మ్యాచ్ ఓట‌మిపై గంభీర్ ఆగ్ర‌హం.. వాళ్లను రిస్క్‌లో పెడుతున్నాం! | Gambhir-Slams-Balanced-Pitches-Must-WI-Historic-Run-Chase-Vs-IND | Sakshi
Sakshi News home page

మ్యాచ్ ఓట‌మిపై గంభీర్ ఆగ్ర‌హం.. వాళ్ల కెరీర్‌ను రిస్క్‌లో పెడుతున్నాం!

Oct 10 2026 12:05 PM | Updated on Oct 10 2026 12:24 PM

Gambhir-Slams-Balanced-Pitches-Must-WI-Historic-Run-Chase-Vs-IND

Photo Credit: BCCI Twitter

రాంచీ వేదిక‌గా జ‌రిగిన రెండో టీ20లో 250 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఛేదించిన వెస్టిండీస్ జ‌ట్టు టీమిండియాకు ఊహించ‌ని షాక్ ఇచ్చింది. మ్యాచ్‌లో కీల‌క ఇన్నింగ్స్ ఆడిన షెర్ఫేన్ రూథ‌ర్‌ఫోర్డ్ ఇచ్చిన‌ క్యాచ్‌ జార‌విడ‌వ‌డం టీమిండియా కొంప‌ముంచింద‌ని చెప్పొచ్చు. మ్యాచ్‌కు ట‌ర్నింగ్ పాయింట్ కూడా అదే. ఇక కెప్టెన్ షెయ్ హోప్‌తో క‌లిసి రూథ‌ర్‌ఫోర్డ్ చేసిన విధ్వంసం మాములుగా లేదు. 

ఈ ఇద్ద‌రు నాలుగో వికెట్‌కు 120 ప‌రుగులు జోడించి మ్యాచ్ గ‌మనాన్ని నిర్దేశించారు. రూథ‌ర్‌ఫోర్డ్ ఔటైన‌ప్ప‌టికీ హోప్ చివ‌రి దాకా నిల‌బ‌డి భారీ సిక్స‌ర్‌తో సెంచ‌రీ చేయ‌డ‌మే గాక జ‌ట్టును గెలిపించాడు. మొత్తం మీద రెండు జ‌ట్లు క‌లిపి 38.3 ఓవ‌ర్ల‌లోనే 502 ప‌రుగులు సాధించాయి. దీంతో రాంచీలోని జేఎస్‌సీఏ క్రికెట్ స్టేడియం పిచ్‌పై విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. బ్యాలెన్సింగ్‌గా రూపొందించాల్సిన పిచ్‌ను కాస్తా బ్యాటింగ్‌కు అనుకూలంగా మార్చేశారంటూ భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ఈ నేప‌థ్యంలో టీమిండియా హెడ్ కోచ్ గౌత‌మ్ గంభీర్ భారీ ల‌క్ష్యం నిర్దేశించిన‌ప్ప‌టికీ ఓడిపోవ‌డంపై స్పందించాడు. మ్యాచ్ ఓట‌మి అనంత‌రం నిర్వ‌హించిన ప్రెస్ కాన్ఫ‌రెన్స్‌లో మాట్లాడాడు. తాను ఎవ‌రినీ నిందించ‌లేన‌ని, త‌మ బౌల‌ర్లు క‌ష్ట‌ప‌డ్డార‌ని, కానీ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్న‌ప్పుడు ఎవ‌రు మాత్రం ఏం చేయ‌గ‌ల‌ర‌ని పేర్కొన్నాడు. పిచ్ రూప‌క‌ల్ప‌న అనేది బ్యాట్‌కు, బంతికి స‌మానంగా ఉండేలా చూడాల్సిన అవ‌స‌ర‌ముంద‌న్నాడు. 

రిస్క్‌లో బౌలర్ల కెరీర్‌..
గంభీర్ ఇంకా మాట్లాడుతూ.. ‘‘బ్యాట్‌కు, బంతికి మ‌ధ్య మంచి పోటీ ఉండాల‌నే మ‌నంద‌రం కోరుకుంటున్నాం. కానీ ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో బౌల‌ర్ల కెరీర్‌లు ప్ర‌మాదంలో ప‌డుతున్నాయి. వారు డ్రెస్సింగ్ రూమ్‌లోకి వ‌చ్చేందుకు ఎంత‌గానో శ్ర‌మిస్తారు. బ్యాట్‌కు, బంతికి స‌మాన‌మైన పోటీ ఉన్న‌ప్పుడే మెరుగైన ఆట సాధ్య‌మ‌వుతుంది. ఇక మ్యాచ్‌ పరిస్థితులను పరిశీలిస్తే.. రోస్టన్‌ చేజ్‌ స్పెల్‌ ఆటను మలుపు తిప్పింది. మ్యాచ్‌ ఫలితంపై ప్రభావం చూపింది. 

ఈ పిచ్‌పై అతడు బౌలింగ్‌ చేసిన విధానం అద్భుతం. తన లైన్‌ను మార్చుకుంటూ బ్యాటర్లను అయోమయానికి గురిచేశాడు. ముఖ్యంగా వెస్టిండీస్‌ లాంటి ప్రమాదకర జట్లపై భారీ స్కోర్లను కాపాడుకోవాలంటే మనమూ కొత్త మార్గాలను అన్వేషించాలి. ఈ ఓటమికి ఎవరినీ బాధ్యులుగా చూపలేను. ఎవరినీ నిందించలేను. 250 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయామన్నదే అసలు విషయం. వెస్టిండీస్‌ బ్యాటర్లు అద్భుతంగా ఆడారు. వారు విజయానికి అర్హులు. మేం ఇంకా చాలా విషయాల్లో మెరుగుపడాల్సి ఉంది'' అని గంభీర్ స్పష్టం చేశాడు.

కావాలని క్యాచ్‌లు విడవరు..
మ్యాచ్‌లో క్యాచ్‌లు జారవిడవడంపై గంభీర్‌కు ప్రశ్న ఎదురైంది. ‘టాస్‌ మన చేతుల్లో ఉండదు. క్యాచ్‌లు జారవిడవడం గతంలోనూ జరిగింది.. భవిష్యత్తులోనూ జరగొచ్చు. ఎవరూ ఉద్దేశపూర్వకంగా క్యాచ్‌లు వదలరు. అందుకే ఇలాంటి విషయాల్లో ఎవరినీ నిందించలేం. ఎంత స్కోర్ చేస్తే గెలవగలమనే విషయాన్ని చెప్పలేం. రెండు వికెట్లు త్వరగా తీసిన తర్వాత 250 పరుగులు మంచి స్కోరని అనుకున్నాం. కానీ బ్యాటింగ్‌లో వెస్టిండీస్‌ సాధించిన దానికి కచ్చితంగా క్రెడిట్‌ ఇవ్వాలి’ అని గంభీర్ వివరించాడు.

ఇదీ చదవండి: 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement