నా బాడీ 40 ఏళ్లు అంటోంది.. ఐడీ 31 చూపిస్తోంది.. 20 ఏళ్ల వాడిలా నటిస్తున్నా: డికాక్‌ భావోద్వేగం

My Body Tells Im 40 ID Says 31: De Kock Gets Emotional Final Home ODI - Sakshi

SA Vs Aus 5th ODI- Quinton de Kock gets emotional: సౌతాఫ్రికా వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ క్వింటన్‌ డికాక్‌ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. సొంతగడ్డపై ఆఖరి వన్డే ఆడుతున్న ఈ లెఫ్టాండర్‌ శరీరం సహకరించని కారణంగానే ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నాడు. కాగా వన్డే వరల్డ్‌కప్‌-2023​ తర్వాత తాను అంతర్జాతీయ వన్డేలకు వీడ్కోలు పలుకనున్నట్లు డికాక్‌ ప్రకటన చేసిన విషయం తెలిసిందే.

డికాక్‌ కంట నీటిచెమ్మ
ఆస్ట్రేలియాతో సిరీస్‌ స్వదేశంలో ఆఖరిదని పేర్కొన్నాడు. ఈ క్రమంలో ఆదివారం ఆసీస్‌తో ఐదో వన్డే ఆరంభానికి ముందు డికాక్‌ తన ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ ఎమోషనల్‌ అయ్యాడు. జాతీయ గీతం ఆలపిస్తున్న సమయంలో అతడి కళ్లు చెమర్చిన దృశ్యాలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

30 ఏళ్లకే ఎందుకిలా?
కాగా స్టార్‌ బ్యాటర్‌గా పేరొందిన డికాక్‌ ఇప్పటికే టెస్టులకు గుడ్‌ బై చెప్పిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు వన్డేల నుంచి కూడా తప్పుకొంటున్నాడు. 30 ఏళ్ల వయసులోనే డికాక్‌ ఇలా రిటైర్మెంట్‌ ప్రకటించడం అభిమానులను నిరాశ పరిచింది.

సిగ్గుపడాల్సిందేమీ లేదు
ఈ నేపథ్యంలో క్వింటన్‌ డికాక్‌ ఈసీఎస్‌పీఎన్‌క్రిక్‌ఇన్ఫోతో మాట్లాడుతూ.. ‘‘నా టెస్టు కెరీర్‌ ముగిసిన సమయంలో ఇలాంటి భావన కలిగింది. మళ్లీ ఇప్పుడు కూడా! టెస్టుల్లో ఆడాలని శక్తిమేర ప్రయత్నించాను. కానీ నా వల్ల కాలేదు.

50 టెస్టులు ఆడిన తర్వాత రిటైర్మెంట్‌ అవడం సరైందేనా అని నా సన్నిహితులను అడిగాను. ఇతర ఫార్మాట్లపై దృష్టి పెట్టడం కోసం ఇలా చేయడానికి ఏమాత్రం సిగ్గుపడాల్సిన అవసరం లేదని చెప్పారు.

శరీరం 40 ఏళ్లు అంటోది.. 20 ఏళ్ల వాడిలా నటిస్తున్నా
గత 10-11 ఏళ్లలో ఎన్నో మధుర జ్ఞాపకాలు మూటగట్టుకున్నాను. నా శరీరమేమో నాకు 40 ఏళ్లని చెబుతోంది.. కానీ ఐడీ మాత్రం నాకింకా 31 ఏళ్లే అని చూపిస్తోంది.. మానసికంగా నేను 20 ఏళ్లవాడిలా నటించేందుకు ఇప్పుడు కూడా ప్రయత్నిస్తూనే ఉన్నాను’’ అని ఉద్వేగానికి లోనయ్యాడు. 

అబుదాబి టూర్‌ మొదలు ఇండియాలో టెస్టులు.. ముఖ్యంగా శ్రీలంక పర్యటనలో అనుభవాల గురించి డికాక్‌ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నాడు. కాగా టీ20 లీగ్‌లలో ఆడటం ద్వారా ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చని.. అందుకే తాను కూడా పొట్టి ఫార్మాట్‌పైనే దృష్టి సారించాలనుకున్నానని డికాక్‌ పేర్కొన్నాడు.

