఇదేఇక ఇదే జట్టుతో ఆస్ట్రేలియా వెస్టిండీస్ పర్యటనకు కూడా వెళ్లనుంది. కరేబియన్లతో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనుంది. కాగా డబ్ల్యూటీసీ 2023-25 సీజన్లో ఆస్ట్రేలియా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. నాలుగు గెలిచిఈ ఎడిషన్‌లో ఆరు సిరీస్‌లకు గానూ నాలుగు గెలిచి ఫైనల్‌కు అర్హత సాధించింది. ఇంగ్లండ్‌తో 2023లో యాషెస్ సిరీస్‌ను 2-2తో డ్రా చేసుకున్న కంగారూలు 2023-24 సమ్మర్లో వెస్టిండీస్‌తో సిరీస్‌ను 1-1తో సమం చేశారు.ఇక 2024-25లో టీమిండియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ 3-1తో గెలిచిన ఆసీస్.. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరుకుంది. ఆ తర్వాత శ్రీలంకతో నామమాత్రపు టెస్టు సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్ చేసి సత్తా చాటింది. ఇక ఆసీస్ కంటే ముందే సౌతాఫ్రికా టైటిల్ పోరుకు అర్హత సాధించిన విషయం తెలిసిందే.టాప్‌లో సౌతాఫ్రికాఇక 2023-25 ఎడిషన్‌కు గానూ సౌతాఫ్రికా పన్నెండు టెస్టులకు ఎనిమిది గెలిచి 69.44 విజయ శాతంతో పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉండగా.. 19 మ్యాచ్‌లకు గానూ 13 గెలిచి ఆస్ట్రేలియా 67.54తో రెండో స్థానంలో నిలిచింది. కాగా ఇంగ్లండ్‌లోని ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో ఈ రెండు జట్ల మధ్య జూన్ 11 నుంచి డబ్ల్యూటీసీ-2025 ఫైనల్ ఆరంభం కానుంది.ఇదిలా ఉంటే.. గాయాల నుంచి కోలుకున్న తర్వాత కమిన్స్, హాజిల్‌వుడ్‌లతో పాటు ట్రవిస్ హెడ్, ఇంగ్లిస్, స్టార్క్ తదితరులు ఐపీఎల్-2025లో భాగమయ్యారు. అయితే, భారత్- పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో వీరు స్వదేశానికి తిరిగి రాగా.. ఇష్టమైతేనే తిరిగి ఐపీఎల్ ఆడేందుకు వెళ్లాలని సీఏ సూచించినట్లు వార్తలు వచ్చాయి. అంతలోనే డబ్ల్యూటీసీ ఫైనల్‌కు జట్టును ప్రకటించడం గమనార్హం.డబ్ల్యూటీసీ ఫైనల్-2025కి ఆస్ట్రేలియా జట్టుపాట్ కమిన్స్ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, కామెరాన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్, ట్రవిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, సామ్ కాన్స్టాస్, మాట్ కుహ్నెమాన్, మార్నస్ లబుషేన్, నాథన్ లియాన్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, బ్యూ వెబ్‌స్టర్.ట్రావెలింగ్ రిజర్వ్: బ్రెండన్ డాగెట్.చదవండి: CA: ఇష్టం లేకపోతే వెళ్లొద్దులే!