
సౌతాఫ్రికా స్టార్ ప్లేయర్ ఐడైన్ మార్‌క్రమ్.. జూన్ నెలకు గాను ఐసీసీ ప్లేయర్ ఆఫ్‌ది మంత్ అవార్డు గెలుచుకున్నాడు. గత నెలలో డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఆస్ట్రేలియాపై అద్బుత ప్రదర్శనకు గాను మార్‌క్రమ్‌కు ఈ ప్రతిషాత్మక అవార్డు దక్కింది. ఫైనల్ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన మార్‌క్రమ్..సౌతాఫ్రికాకు 28 ఏళ్ల తర్వాత తొలి ఐసీసీ టైటిల్‌ను అందించాడు.
ఈ మ్యాచ్‌లో బంతితో కూడా అతడు రాణించాడు. ఈ అవార్డు కోసం మార్‌క్రమ్‌తో పాటు తన సహచరుడు టెంబా బావుమా, శ్రీలంక ఓపెనర్ పాతుమ్ నిస్సాంక పోటీ పడ్డారు. కానీ కీలకమైన ఫైనల్లో సెంచరీతో చేయడంతో మార్‌క్రమ్ వారిద్దరిని వెనక్కి నెట్టి ఈ అవార్డును సొంతం చేసుకున్నాడు.
ఈ ప్రతిష్టత్మక ఐసీసీ అవార్డు అందుకోవడం తనకు దక్కిన అరుదైన గౌరవమని మార్‌క్రమ్ ఓ ప్రకటనలో పేర్కొన్నాడు. మరోవైపు మహిళల విభాగంలో ఈ అవార్డును వెస్టిండీస్ కెప్టెన్ హీలీ మాథ్యూస్ సొంతం చేసుకుంది. గత నెలలో దక్షిణాఫ్రికా మహిళల జట్టుతో జరిగిన వన్డే, టీ20 సిరీస్‌లలో మాథ్యూస్ ఆసాధరణ ప్రదర్శన కనబరిచింది.
రెండు సిరీస్‌లలోనూ ఆల్ రౌండ్ షోతో మాథ్యూస్ అదరగొట్టింది. దీంతో ఆమె దక్షిణాఫ్రికాకు చెందిన టాజ్మిన్ బ్రిట్స్, వెస్టిండీస్‌స్పిన్నర్ అఫీ ఫ్లెచర్‌లను అధిగమించి ఈ అవార్డును గెలుచుకుంది.
చదవండి: IND vs ENG: సిరాజ్‌కు భారీ షాకిచ్చిన ఐసీసీ