చాంపియన్స్ అని ఊరికే అనలేదు.. ఇదీ కమ్‌బ్యాక్ అంటే! | Fans Hail Cummins-Matt Renshaw-Heroic Australian Recovery Vs SA 1st Test | Sakshi
Sakshi News home page

SA Vs AUS: చాంపియన్స్ అని ఊరికే అనలేదు.. ఇదీ కమ్‌బ్యాక్ అంటే!

Oct 10 2026 4:41 PM | Updated on Oct 10 2026 5:06 PM

Fans Hail Cummins-Matt Renshaw-Heroic Australian Recovery Vs SA 1st Test

Photo Credit: Twitter

డర్బన్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా ఇచ్చిన కమ్‌బ్యాక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది.  తొలిరోజు ఆట ప్రారంభమైన కాసేపటికే నిప్పులు చెరిగే బంతులతో సౌతాఫ్రికా బౌలర్లు విజృంభిస్తుండడంతో ఆస్ట్రేలియా పని అయిపోయిందనుకున్నారు. సఫారీ బౌలర్ల ధాటికి చూస్తుండగానే ఆసీస్‌ టాపార్డర్‌, మిడిలార్డర్ పేక మేడలా కూలింది. 

124 పరుగులకే ఆరు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో కూరుకుపోయింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ పాట్ కమిన్స్‌, మాట్ రెన్‌షాలు సఫారీ బౌలర్లను తట్టుకొని ధైర్యంగా నిలబడ్డారు.ఈ ఇద్దరు కలిసి మొదటి రోజు ఆటను 187-6 స్కోరు వద్ద ముగించారు. ఇక రెండో రోజు తొలి సెషన్‌లోనే ఆస్ట్రేలియా పని పడదామనుకున్న సౌతాఫ్రికా బౌలర్లకు ఈ ఇద్దరు ముచ్చెమటలు పట్టించారు. 

తొలి సెషన్‌లో మరో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయిన ఆసీస్ 250 పరుగుల మార్క్‌ను దాటింది. ఈ దశలో తన కెరీర్‌లో ఒక మరిచిపోలేని అద్భుత ఇన్నింగ్స్ ఆడిన కమిన్స్ (98 బంతుల్లో 43) ఔటైనప్పటికీ, మిచెల్ స్టార్క్ (25 బంతుల్లో ఆరు పరుగులు) సఫారీ బౌలర్లకు అడ్డుగా నిలిచాడు. ఈ దశలో రెన్ షా వీరోచిత శతకంతో మెరిశాడు. లంచ్ అనంతం ఆస్ట్రేలియా 300 మార్క్‌ను కూడా దాటింది. 

కనీసం రెండొందల మార్క్‌ను చేరుతుందా అనుకున్న దశలో కమిన్స్‌, మాట్ రెన్ షాల వీరోచిత పోరాటం ఆసీస్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టింది. దీంతో వీరిద్దరు ఇప్పుడు సోషల్ మీడియాలో హీరోలుగా మారిపోయారు. ముఖ్యంగా కెప్టెన్ కమిన్స్‌ను సోషల్ మీడియాలో ఆకాశానికి ఎత్తేశారు. 

‘ఒక కెప్టెన్ అంటే ఎలా ఆడాలన్నదానికి కమిన్స్ నిర్వచనం’.. ‘ఇది రా కమ్‌బ్యాక్ అంటే’.. ‘కమిన్స్‌, రెన్ షాల పోరాటం గురించి ఎంత చెప్పుకున్న తక్కువే.. ఏమి కమ్‌బ్యాక్ ఇచ్చార్రా బాబు’..‘అందుకే టెస్టుల్లోనూ చాంపియన్స్ అనిపించుకున్నారు’.. ‘మీ వీరోచిత ఇన్నిం‍గ్స్‌లకు ఇదే మా సలామ్‌’ అని కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా 107 ఓవర్లు ముగిసేసరికి 8 వికెట్లు కోల్పోయి 305 పరుగులు చేసింది. మాట్ రెన్ షా (130), నాథన్ లియోన్ (7) క్రీజులో ఉన్నారు.

 

ఇదీ చ‌ద‌వండి: 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement