
జూన్ 11 నుంచి లార్డ్స్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగే డబ్ల్యూటీసీ 2023-25 ఫైనల్ కోసం 15 మంది సభ్యుల సౌతాఫ్రికా జట్టును ఇవాళ (మే 13) ప్రకటించారు. ఈ జట్టుకు సారధిగా టెంబా బవుమా వ్యవహరించనున్నాడు. ఈ జట్టులో ఏకంగా ఆరుగురు పేసర్లకు (కగిసో రబాడ, లుంగి ఎంగిడి, మార్కో జన్సెన్, వియన్ ముల్దర్, డేన్ ప్యాటర్సన్, కార్బిన్ బాష్) చోటు దక్కింది. లార్డ్స్ పిచ్ పేసర్లకు అనుకూలంగా ఉండనుండటంతో సౌతాఫ్రికా సెలక్టర్లు ఈ మేరకు నిర్ణయించారు.
పేస్ దళంతో పోలిస్తే సౌతాఫ్రికా బ్యాటింగ్ విభాగం కాస్త బలహీనంగా కనిపిస్తుంది. ఆ జట్టులో బవుమా, మార్క్రమ్ మినహా అనుభవజ్ఞులైన బ్యాటర్లు లేరు. రికెల్టన్, స్టబ్స్, డేవిడ్ బెడింగ్హమ్ లాంటి పరిమిత ఓవర్ల స్టార్లు ఉన్నా టెస్ట్‌ల్లో వారు ఏ మేరకు రాణించగలరో చూడాలి.
TEMBA BAVUMA ANNOUCING SOUTH AFRICA SQUAD FOR WTC FINAL. 🥶🔥 pic.twitter.com/uZbtbcxAGn
— Johns. (@CricCrazyJohns) May 13, 2025
డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం సౌతాఫ్రికా జట్టు: టెంబా బావుమా (కెప్టెన్), ఎయిడెన్ మార్క్రమ్, లుంగి ఎంగిడి, టోనీ డి జోర్జి, డేవిడ్ బెడింగ్హమ్, కేశవ్ మహరాజ్, ట్రిస్టన్ స్టబ్స్, కార్బిన్ బాష్, సెనురన్ ముత్తుసామి, మార్కో జన్సెన్, కగిసో రబడ, కైల్ వెర్రెయిన్, డేన్ ప్యాటర్సన్, వియాన్ ముల్డర్, ర్యాన్ రికెల్టన్.
కాగా, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో సౌతాఫ్రికాకు ఇదే తొలి ఫైనల్. 1998 ఐసీసీ నాకౌట్ ట్రోఫీ తర్వాత ఆ జట్టు ఇప్పటివరకు ఒక్క ఐసీసీ టైటిల్ కూడా గెలవలేదు. మరోవైపు ఫైనల్లో సౌతాఫ్రికా ఎదుర్కోబోయే ఆస్ట్రేలియా డబ్ల్యూటీసీలో డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఉంది.
ఆ జట్టు గత ఎడిషన్ (2021-23) ఫైనల్లో భారత్‌పై విజయం సాధించి ఛాంపియన్‌గా అవతరించింది. ఆస్ట్రేలియా కూడా ఇవాళే జట్టును ప్రకటించింది. ఆసీస్ జట్టుకు సారధిగా పాట్ కమిన్స్ వ్యవహరించనున్నాడు. ఆల్‌రౌండర్ కెమారూన్ గ్రీన్ చాలా కాలం తర్వాత ఆసీస్ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు.
డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం ఆస్ట్రేలియా జట్టు: పాట్ కమిన్స్, స్కాట్ బోలాండ్, అలెక్స్ క్యారీ, కెమారూన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్, ట్రవిస్ హెడ్, జోస్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖ్వాజా, సామ్ కొన్‌స్టాస్, మ్యాట్ కుహ్నేమన్, మార్నస్ లబూషేన్, నాథన్ లియోన్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, బ్యూ వెబ్‌స్టర్
ట్రావెలింగ్ రిజర్వ్: బ్రెండన్ డాగెట్
ఐపీఎల్ జట్టుకు షాక్
డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం ఇవాళ ప్రకటించిన ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా జట్లలో 13 మంది ఐపీఎల్ స్టార్లు చోటు దక్కించుకున్నారు. వీరిలో ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఐదుగురు కాగా.. సౌతాఫ్రికాకు చెందిన వారు ఎనిమిది మంది. ఐపీఎల్ 2025 పూర్తైన వారం రోజులకే డబ్ల్యూటీసీ ఫైనల్ మొదలు కానుండటంతో ఈ 13 మంది ఆటగాళ్లు క్యాష్ రిచ్ లీగ్‌కు ఏమేరకు అందుబాటులో ఉంటారో అన్నది ప్రశ్నార్థకంగా మారింది.
డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఎంపికైన ఐపీఎల్ 2025 స్టార్లు..
ఆసీస్ ఆటగాళ్లు..
పాట్ కమిన్స్ (ఎస్‌ఆర్‌హెచ్)
ట్రవిస్ హెడ్ (ఎస్‌ఆర్‌హెచ్)
జోష్ హాజిల్‌వుడ్ (ఆర్సీబీ)
జోస్ ఇంగ్లిస్ (పంజాబ్)
మిచెల్ స్టార్క్ (ఢిల్లీ)
సౌతాఫ్రికా ఆటగాళ్లు..
మార్క్రమ్ (లక్నో)
ఎంగిడి (ఆర్సీబీ)
స్టబ్స్ (ఢిల్లీ)
కార్బిన్ బాష్ (ముంబై ఇండియన్స్)
ర్యాన్ రికెల్టన్ (ముంబై ఇండియన్స్)
జన్సెన్ (పంజాబ్)
రబాడ (గుజరాత్)
ముల్దర్ (ఎస్‌ఆర్‌హెచ్)