
సౌతాఫ్రికా స్టార్ ఆల్‌రౌండర్ కార్బిన్ బాష్ కు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) షాకిచ్చింది. మంగళవారం డార్విన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో తమ ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనించనందుకు బాష్‌కు ఓ డీమెరిట్ పాయింట్ ఐసీసీ విధించింది.
ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.5 ని ఉల్లంఘించినందుకు ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. గత 24 నెలలలో ఇదే తొలి తప్పిదం అయినందున కేవలం ఒక డీమెరిట్ పాయింట్‌తో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ సరిపెట్టింది.
అసలేమి జరిగిందంటే?
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 17వ ఓవర్ వేసిన కర్బిన్ బాష్ అద్బుతమైన బంతితో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ బెన్ డ్వార్షుయిస్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. అయితే ఔట్ చేసిన అనందంలో బాష్ సెలబ్రేషన్స్ శ్రుతిమించాయి. బాష్ డ్వార్షుయిస్ వైపు వేలు చూపిస్తూ ఆడింది చాలు ఇక వెళ్లు అన్నట్లు సైగ చేశాడు.
దీంతో అతడు ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.5 ను ఉల్లంఘనకు పాల్పడినట్లు మ్యాచ్ రిఫరీ గుర్తించాడు. ఒక అంతర్జాతీయ మ్యాచ్‌లో బ్యాటర్‌ను ఔట్ చేసినప్పుడు బౌలర్లు సదరు బ్యాటర్‌ను కించపరిచే లేదా దుర్భలాషలడడం వంటి ఆర్టికల్ 2.5 ఉల్లంఘనకు కిందకు వస్తాయి.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఆసీస్‌పై 53 పరుగుల తేడాతో సౌతాఫ్రికా విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సఫారీలు సమం చేశారు. ఇరు జట్ల మధ్య నిర్ణయాత్మక మూడో టీ20కె యిర్న్స్ వేదికగా ఆగస్టు 16న జరగనుంది.
చదవండి: IND vs AUS: ఆసీస్ గడ్డపై వేటకు సిద్దమవుతున్న కింగ్ కోహ్లి..