
లార్డ్స్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్‌లో ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 67 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఆసీస్‌ను వెబ్‌స్టెర్‌తో కలిసి స్మిత్ ఆదుకున్నాడు. ఆచితూచి ఆడుతూ స్కోర్ బోర్డును ముందుకు నడిపించాడు. 112 బంతుల్లో 10 ఫోర్ల సాయంతో 66 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ క్రమంలో స్మిత్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.
చరిత్ర సృష్టించిన స్మిత్..
ఇంగ్లండ్ గడ్డపై టెస్టుల్లో అత్యధిక ఫిప్టీ ప్లస్ స్కోర్లు సాధించిన విదేశీ బ్యాటర్‌గా స్మిత్ నిలిచాడు. ఇప్పటివరకు స్మిత్ ఇంగ్లండ్‌లో 18 సార్లు ఏభైకి పైగా పరుగులు చేశాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా దిగ్గజం అలన్ బోర్డర్ (17) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో బోర్డర్ ఆల్‌టైమ్ రికార్డును స్మిత్ బ్రేక్ చేశాడు.
ఇంగ్లండ్‌లో టెస్టుల్లో అత్యధిక సార్లు ఫిప్టీ ప్లస్ స్కోర్లు చేసిన విదేశీ బ్యాటర్లు వీరే..
స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా)-18
అల్లన్ బోర్డర్ (ఆస్ట్రేలియా)- 17
వివ్ రిచర్డ్స్ (వెస్టిండీస్)- 17
డాన్ బ్రాడ్‌మాన్ (ఆస్ట్రేలియా)- 14
గ్యారీ సోబర్స్ (వెస్టిండీస్)- 14
అదేవిధంగా ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన విదేశీ బ్యాటర్‌గా స్టీవ్ స్మిత్ చరిత్ర సృష్టించాడు. స్మిత్ ఇప్పటివరకు లార్డ్స్‌లో 591 పరుగులు చేశాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఆసీస్ లెజెండ్ వారెన్ బార్డ్స్‌లీ (575 పరుగులు) పేరిట ఉండేది. 1909-1926 కాలంలో బార్డ్స్‌లీ ఈ ఫీట్ సాధించాడు. తాజా ఇన్నింగ్స్‌తో 99 ఏళ్ల బార్డ్స్‌లీ రికార్డును స్మిత్ బద్దలు కొట్టాడు.
లార్డ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన విదేశీ బ్యాటర్లు..
స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా)- 591
వారెన్ బార్డ్స్లీ (ఆస్ట్రేలియా) - 575
గ్యారీఫీల్డ్ సోబర్స్ (వెస్టిండీస్) - 571
డాన్ బ్రాడ్‌మన్ (ఆస్ట్రేలియా) - 551
శివ్‌నారాయణ్ చందర్‌పాల్ (వెస్టిండీస్) - 512
దిలీప్ వెంగ్‌సర్కార్ (భారత్) - 508
అలెన్ బోర్డర్ (ఆస్ట్రేలియా) - 503
చదవండి: WTC Final: ఐదేసిన రబాడ.. 212 పరుగులకు ఆసీస్ ఆలౌట్