Photo Credit: Twitter
టీమిండియా సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా రంజీ ట్రోఫీలో సెంచరీతో మెరిశాడు. సౌరాష్ట్రకు ప్రాతినిధ్యం వహిస్తున్న జడేజా ఛత్తీస్‌గఢ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో శతకం సాధించాడు. 205 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్న జడేజా 102 పరుగుల వద్ద ధర్మేంద్ర సిన్హా జడేజా బౌలింగ్‌లో ఆఖరి వికెట్‌గా వెనుదిరిగాడు. జడ్డూ ఇన్నింగ్స్‌లో ఏడు ఫోర్లు ఉన్నాయి.
కాగా జడేజా కెరీర్‌లో ఇది 16వ ఫస్ట్‌క్లాస్ సెంచరీ. జడేజాకు తోడు మిడిలార్డర్ బ్యాటర్ ప్రేరక్ మన్కడ్ (150 బంతుల్లో 129) కూడా సెంచరీ చేయడంతో సౌరాష్ట్ర 392 పరుగులు చేసింది. అంతకముందు ఓపెనర్ చిరాగ్ జాని (83) అర్థసెంచరీతో రాణించాడు. ఛత్తీస్‌గఢ్ బౌలర్లలో దేవ్ ఆదిత్య సింగ్ ఐదు వికెట్లతో చెలరేగగా, ధర్మేంద్ర సిన్హా జడేజా, రుద్రప్రతాప్ దెహారి చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన ఛత్తీస్‌గఢ్ ఆరు ఓవర్లలో వికెట్ నష్టానికి 22 పరుగులు చేసింది.
ఇటీవలే వెస్టిండీస్‌తో జరిగిన మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో ఆడిన జడేజా రెండు మ్యాచ్‌లాడి రెండు వికెట్లు పడగొట్టాడు. బ్యాటింగ్‌లో మాత్రం అవకాశం రాలేదు. ఈ నెల చివరి వారంలో న్యూజిలాండ్ పర్యటన నేపథ్యంలో జడేజా రంజీల్లో సౌరాష్ట్ర తరఫున ఆడుతున్నాడు. వన్డే, టెస్టుల్లో మాత్రమే కొనసాగుతున్న జడేజా ముఖ్యంగా రెడ్‌బాల్ క్రికెట్‌పై దృష్టి సారించాడు. అందుకే రంజీల్లో సౌరాష్ట్ర తరఫున ఆడుతున్న జడ్డూ బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ మెరిసి కివీస్‌తో సిరీస్‌కు ముందు ప్రాక్టీస్‌గా ఉపయోగించుకుంటున్నాడు.
ఇదీ చదవండి:


