WTC ఛాంపియ‌న్ ద‌క్షిణాఫ్రికాకు ప్రైజ్‌మ‌నీ ఎన్ని కోట్లంటే? | WTC 2025 Final Prize Money: How Much South Africa Won After Historic Victory Over Aus? | Sakshi
Sakshi News home page

WTC Final 2025: ఛాంపియ‌న్ ద‌క్షిణాఫ్రికాకు ప్రైజ్‌మ‌నీ ఎన్ని కోట్లంటే?

Jun 14 2025 6:30 PM | Updated on Jun 14 2025 6:44 PM

WTC 2025 Final Prize Money: How Much South Africa Won After Historic Victory Over Aus?

ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్ (డ‌బ్ల్యూటీసీ) 2023-25 విజేత‌గా ద‌క్షిణాఫ్రికా అవ‌త‌రించింది. లార్డ్స్ వేదిక‌గా జ‌రిగిన ఫైన‌ల్లో ఆస్ట్రేలియాను 5 వికెట్ల తేడాతో ఓడించిన సౌతాఫ్రికా.. 27 ఏళ్ల త‌ర్వాత తొలి ఐసీసీ టైటిల్‌ని ముద్దాడింది. ఆసీస్ నిర్ధేశించిన 282 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ప్రోటీస్ జ‌ట్టు కేవ‌లం ఐదు వికెట్లు మాత్ర‌మే కోల్పోయి చేధించింది. 

ద‌క్షిణాఫ్రికా బ్యాటర్ల‌లో ఐడైన్ మార్‌క్ర‌మ్ సూప‌ర్ సెంచ‌రీతో చెల‌రేగాడు. 207 బంతులు ఎదుర్కొన్న మార్‌క్ర‌మ్‌.. 14 ఫోర్ల సాయంతో 136 ప‌రుగులు చేశాడు. అత‌డితో పాటు టెంబా బావుమా(64) కీల‌క ఇన్నింగ్స్ ఆడాడు. ఆసీస్‌ బౌలర్లలో మిచెల్‌ స్టార్క్‌ మూడు, హాజిల్‌వుడ్‌, కమ్మిన్స్‌ తలా వికెట్‌సాధించారు.

దక్షిణాఫ్రికా ప్రైజ్‌మనీ ఎన్ని కోట్లంటే?
ఇక వ‌ర‌ల్డ్ ఛాంపియ‌న్స్‌గా నిలిచిన ద‌క్షిణాఫ్రికాకు ఎంతో ప్రైజ్‌మ‌నీ ద‌క్కింది, ర‌న్న‌రప్ ఆస్ట్రేలియాకు ఎంతో మొత్తం ల‌భించిందో తెలుసుకుందాం. తొలిసారి డ‌బ్ల్యూటీసీ విజేత‌గా నిలిచిన ప్రోటీస్‌కు టెస్టు ఛాంపియ‌న్ షిప్ గ‌దతో పాటు ప్రైజ్‌మ‌నీ కింద 3.6 మిలియ‌న్ల డాల‌ర్లు( భార‌త క‌రెన్సీలో సుమారు రూ.31.05 కోట్లు) ల‌భించింది.  గ‌త రెండు ఎడిష‌న్‌ల‌తో పోలిస్తే.. ప్రైజ్ మ‌నీనీ ఈసారి రెండింత‌లు ఐసీసీ పెంచింది.

ఇక ర‌న్న‌ర‌ప్‌ ఆస్ట్రేలియాకు 2.1 మిలియ‌న్ల డాల‌ర్ల (రూ.18.63 కోట్లు) ప్రైజ్‌మ‌నీ ద‌క్కింది. ఇక డ‌బ్యూటీసీ 2023-25 సైకిల్‌లో పాయింట్ల ప‌ట్టిక‌లో మూడో స్థానంలో నిలిచిన భార‌త జ‌ట్టుకు 1.44 మిలియ‌న్ డాల‌ర్ల (దాదాపు రూ. 12. 42 కోట్లు) క్యాష్ ప్రైజ్ అంద‌నుంది.

WTC 2025 ప్రైజ్‌మ‌నీ వివరాలు
సౌతాఫ్రికా: రూ. 31.05 కోట్లు
ఆస్ట్రేలియా: రూ. 18.63 కోట్లు
ఇండియా: రూ. 12.42 కోట్లు
న్యూజిలాండ్‌: రూ. 10.35 కోట్లు
ఇంగ్లండ్‌: రూ. 8.28 కోట్లు
శ్రీలంక‌: రూ. 7.24 కోట్లు
బంగ్లాదేశ్‌: రూ. 6.21 కోట్లు
వెస్టిండీస్‌: రూ. 5.17 కోట్లు
పాకిస్తాన్‌: రూ. 4.14 కోట్లు
చదవండి: WTC 2025: వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ విజేత‌గా సౌతాఫ్రికా..

Advertisement
 
Advertisement
Advertisement