India vs Aus 5th test: ఆస్ట్రేలియాతో డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్‌.. త‌డ‌బ‌డుతున్న సౌతాఫ్రికా | WTC Final 2025: South Africa bowling first against Australia, Playing 11 Detils | Sakshi
Sakshi News home page

India vs Aus 5th test: ఆస్ట్రేలియాతో డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్‌.. త‌డ‌బ‌డుతున్న సౌతాఫ్రికా

Jun 11 2025 2:57 PM | Updated on Jun 11 2025 10:43 PM

WTC Final 2025: South Africa bowling first against Australia, Playing 11 Detils

ఆస్ట్రేలియాతో డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్‌.. త‌డ‌బ‌డుతున్న సౌతాఫ్రికా
సౌతాఫ్రికా బ్యాట‌ర్లు సైతం తొలి ఇన్నింగ్స్‌లో త‌డ‌బ‌డుతున్నారు. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి సౌతాఫ్రికా 22 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 43 పరుగులు చేసింది. క్రీజులో బావుమా(3) ,  బెడింగ్‌టన్(8) ఉన్నారు. ఆసీస్ బౌల‌ర్ల‌లో  మిచెల్ స్టార్క్ రెండు వికెట్లు పడగొట్టగా జోష్‌ హేజిల్‌వుడ్, పాట్ కమిన్స్‌ చెరో వికెట్ సాధించారు. 

చెల‌రేగిన ర‌బాడ‌.. 212 ప‌రుగుల‌కు ఆసీస్ ఆలౌట్‌
డబ్ల్యూటీసీ ఫైనల్లో సౌతాఫ్రికా స్పీడ్‌స్టార్ కగిసో ర‌బాడ 5 వికెట్లతో చెల‌రేగాడు. దీంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు ఆస్ట్రేలియా త‌మ మొద‌టి ఇన్నింగ్స్‌లో 212 ప‌రుగుల‌కు ఆలౌటైంది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో వెబ్‌స్టెర్‌(72) టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా.. స్టీవ్ స్మిత్‌(66) ప‌రుగుల‌తో రాణించాడు. మిగితా బ్యాట‌ర్లంతా దారుణంగా విఫ‌ల‌మ‌య్యారు. ప్రోటీస్ బౌల‌ర్ల‌లో ర‌బాడ‌తో పాటు మార్కో జానెస‌న్ మూడు, మార్‌క్ర‌మ్, మ‌హారాజ్ త‌లా వికెట్ సాధించారు.

ఆసీస్‌ ఎనిమిదో వికెట్‌ డౌన్‌
ఆస్ట్రేలియా ఎనిమిదో వికెట్ కోల్పోయింది. 72 పరుగులు చేసిన వెబ్‌స్టెర్‌.. రబాడ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 55 ఓవర్లకు ఆసీస్ స్కోర్‌: 210/8

ఆసీస్ ఏడో వికెట్ డౌన్‌
199 ప‌రుగుల వ‌ద్ద ఆసీస్ ఏడో వికెట్ కోల్పోయింది. కేవ‌లం ఒక్క ప‌రుగు మాత్ర‌మే చేసిన కెప్టెన్ ప్యాట్ క‌మ్మిన్స్‌.. ర‌బాడ బౌలింగ్‌లో పెవిలియ‌న్‌కు చేరాడు. అంత‌కుముందు అలెక్స్ క్యారీ(23).. కేశ‌వ్ మ‌హారాజ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ‌య్యాడు.

ఆసీస్ ఐదో వికెట్ డౌన్.. ‍స్మిత్ ఔట్‌
స్టీవ్ స్మిత్ రూపంలో ఆసీస్ ఐదో వికెట్ కోల్పోయింది. 66 ప‌రుగులు చేసిన స్మిత్‌.. మార్‌క్ర‌మ్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. 44 ఓవ‌ర్ల‌కు ఆస్ట్రేలియా 5 వికెట్లు కోల్పోయి 161 ప‌రుగులు చేసింది. క్రీజులో వెబ్‌స్టెర్‌(48), అలెక్స్ క్యారీ(1) ఉన్నారు.

ఆచితూచి ఆడుతున్న స్మిత్‌, వెబ్‌స్టెర్‌
31 ఓవ‌ర్లు ముగిసే స‌రికి ఆసీస్ త‌మ తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల న‌ష్టానికి 94 ప‌రుగులు చేసింది. స్టీవ్ స్మిత్‌(45), వెబ్‌స్టెర్‌(8) ఆచితూచి ఆడుతున్నారు.