అవును.. ఎక్కవ డబ్బులు వస్తాయి.. కానీ
జాతీయ జట్టును విజయపథంలో నిలిపే క్రమంలో మాత్రం ఎప్పుడూ తాను వెనకడుగు వేయలేదని ఈ లెఫ్టాండర్‌ వ్యాఖ్యానించడం గమనార్హం. ఒకవేళ కేవలం డబ్బు గురించే ఆలోచించి ఉంటే ఐదేళ్ల క్రితమే రిటైర్‌ అయ్యేవాడినని పేర్కొన్నాడు. కాగా ఆసీస్‌తో ఐదో వన్డేలో క్వింటన్‌ డికాక్‌ నాథన్‌ ఎల్లిస్‌ బౌలింగ్‌లో అవుటయ్యాడు. సొంతగడ్డపై ఆఖరి వన్డేలో 27 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు.

న్యూజిలాండ్‌తో సిరీస్‌ సందర్భంగా అరంగేట్రం
2012లో న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌ సందర్భంగా డికాక్‌ సౌతాఫ్రికా తరఫున అరంగేట్రం చేశాడు. ఆ మరుసటి ఏడాది వన్డేల్లోనూ ఎంట్రీ ఇచ్చాడు. 2014లో టెస్టుల్లోనూ అడుగుపెట్టాడు. తన అంతర్జాతీయ కెరీర్‌లో క్వింటన్‌ డికాక్‌.. టెస్టుల్లో 3300, వన్డేల్లో 6176, టీ20లలో 2907 పరుగులు సాధించాడు. 

చదవండి: WC 2023: ఫిట్‌గా ఉన్నా శ్రేయస్‌ అయ్యర్‌కు నో ఛాన్స్‌! ఇక మర్చిపోవాల్సిందేనా?

