అత‌డిని ఆడించ‌డం దండ‌గ‌.. ప్లీజ్ జట్టు నుంచి తీసేయండి! | Fans-Criticise-No-Use-Remove-Shivam-Dube-Instead-Select-Nitish-Reddy | Sakshi
Sakshi News home page

అత‌డిని ఆడించ‌డం దండ‌గ‌.. ప్లీజ్ జట్టు నుంచి తీసేయండి!

Oct 10 2026 12:50 PM | Updated on Oct 10 2026 1:47 PM

Fans-Criticise-No-Use-Remove-Shivam-Dube-Instead-Select-Nitish-Reddy

Photo Credit: Twitter

వెస్టిండీస్‌తో రెండో టీ20లో టీమిండియా ఓట‌మి అనంత‌రం జ‌ట్టు ఆల్‌రౌండ‌ర్ శివ‌మ్ దూబేపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. బ్యాటింగ్‌లో ప్ర‌మోష‌న్ పొందిన శివ‌మ్ దూబే దానికి న్యాయం చేయ‌లేక‌పోయాడు. నిజానికి ఇషాన్ కిష‌న్ త‌ర్వాత కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ బ్యాటింగ్‌కు రావాలి. డ‌గౌట్‌లో కూడా అయ్య‌ర్ ప్యాడ్లు క‌ట్టుకొని బ్యాట్ ప‌ట్టుకొని రెడీగా ఉన్నాడు. ఇషాన్ కిష‌న్ ఔట్ కాగానే, అయ్య‌ర్ వ‌స్తాడ‌ని అంతా భావించారు. 

కానీ గంభీర్ శ్రేయ‌స్‌ను పిలిచి శివ‌మ్ దూబే పంపించాల‌ని కోరాడు. లెఫ్ట్-రైట్ కాంబినేష‌న్‌తో ప‌రుగులు ఎక్కువ‌గా వ‌స్తాయ‌ని గంభీర్ వివ‌రించాడు. దీంతో శ్రేయ‌స్ త‌న స్థానంలో దూబేను పంపాడు. వాస్త‌వానికి దూబే స్పిన్న‌ర్ల‌ను మంచిగా ఆడ‌గ‌ల‌డు. కుదురుకోవ‌డానికి ఎక్కువ స‌మ‌యం కూడా తీసుకోడు. కానీ నిన్న‌టి మ్యాచ్‌లో మాత్రం రోస్టన్ చేజ్ బౌలింగ్‌లో ఆడ‌డంలో ఇబ్బంది ఎదుర్కొన్న శివ‌మ్ దూబే 10 బంతులాడి ఏడు ప‌రుగులు మాత్ర‌మే చేసి ఔట‌య్యాడు. 

స్కోరును పెంచాల్సిన స‌మ‌యంలో అత‌డి స్లో బ్యాటింగ్‌తో టీమిండియాకు ప‌రుగులు త‌గ్గాయి.  దూబే స్లో ఇన్నింగ్స్ భారత్ రన్ రేట్‌ను తగ్గించింది. ఇది మొత్తం స్కోరుపై ప్రభావం చూపింది, దీంతో భారత్ లక్ష్యానికి కనీసం 30 పరుగుల వెనుకబడింది. ఒక‌వేళ‌ శివమ్ స్థానంలో ఫామ్‌లో ఉన్న శ్రేయస్ అయ్యర్ వ‌చ్చి ఉంటే.. భారత్ స్కోరు 280కి పైగా ఉండేది. అప్పుడు విండీస్ ఎంత ధాటిగా ఆడినా భార‌త్‌కే గెలిచే అవకాశం ఎక్కువ‌గా ఉండేది.

బ్యాటింగ్‌లో విఫ‌ల‌మైనా బౌలింగ్‌తో ఆక‌ట్టుకుంటాడ‌నుకుంటే నిరాశ‌ప‌రిచాడు. గ‌త 10 ఇన్నింగ్స్‌ల్లో 5 ఇన్నింగ్స్‌ల్లో బౌలింగ్ చేసిన దూబే కేవ‌లం నాలుగు వికెట్లు మాత్ర‌మే తీసి ప‌రుగులు భారీగా ఇచ్చుకున్నాడు. దీంతో అటు బ్యాటింగ్‌లో.. ఇటు బౌలింగ్‌లో వ‌రుస‌గా విఫ‌ల‌మ‌వుతున్న‌ప్ప‌టికీ శివ‌మ్ దూబేను ఆడించ‌డంపై విమ‌ర్శ‌లు పెరిగాయి. 

అత‌డిని జ‌ట్టులో ఉంచ‌డం దండ‌గ అని, అత‌డి  స్థానంలో తెలుగు క్రికెట‌ర్ నితీశ్‌కుమార్ రెడ్డికి ఒక అవ‌కాశం ఇస్తే బాగుంటుంద‌ని అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు. క‌నీసం మూడో టీ20లోనైనా దూబే స్థానంలో నితీశ్‌రెడ్డిని ఆడించాల‌నే విజ్ఞ‌ప్తులు పెరిగాయి. అయితే శివ‌మ్ దూబేను మాత్రం హెడ్‌కోచ్ గంభీర్ వెనుకేసుకొచ్చాడు.

"ప్రపంచ కప్‌లోనూ, అంతకు ముందు కూడా మేము శివమ్‌ను చాలా కాలంగా ఇలాగే ఉపయోగిస్తున్నాం. ఇది ఒక్కసారి జరిగిన సంఘటన కాదు. ఈ మ్యాచ్‌లో మేము అంచ‌నాలు త‌ప్పాం. ఇది అంతర్జాతీయ క్రికెట్‌.. కొన్నిసార్లు మనకు అనుకూలంగా .. మ‌రికొన్నిసార్లు ప్ర‌తికూలంగా ఉంటుంది. అన్నింటికన్నా ముఖ్యంగా, మేము మా బ్యాటింగ్ లైనప్‌ విషయంలో ఎప్పుడూ సరళంగానే ఉన్నాం, ఇకపైనా అలాగే కొనసాగిస్తాం. టీ20 క్రికెట్‌లో ఓపెనర్లు మాత్రమే స్థిరంగా ఉంటారని నేను ముందే చెప్పాను.’’ అని గంభీర్ తెలిపాడు.

ఇదీ చదవండి:

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement