ఆస్ట్రేలియాకు భారీ షాక్‌.. స్టీవ్ స్మిత్‌కు తీవ్ర గాయం | Steve Smith picks up nasty injury after risky attempt at slips on Day 3 | Sakshi
Sakshi News home page

WTC 2025: ఆస్ట్రేలియాకు భారీ షాక్‌.. స్టీవ్ స్మిత్‌కు తీవ్ర గాయం

Jun 13 2025 9:35 PM | Updated on Jun 13 2025 9:37 PM

Steve Smith picks up nasty injury after risky attempt at slips on Day 3

లార్డ్స్ వేదిక‌గా ద‌క్షిణాఫ్రికాతో జ‌రుగుతున్న వ‌ర‌ల్డ్ టెస్టు ఛాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్లో ఆస్ట్రేలియా సూప‌ర్ స్టార్ స్టీవ్ స్మిత్ గాయ‌ప‌డ్డాడు. మూడో రోజు ఆట సంద‌ర్భంగా స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తుండ‌గా స్మిత్ చేతి వేలికి గాయ‌మైంది. సౌతాఫ్రికా సెకెండ్ ఇన్నింగ్స్ 20వ ఓవ‌ర్ వేసిన మిచెల్ స్టార్క్‌.. రెండో బంతిని బావుమాకు షార్ట్ లెంగ్త్ డెలివ‌రీగా సంధించాడు.

ఆ బంతిని బావుమా లెగ్ సైడ్ ఆడేందుకు ప్ర‌య‌త్నించాడు. అయితే బంతి థిక్ ఎడ్జ్ తీసుకుని సెకెండ్ స్లిప్ దిశ‌గా వెళ్లింది. ఈ క్ర‌మంలో స్మిత్ ఆ క్యాచ్‌ను అందుకునే ప్ర‌య‌త్నం చేశాడు. ఈ ప్ర‌య‌త్నంలో బంతి బ‌లంగా స్మిత్  చిటికెన వేలికి తాకింది. దీంతో స్మిత్ తీవ్ర‌మైన నొప్పితో విల్ల‌విల్లాడు.

వెంట‌నే ఫిజియో సాయంతో స్మిత్ మైదానం నుంచి బ‌య‌ట‌కు వెళ్లిపోయాడు. అత‌డి స్దానంలో కొన్‌స్టాస్ స‌బ్‌స్ట్యూట్‌గా ఫీల్డ్‌లోకి వచ్చాడు. స్మిత్ గాయంపై క్రికెట్ ఆస్ట్రేలియా అప్‌డేట్ ఇచ్చింది. అత‌డి చిటికెన వేలు ఎముక ప‌క్క‌కు జ‌రిగింద‌ని క్రికెట్ ఆస్ట్రేలియా ఓ ప్రకటనలో పేర్కొంది. దీంతో త్వరలో వెస్టిండీస్‌తో జరనున్న టెస్టు సిరీస్‌కు స్మిత్‌ దూరమయ్యే అవకాశముంది.
 

Advertisement
 
Advertisement
Advertisement