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

14-11-2023
Nov 14, 2023, 13:41 IST
టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మపై అతని వ్యక్తిగత కోచ్‌ దినేశ్‌ లాడ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్‌ వయసుపై, ప్రస్తుత...
14-11-2023
Nov 14, 2023, 12:57 IST
సాక్షి, విశాఖపట్నం: భారత్, న్యూజిలాండ్‌ మధ్య జరిగే ప్రపంచ కప్‌ సెమీఫైనల్‌ మ్యాచ్‌ను తిలకించేందుకు  ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ (ఏసీఏ)...
14-11-2023
Nov 14, 2023, 11:41 IST
వన్డే వరల్డ్‌కప్‌ 2023లో ఘోర వైఫల్యాలను ఎదుర్కొని, లీగ్‌ దశలోనే ఇంటిబాట పటి​న శ్రీలంక ఇంటాబయటా ముప్పేట దాడిని ఎదుర్కొంటుంది....
14-11-2023
Nov 14, 2023, 10:32 IST
వన్డే వరల్డ్‌కప్‌ 2023లో తొమ్మిది వరుస విజయాలు సాధించి లీగ్‌ దశలో అజేయ జట్టుగా నిలిచిన భారత్‌.. బుధవారం జరుగబోయే...
14-11-2023
Nov 14, 2023, 08:13 IST
వన్డే వరల్డ్‌కప్‌ 2023 రౌండ్‌ రాబిన్‌ లీగ్‌ దశ మ్యాచ్‌లు ముగిసాయి. పాయింట్ల పట్టికలో టాప్‌-4లో నిలిచిన భారత్‌, సౌతాఫ్రికా,...
14-11-2023
Nov 14, 2023, 07:34 IST
భారత్‌-నెదర్లాండ్స్‌ మ్యాచ్‌తో వన్డే వరల్డ్‌కప్‌ 2023 రౌండ్‌ రాబిన్‌ (లీగ్‌) దశ మ్యాచ్‌లు ముగిసాయి. పాయింట్ల పట్టికలో టాప్‌-4లో నిలిచిన...
14-11-2023
Nov 14, 2023, 01:57 IST
సంపూర్ణం... లీగ్‌ దశలో భారత్‌ జైత్రయాత్ర! నెదర్లాండ్స్‌ జట్టుతో మిగిలిన లాంఛనాన్ని ఫుల్‌ ప్రాక్టీస్‌తో టీమిండియా ముగించింది. టాపార్డర్‌ బ్యాటర్లు...
13-11-2023
Nov 13, 2023, 20:11 IST
వన్డే వరల్డ్‌కప్‌లో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తన సూపర్‌ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు.  టోర్నీలో ఇప్పటికే 500కిపైగా పరుగులు చేసిన...
13-11-2023
Nov 13, 2023, 19:25 IST
వన్డే వరల్డ్‌కప్‌-2023లో సెమీఫైనల్స్‌ సమరానికి సమయం అసన్నమైంది. ఈ మెగా టోర్నీ తొలి సెమీఫైనల్లో నవంబర్‌ 15 ముంబై వేదికగా...
13-11-2023
Nov 13, 2023, 18:35 IST
వన్డేప్రపంచకప్‌-2023 లీగ్‌ దశను అద్బుత విజయంతో ముగించిన టీమిండియా.. ఇప్పుడు సెమీఫైనల్‌లో సత్తాచాటేందుకు సిద్దమైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా...
13-11-2023
Nov 13, 2023, 17:45 IST
వన్డే ప్రపంచకప్‌-2023 లీగ్‌ స్టేజీలో తొమ్మిది విజయాలతో ఆజేయంగా నిలిచిన ఇప్పుడు సెమీఫైనల్స్‌ సమరానికి సిద్దమైంది. ఈ మెగా టోర్నీలో...
13-11-2023
Nov 13, 2023, 15:59 IST
వన్డే ప్రపంచకప్‌-2023లో దారుణ ప్రదర్శన కనబరిచిన పాకిస్తాన్‌ జట్టు.. లీగ్‌ దశలోనే ఇంటిముఖం పట్టింది. ఈ క్రమంలో పాకిస్తాన్‌ బౌలింగ్‌...
13-11-2023
Nov 13, 2023, 15:28 IST
వన్డే ప్రపంచకప్‌-2023లో టీమిండియా వరుసగా 9వ విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. నెదర్లాండ్స్‌తో జరిగిన ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో 160...
13-11-2023
Nov 13, 2023, 15:00 IST
వన్డే ప్రపంచకప్‌-2023 తుది అంకానికి చేరుకుంది. ఈ మెగా టోర్నీలో భాగంగా నవంబర్‌ 12న బెంగళూరు వేదికగా జరిగిన భారత్‌-నెదర్లాండ్స్‌...
13-11-2023
Nov 13, 2023, 12:11 IST
వన్డే వరల్డ్‌కప్‌ 2023లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా పలు ప్రపంచకప్‌ రికార్డులను కొల్లగొట్టింది. ఈ మ్యాచ్‌లో వ్యక్తిగత...
13-11-2023
Nov 13, 2023, 11:45 IST
వన్డే వరల్డ్‌కప్-2023లో తొమ్మిది వరుస విజయాలు సాధించి, లీగ్‌ దశ అనంతరం అజేయ జట్టుగా నిలిచిన భారత్‌.. ఆదివారం నెదర్లాండ్స్‌పై...
13-11-2023
Nov 13, 2023, 11:16 IST
వన్డే వరల్డ్‌కప్‌ 2023లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 2 వికెట్లు పడగొట్టిన రవీంద్ర జడేజా వరల్డ్‌కప్‌ సింగిల్‌ ఎడిషన్‌లో భారత్‌...
13-11-2023
Nov 13, 2023, 10:55 IST
నెదర్లాండ్స్‌పై విక్టరీతో వన్డే వరల్డ్‌కప్‌ 2023లో వరుసగా తొమ్మిది విజయాలు సాధించిన టీమిండియా ఓ అరుదైన ఘనత సాధించింది. వరల్డ్‌కప్‌...
13-11-2023
Nov 13, 2023, 09:28 IST
వన్డే వరల్డ్‌కప్‌-2023లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా మిడిలార్డర్‌ బ్యాటర్లు కేఎల్‌ రాహుల్‌ (63 బంతుల్లో 102; 11...
13-11-2023
Nov 13, 2023, 08:48 IST
వన్డే వరల్డ్‌కప్‌-2023లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా అదిరిపోయే విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత...

మరిన్ని ఫొటోలు 

Read also in:
Back to Top