Photo Credit: Twitter
డర్బన్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ చరిత్ర సృష్టించాడు. టెస్టు క్రికెట్‌లో 21వ శతాబ్ధంలో ఒక్క సిక్సర్ కూడా ఇవ్వకుండా అత్యధిక బంతులు వేసిన బౌలర్‌గా స్టార్క్ తన రికార్డును (5,495 బంతులు) మరింత మెరుగుపరుచుకున్నాడు. తాజాగా సౌతాఫ్రికాతో టెస్టులోనూ స్టార్క్ ఆ రికార్డును కొనసాగిస్తూ వస్తున్నాడు.
ఇప్పటివరకు స్టార్క్ 5,495 బంతుల పాటు ఒక్క సిక్సర్ కూడా ఇవ్వకుండా తొలి స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక రెండో స్థానంలో ఇంగ్లండ్ దిగ్గజ బౌలర్ జేమ్స్ అండర్సన్ (4,688 బంతులు) ఉండగా.. స్టార్క్, అండర్సన్ మధ్య దాదాపు వంద బంతుల వ్యత్యాసం ఉండడం విశేషం. ఇక టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా (4,478 బంతులు) మూడో స్థానంలో కొనసాగుతుండగా, ఇంగ్లండ్ మాజీ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ (4,302 బంతులు, ఇంగ్లండ్) నాలుగు, కివీస్ మాజీ పేసర్ కొలిన్ డి గ్రాండ్‌హోమ్ ( 4,054 బంతులు) ఐదు స్థానాల్లో ఉన్నారు.
ఇక మ్యాచ్ విషయానికొస్తే నాలుగు రోజు ఆట మొదలవ్వగా.. ఆస్ట్రేలియా తమ రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 87 పరుగులు చేసింది. లబుషేన్ (16), స్మిత్ (3) పరుగులతో క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం ఆసీస్ 193 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. ఇక ఆసీస్ బౌలర్ల ధాటికి సౌతాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్‌లో 284 పరుగులకు ఆలౌటైంది.
డేవిడ్ బెడింగ్‌హమ్ (49) టాప్ స్కోరర్‌గా నిలవగా, మార్కరమ్ (37), సిమోన్ హార్మర్ (35) పర్వాలేదనిపించారు. ఆసీస్ బౌలర్లలో కెప్టెన్ పాట్ కమిన్స్ మూడు వికెట్లు తీయగా, స్టార్క్, హాజిల్‌వుడ్, నాథన్ లయోన్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. అంతకముందు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 390 పరుగులకు ఆలౌటైంది. మాట్ రెన్‌షా (190) వీరోచిత సెంచరీ చేయగా, కమిన్స్ (43) రాణించాడు. వియాన్ ముల్డర్ 4 వికెట్లు తీశాడు.
🚨 MOST BALLS WITHOUT CONCEDED A SIXES IN TEST CRICKET 🚨 5495 balls - Mitchell Starc 4477 balls - Jasprit Bumrah......See more https://t.co/wCXWZ9Fsnf
— VIKAS (@Vikas662005) October 11, 2026
ఇదీ చదవండి:


