సౌతాఫ్రికాతో టెస్టు.. ఆసీస్‌ బౌలర్‌ ప్రపంచ రికార్డు | Nathan Lyon-World Record-Complete 1000 Test Runs-Batting-Number-10 | Sakshi
Sakshi News home page

సౌతాఫ్రికాతో టెస్టు.. ఆసీస్‌ బౌలర్‌ ప్రపంచ రికార్డు

Oct 11 2026 1:47 PM | Updated on Oct 11 2026 2:35 PM

Nathan Lyon-World Record-Complete 1000 Test Runs-Batting-Number-10

డర్బన్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా స్టార్ స్పిన్నర్ నాథన్ లియోన్ ప్రపంచ రికార్డుతో మెరిశాడు. టెస్టుల్లో పదో నెంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చి వెయ్యి పరుగుల మైలురాయిని చేరుకున్న తొలి బ్యాటర్‌గా నాథన్ లియోన్ రికార్డులకెక్కాడు. 98 ఇన్నింగ్స్‌ల్లో లియోన్ ఈ ఘనత సాధించాడు. 

గతంలో పదో నెంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చి టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో ఇంగ్లండ్ మాజీ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ (825 పరుగులు)దే అత్యుత్తమంగా ఉండేది. తాజాగా నాథన్ లియోన్ 1000 పరుగుల మార్క్ దాటి ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు.

పదో నెంబర్‌లో వచ్చి టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్లు
👉నాథన్ లియోన్ -1019 పరుగులు
👉స్టువర్ట్ బ్రాడ్ 825 పరుగులు
👉నీల్ వాగ్నర్‌- 594 పరుగులు
👉డేల్ స్టెయిన్- 568 పరుగులు
👉టిమ్ సౌథీ- 511 పరుగులు
👉వకార్ యూనిస్- 496 పరుగులు
👉బిషన్ బేడీ- 470 పరుగులు
ఓవరాల్‌గా నాథన్ లియోన్ 143 టెస్టుల్లో 1705 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోరు 47గా ఉంది. ఇక తన స్పిన్ బౌలింగ్‌తో 571 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు.

ఇక మ్యాచ్‌లో 27 పరుగులు చేసిన నాథన్ లియోన్ మాట్ రెన్‌షాకు తనవంతు సహకారం అందించాడు. ఈ నేపథ్యంలోనే ఈ ఇద్దరు కలిసి తొమ్మిదో వికెట్‌కు రికార్డు స్థాయిలో 134 పరుగులు జోడించారు. తద్వారా సౌతాఫ్రికాపై టెస్టు‍ల్లో తొమ్మిదో వికెట్‌కు ఈ జోడి నెలకొల్పిన 134 పరుగుల భాగస్వామ్యం అత్యుత్తమంగా నిలిచింది.

దక్షిణాఫ్రికా గడ్డపై టెస్టుల్లో 9వ వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యాలు:
👉195 - మార్క్ బౌచర్ & పాట్ సిమ్‌కాక్స్ (దక్షిణాఫ్రికా) వర్సెస్‌ పాకిస్తాన్, జోహన్నెస్‌బర్గ్, 1998
👉134 - నాథన్ లియోన్, మాట్ రెన్‌షా (ఆస్ట్రేలియా) వర్సెస్‌ దక్షిణాఫ్రికా, డర్బన్, 2026*
👉106 - జేమ్స్ అండర్సన్, గ్రేమ్ స్వాన్ (ఇంగ్లాండ్) వర్సెస్‌ దక్షిణాఫ్రికా, సెంచూరియన్, 2009

టెస్టుల్లో ఆస్ట్రేలియా తరఫున 9వ వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యాలు:
👉154 - జాక్ బ్లాక్‌హామ్, సిడ్ గ్రెగొరీ వర్సెస్ ఇంగ్లాండ్, సిడ్నీ, 1894
👉134 - నాథన్ లియోన్, మాట్ రెన్‌షా  వర్సెస్‌ దక్షిణాఫ్రికా, డర్బన్, 2026*
👉133 - జాసన్ గిల్లెస్పీ , స్టీవ్ వా వర్సెస్ భారత్‌, కోల్‌కతా, 2001

మ్యాచ్ విషయానికొస్తే, మాట్ రెన్‌షా (190) వీరోచిత పోరాటంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నిం‍గ్స్‌లో 390 పరుగులకు ఆలౌటైంది. ఒక దశలో 124 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయిన దశలో కమిన్స్‌, రెన్‌షాలు ఆసీస్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. ఈ ఇద్దరు ఏడో వికెట్‌కు 84 పరుగులు జోడించారు. 

అనంతరం టెయిలెండర్లతో కలిసి వీరోచిత పోరాటం చేసిన రెన్‌షా పది పరుగుల తేడాతో డబుల్ సెంచరీని చేజార్చుకున్నాడు. దక్షిణాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 59 పరుగులు చేసింది. బెడింగ్‌హమ్ (30), మార్కరమ్ (28) క్రీజులో ఉన్నారు.

ఇదీ చదవండి: 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement