నల్లటి ఆర్మ్‌ బ్యాండ్‌లతో ఆసీస్‌-సౌతాఫ్రికా ఆటగాళ్లు | Why are players wearing black armbands in the WTC 2025 final? | Sakshi
Sakshi News home page

WTC Final: నల్లటి ఆర్మ్‌ బ్యాండ్‌లతో ఆసీస్‌-సౌతాఫ్రికా ఆటగాళ్లు

Jun 13 2025 4:35 PM | Updated on Jun 13 2025 5:49 PM

Why are players wearing black armbands in the WTC 2025 final?

లార్డ్స్ వేదికగా జరుగుతున్న వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మూడో రోజు ఆటలో ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా నల్లటి ఆర్మ్ బ్యాండ్లు ధరించి బరిలోకి దిగారు. గురువారం(జూన్ 12) అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినవారికి సంతాపం తెలుపుతూ బ్లాక్ బ్యాండ్స్‌ను ధరించారు.

ఆట ఆరంభానికి ముందు ఇరు జట్లు ఆటగాళ్లు రెండు నిమిషాల పాటు మౌనం కూడా పాటించారు. మరో వైపు ఇంట్రాస్వ్కాడ్ ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత జట్టు ఆటగాళ్లు కూడా అహ్మదాబాద్‌ విమాన ప్రమాద ఘటనపై సంతాపం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను అధికారిక బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ ఎక్స్‌లో షేర్ చేసింది.

కాగా అహ్మదాబాద్ నుంచి లండన్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన వెంటనే కూలిపోయింది. ఈ ఘోర ప్రమాదంలో మొత్తం 265 మంది తమ ప్రాణాలు కోల్పోయారు. ఊహించని ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఇక డబ్ల్యూటీసీ ఫైనల్ విషయానికి వస్తే.. రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా తడబడి నిలబడింది.

టాపార్డర్ విఫలమైనప్పటికి.. అలెక్స్ క్యారీ(43), మిచెల్ స్టార్క్‌(44 బ్యాటింగ్‌) ఆసీస్‌ను ఆదుకున్నారు. ఆసీస్ తమ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 59 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసింది. కంగారులు ప్రస్తుతం 260 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.


చదవండి: IND vs ENG: ఫ్యామిలీ ఎమ‌ర్జెన్సీ.. భార‌త్‌కు తిరిగొచ్చిన గౌతం గంభీర్‌

 

Advertisement
 
Advertisement
Advertisement