ఐదేసిన ర‌బాడ‌.. 212 ప‌రుగుల‌కు ఆసీస్ ఆలౌట్‌ | Kagiso Rabada registers five-wicket haul as South Africa fold Aus for 212 | Sakshi
Sakshi News home page

WTC Final: ఐదేసిన ర‌బాడ‌.. 212 ప‌రుగుల‌కు ఆసీస్ ఆలౌట్‌

Jun 11 2025 9:00 PM | Updated on Jun 11 2025 9:15 PM

 Kagiso Rabada registers five-wicket haul as South Africa fold Aus for 212

లార్డ్స్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లో సౌతాఫ్రికా బౌల‌ర్లు చెల‌రేగారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా త‌మ మొద‌టి ఇన్నింగ్స్‌లో 212 ప‌రుగుల‌కే ఆలౌటైంది. సౌతాఫ్రికా స్పీడ్ స్టార్ కగిసో ర‌బాడ ఐదు వికెట్లు ప‌డ‌గొట్టి కంగారుల ప‌తనాన్ని శాసించాడు.

అత‌డి పేస్ బౌలింగ్ దాటికి ఆసీస్ బ్యాట‌ర్లు విల్ల‌విల్లాడారు. ఖ‌వాజా, గ్రీన్‌, వెబ్‌స్టెర్‌, క‌మ్మిన్స్ వంటి కీల‌క వికెట్ల‌ను ర‌బాడ త‌న ఖాతాలో వేసుకున్నాడు. అత‌డితో పాటు  మార్కో జానెస‌న్ మూడు, మార్‌క్ర‌మ్, మ‌హారాజ్ త‌లా వికెట్ సాధించారు. ఆసీస్ ఇన్నింగ్స్‌లో వెబ్‌స్టెర్‌(72) టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా.. స్టీవ్ స్మిత్‌(66) ప‌రుగుల‌తో రాణించాడు. మిగితా బ్యాట‌ర్లంతా దారుణంగా విఫ‌ల‌మ‌య్యారు.

తుది జట్లు
ఆస్ట్రేలియా: ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, కామెరూన్‌ గ్రీన్, స్టీవ్‌ స్మిత్, హెడ్, వెబ్‌స్టర్, అలెక్స్ కేరీ (వికెట్‌ కీపర్‌), పాట్ కమిన్స్‌ (కెప్టెన్‌), మిచెల్ స్టార్క్, జోష్‌ హేజిల్‌వుడ్, నాథన్ లియోన్‌.

దక్షిణాఫ్రికా: ఐదెన్ మార్‌క్రమ్, ర్యాన్ రికిల్‌టన్, వియాన్ ముల్దర్, తెంబా బవుమా (కెప్టెన్‌), ట్రిస్టన్ స్టబ్స్, బెడింగ్‌టన్, కైల్‌ వెరీన్‌ (వికెట్‌ కీపర్‌), మార్కో యాన్సెన్, కేశవ్‌ మహరాజ్, కగిసో రబాడ, లుంగి ఎంగిడి.
 

Advertisement
 
Advertisement
Advertisement