పంజా విసురుతున్న ప్రోటీస్ పేస‌ర్లు..
ట్రావిస్ హెడ్ రూపంలో ఆసీస్ నాలుగో వికెట్ కోల్పోయింది. 11 పరుగులు చేసిన హెడ్‌.. మార్కో జానెసన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. లంచ్ బ్రేక్ సమయానికి 23.2 ఓవర్లలో ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు కోల్పోయి 67 పరుగులు చేసింది. క్రీజులో స్మిత్(26) ఉన్నాడు. ప్రోటీస్ బౌలర్లలో రబాడ, జానెసన్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.

ఆసీస్‌ మూడో వికెట్‌ డౌన్‌.. లబుషేన్‌ ఔట్‌
మార్న‌స్ ల‌బుషేన్ రూపంలో ఆస్ట్రేలియా మూడో వికెట్ కోల్పోయింది. 17 ప‌రుగులు చేసిన ల‌బుషేన్‌.. జానెస‌న్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. క్రీజులోకి ట్రావెస్ హెడ్ వ‌చ్చాడు. 18 ఓవ‌ర్ల‌కు ఆసీస్ స్కోర్‌

ఆచితూచి ఆడుతున్న స్మిత్‌, లబుషేన్‌..
ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయిన ఆసీస్ జ‌ట్టును సీనియ‌ర్ బ్యాట‌ర్లు స్టీవ్ స్మిత్‌(17), ల‌బుషేన్‌(17) ఆదుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. 17 ఓవ‌ర్లు ముగిసే స‌రికి ఆస్ట్రేలియా రెండు వికెట్ల న‌ష్టానికి 41 ప‌రుగులు చేసింది.

రబాడ ఆన్ ఫైర్‌.. ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాను సౌతాఫ్రికా స్పీడ్‌స్టార్ కగిసో రబాడ బెంబెలెత్తిస్తున్నాడు. 7వ ఓవర్ వేసిన రబాడ బౌలింగ్‌లో ఉస్మాన్ ఖావాజా(0), గ్రీన్‌(4) వెంటవెంటనే పెవిలియన్‌కు చేరారు. 8 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్ రెండు వికెట్ల నష్టానికి 18 పరుగులు చేసింది. క్రీజులో లబుషేన్‌(10), స్మిత్‌(0) ఉన్నారు.

వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్-2025 ఫైన‌ల్ మ్యాచ్ ప్రారంభమైంది. ప్ర‌తిష్టాత్మక లార్డ్స్ వేదిక‌గా జ‌రుగుతున్న తుది పోరులో ద‌క్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జ‌ట్లు త‌ల‌ప‌డ‌తున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ద‌క్షిణాఫ్రికా తొలుత బౌలింగ్ ఎంచుకుంది.  ఆసీస్‌ జట్టులోకి కామెరూన్‌ గ్రీన్‌ తిరిగి రాగా.. సౌతాఫ్రికా టెస్టు టీమ్‌లోకి పేసర్‌ లుంగీ ఎంగిడీ పునరాగమనం​ చేశాడు.

ప్రోటీస్‌ జట్టుకు ఇది తొలి డబ్ల్యూటీసీ ఫైనల్‌ కాగా.. ఆసీస్‌కు రెండో ఫైనల్‌. ఈ ఆఖరి పోరులో ఎలాగైనా గెలిచి తొలి ఐసీసీ ట్రోఫీని సొంతం చేసుకోవాలని సఫారీలు భావిస్తుంటే, కంగూరులు మాత్రం మరో ఐసీసీ టైటిల్‌ను తమ ఖాతాలో వేసుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. అయితే చోకర్స్‌గా పేరొందిన దక్షిణాఫ్రికా, పటిష్టమైన ఆసీస్‌ను ఓడించడం అంతసులువు కాదు.

తుది జట్లు
ఆస్ట్రేలియా: ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, కామెరూన్‌ గ్రీన్, స్టీవ్‌ స్మిత్, హెడ్, వెబ్‌స్టర్, అలెక్స్ కేరీ (వికెట్‌ కీపర్‌), పాట్ కమిన్స్‌ (కెప్టెన్‌), మిచెల్ స్టార్క్, జోష్‌ హేజిల్‌వుడ్, నాథన్ లియోన్‌.

దక్షిణాఫ్రికా: ఐదెన్ మార్‌క్రమ్, ర్యాన్ రికిల్‌టన్, వియాన్ ముల్దర్, తెంబా బవుమా (కెప్టెన్‌), ట్రిస్టన్ స్టబ్స్, బెడింగ్‌టన్, కైల్‌ వెరీన్‌ (వికెట్‌ కీపర్‌), మార్కో యాన్సెన్, కేశవ్‌ మహరాజ్, కగిసో రబాడ, లుంగి ఎంగిడి.
చదవండి: శ్రేయస్‌ అయ్యర్‌ కోసం భారత సెలెక్టర్లపై ధ్వజమెత్తిన గంగూలీ

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement