
2023-25 ఎడిషన్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్గా సౌతాఫ్రికా అవతరించింది. లార్డ్స్ వేదికగా జరిగిన ఫైనల్లో ప్రొటీస్ జట్టు ఆస్ట్రేలియాకు షాకిచ్చి, 27 ఏళ్ల తర్వాత తొలి ఐసీసీ టైటిల్ గెలుచుకుంది. టెంబా బవుమా సారథ్యంలో సౌతాఫ్రికా తమ దీర్ఘకాల కలను సాకారం చేసుకుంది.

దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఐసీసీ టైటిల్ గెలిచిన బవుమా సేనకు స్వదేశంలో ఘన స్వాగతం లభించింది. దీనికి సంబంధించిన ఫోటోలు వైరలవుతున్నాయి.



















