Photo Credit: Twitter
డర్బన్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా నిలదొక్కుకుంది. మిడిలార్డర్ బ్యాటర్ మాట్ రెన్ షా (210 బంతుల్లో 100 నాటౌట్) వీరోచిత సెంచరీతో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. కెప్టెన్ పాట్ కమిన్స్ (43) రాణించాడు. ఒక దశలో 124 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా పీకల్లోతూ కష్టాల్లో పడింది.
ఈ ఇద్దరు కలిసి ఏడో వికెట్‌కు 86 పరుగులు జోడించారు. ప్రస్తుతం లంచ్ విరామ సమయానికి ఆస్ట్రేలియా 96 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 277 పరుగులు చేసింది. రెన్ షా (102), నాథన్ లియోన్ (7) పరుగులతో క్రీజులో ఉన్నారు. సౌతాఫ్రికా బౌలర్లలో వియాన్ ముల్డర్ నాలుగు వికెట్లు తీయగా, మార్కో జాన్సెన్, నోర్ట్జే చెరో 2 వికెట్లు పడగొట్టారు.
👉మాట్ రెన్ షాకు టెస్టుల్లో ఇది రెండో సెంచరీ కాగా, తొమ్మిదిన్నరేళ్ల తర్వాత 19 ఇన్నింగ్స్‌ల అనంతరం రెన్ షా టెస్టుల్లో శతకం మార్క్ అందుకున్నాడు. ఇక 2017లో పాకిస్తాన్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో రెన్ షా తన తొలి శతకాన్ని సాధించాడు. ఇప్పటివరకు ఆస్ట్రేలియా తరఫున రెన్ షా 15 టెస్టులు, 15 వన్డేలు, 9 టీ20 మ్యాచ్‌లు ఆడాడు.
👉2022 తర్వాత ఒక విదేశీ బ్యాటర్ డర్బన్‌లో సెంచరీ చేయడం నాలుగేళ్లలో ఇదే తొలిసారి. 2022లో బంగ్లాదేశ్ బ్యాటర్ మహ్మదుల్ హసన్ జాయ్ (137 పరుగులు) సెంచరీ సాధించాడు.
👉2014 తర్వాత సౌతాఫ్రికా గడ్డపై ఆస్ట్రేలియా బ్యాటర్ సెంచరీ చేయడం మళ్లీ ఇదే. 2014లో కేప్‌టౌన్ టెస్టులో డేవిడ్ వార్నర్ (145 పరుగులు) సెంచరీ సాధించాడు. తాజాగా 12 ఏళ్ల తర్వాత మళ్లీ సౌతాఫ్రికా గడ్డపై మరో ఆస్ట్రేలియా బ్యాటర్ సెంచరీ బాదాడు.
👉2009 తర్వాత డర్బన్ (కింగ్స్‌మీడ్ మైదానం) టెస్టులో ఒక ఆసీస్ బ్యాటర్ శతకం మార్క్ అందుకోవడం విశేషం. 2009లో ఫిలిప్ హ్యూజ్ (160 పరుగులు) సెంచరీతో మెరిశాడు.
A Test Hundred After 9 Years For Matt Renshaw His 2nd Overall What A Gritty Knock Under Pressure 😮💨🔥 https://t.co/Ti0HMB16WD
— Cricket Dani (@CricketDani56) October 10, 2026
1st Test century in 2017 vs Pakistan 2nd Test cenutry in 2026 vs South Africa Almost a decade later, Renshaw is back to three figures in Tests! 💯 #MattRenshaw #SAvsAUS https://t.co/VE0tMsV5Jp
— CREX (@Crex_live) October 10, 2026
ఇదీ చదవండి:


