Photo Credit: Twitter
సౌతాఫ్రికా దిగ్గజం, మిస్టర్ 360 డిగ్రీ ప్లేయర్‌గా పేరు పొందిన ఏబీ డివిలియర్స్ ప్రస్తుతం వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (డబ్ల్యూసీఎల్-2026)లో ఆడుతున్న సంగతి తెలిసిందే. సౌతాఫ్రికా చాంపియన్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న ఏబీ డివిలియర్స్ 42 ఏళ్ల వయసులోనూ బ్యాటింగ్‌లో అదరగొడుతున్నాడు. ఆస్ట్రేలియా చాంపియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో డివిలియర్స్ (40 బంతుల్లోనే 111 నాటౌట్; 6 ఫోర్లు, 11 సిక్సర్లు) ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు.
తద్వారా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి చాలా కాలమే అయినప్పటికీ, డివిలియర్స్ ఆటతీరులో మాత్రం ఏ మార్పు లేదు. అంతర్జాతీయ క్రికెట్ ఆడేటప్పుడు ఎలాంటి విధ్వంసం సృష్టించేవాడో.. ఇప్పుడు కూడా అదే ఆటతీరుతో ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నాడు. ఈ నేపథ్యంలో డివిలియర్స్ మళ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో ఎంట్రీ ఇస్తే చూడాలని ఉందని ఈతరం అభిమానులు కోరుకుంటున్నారు.
దీనిపై డివిలియర్స్ మ్యాచ్ అనంతరం స్పందించాడు. ‘‘కేవలం నా పిల్లల కోసమే డబ్ల్యూసీఎల్ టోర్నీ ఆడుతున్నాను. నా పిల్లలు పుట్టినప్పుడు ఆటగాడిగా కొనసాగాను. కానీ వాళ్లు పెరిగి పెద్దవాళ్లయ్యేటప్పటికీ ఆట నుంచి వీడ్కోలు తీసుకున్నా. వాళ్లు నా ఆటను చూడలేదన్న ఒక్క కారణంతోనే.. డివిలియర్స్ ఆట ఎలా ఉంటుందో రుచి చూపించాలని భావించాను.
అందుకు డబ్ల్యూసీఎల్ నాకు ఒక చక్కటి వేదికగా మారింది. వచ్చిన ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నాను. నేను మైదానంలో బ్యాట్ పట్టి షాట్లు ఆడుతుంటే స్టాండ్స్‌లో నా పిల్లలు ఎంజాయ్ చేయడం కళ్లారా చూడడం సంతోషంగా అనిపిస్తోంది. వారి నుంచి నేను కోరుకున్నది ఈ సంతోషమే. పిల్లలు నా ఆటను ఎంజాయ్ చేస్తుంటే నేను పడుతున్న శ్రమను పూర్తిగా మరిచిపోయేలా చేస్తుంది.’’ అని చెప్పుకొచ్చాడు.
ఇది విన్న ఆర్సీబీ అభిమానులు.. ‘‘ప్లీజ్ డివిలియర్స్ మళ్లీ ఐపీఎల్‌లో ఒక సీజన్ ఆడొచ్చుగా, అవసరమైతే మీ పిల్లల పర్మిషన్ మేము తీసుకుంటాము, కానీ ఒక్క మ్యాచ్ అయినా మాకోసం ఆడండి ప్లీజ్’’ అని కామెంట్లు చేస్తున్నారు. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. సౌతాఫ్రికా చాంపియన్స్ 8 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా చాంపియన్స్‌ను ఓడించింది.
తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా చాంపియన్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. డీఆర్సీ షార్ట్ (66), డేవిడ్ వార్నర్ (48), జో బర్న్స్ (38 నాటౌట్) రాణించారు. సౌతాఫ్రికా బౌలర్లలో హార్డస్ విజోన్ మూడు వికెట్లు తీశాడు. అనంతరం సౌతాఫ్రికా చాంపియన్స్ 15.4 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి 210 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. డివిలియర్స్ (111 నాటౌట్) అజేయ శతకం సాధించగా, రిచర్డ్ లెవీ (62) అర్థశతకం చేశాడు.
42 YEARS OLD. STILL UNSTOPPABLE. 🤯 AB de Villiers turned back the clock with a sensational 37-ball century in the WCL! 🐐 #ABdeVilliers #WCL #Mr360 https://t.co/fC7PPI8YIB
— CREX (@Crex_live) October 10, 2026
🔴ONLY ONE PERSON CAN CONVINCED AB TO TAKE HIS RETIREMENT BACK 🤯 🎙️: Ab De Villiers said that the only reason why he's playing this tournament is his kids never got to see him play live much. And the way he's been playing I'm sure his kids must be asking to take the retirement back play one more time in IPL for RCB. 😭🔥❤️.
— Sam (@cricsam02) October 9, 2026
ఇదీ చదవండి:


